Y.S.R. Cuddapah

News August 8, 2024

వివేక హత్య కేసుపై.. కడప SPని కలిసిన YS సునిత

image

కడప ఎస్పీ హర్షవర్ధన్‌ రాజును వివేకా కుమార్తె సునీతరెడ్డి బుధవారం కలిశారు. తన తండ్రి హత్య కేసుకు సంబంధించి ఎస్పీతో సునీత చర్చించారు. గత ప్రభుత్వంలో తన తండ్రి హత్య కేసులో సీబీఐకి, తమకు పోలీసులు సహకరించలేదని, స్థానిక పోలీసులు నిందితులకు అండగా నిలిచారన్నారు. ఈ కేసులో తప్పుచేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని కోరారు. విచారణ సమయంలో స్థానిక పోలీసులు కేసును నీరుగార్చేలా వ్యవహరించారని అన్నారు.

News August 8, 2024

ప్రొద్దుటూరు: ఇటుకలు మీదపడి బేల్దారి మృతి

image

ప్రొద్దుటూరు మౌలానా ఆజాద్ వీధిలో ఇంటి నిర్మాణ పని జరుగుతుండగా ఇటుకలు మీద పడటంతో బేల్దారి పల్లా విశ్వనాథ్ (46) మృతి చెందాడు. బుధవారం మౌలానా ఆజాద్ వీధిలో నూతన ఇంటి నిర్మాణ పనులకు విశ్వనాథ్ వెళ్లాడు. యంత్రం సహాయంతో కింద ఉన్న ఇటుకలను భవనం పైకి చేర్చే క్రమంలో ప్రమాదవశాత్తు కొన్ని ఇటుకలు జారి విశ్వనాథ్‌పై పడ్డాయి. జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వన్ టౌన్ సీఐ శ్రీకాంత్ తెలిపారు.

News August 8, 2024

కడప ‘డ్రాప్ అవుట్ రహిత జిల్లాగా మార్చడానికి కృషి’

image

జిల్లాలోని బడి ఈడు పిల్లలందరూ తప్పనిసరిగా బడిలో ఉండేలా చర్యలు తీసుకోవాలని జిల్లా విద్యాశాఖ అధికారి అనురాధ అన్నారు. కడప నగరంలోని జయనగర్ కాలనీ హైస్కూల్లో మండల విద్యాశాఖ అధికారులకు, సమగ్ర శిక్ష ఎంఐఎస్ కోఆర్డినేటర్లకు బుధవారం జరిగిన ఓరియంటేషన్ ప్రోగ్రాంలో ఆమె మాట్లాడుతూ.. డ్రాప్ అవుట్ రహిత జిల్లాగా జిల్లాను మార్చాల్సిన బాధ్యత మనందరిపై ఉందని పేర్కొన్నారు.

News August 8, 2024

కడప: బాలికపై అత్యాచారం.. కేసు నమోదు

image

కడపలోని ఓ జూనియర్ కళాశాలలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న విద్యార్థినిని మహేశ్ అనే యువకుడు కిడ్నాప్ చేసి ఓ లాడ్జికి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. వారు లాడ్జిలో ఉన్నట్లు విద్యార్థిని అన్న ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు అక్కడికి చేరుకోగా అతడు పరారయ్యాడు. బాలికను కిడ్నాప్ చేసి అత్యాచారానికి పాల్పడిన నేరానికి నిందితుడిపై బుధవారం పోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ భాస్కర్ తెలిపారు.

News August 8, 2024

కడప: హెల్మెట్ ధరించండి.. ప్రమాదాలను నివారించండి

image

హెల్మెట్ ధరించండి.. ప్రమాదాలు నివారించండని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఛైర్మన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.శ్రీదేవి, సెక్రటరీ, సీనియర్ సివిల్ జడ్జి ఎస్.బాబా ఫక్రుద్దీన్ తెలిపారు. బుధవారం కడప జిల్లా కోర్టు ఆవరణలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో వివిధ వర్గాల వారికి ఉచితంగా 1700 హెల్మెట్లను పంపిణీ, 50 వీల్ ఛైర్లను పంపిణీ చేశారు. కలెక్టర్ శివశంకర్, ఎస్పీ హర్షవర్ధన్ రాజు పాల్గొన్నారు.

News August 7, 2024

సూపర్ సిక్స్ పథకాలు ఎక్కడ బాబు: మాజీ ఎమ్మెల్యే RRR

image

రాష్ట్ర ప్రజలకు టీడీపీ ఎన్నికల మేనిఫెస్టోలో సూపర్ సిక్స్ పథకాలు ప్రకటించి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు అమలు చేయడంలో నిర్లక్ష్యం చేస్తున్నారని వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మాజీ ఎమ్మెల్యే రమేశ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. రాయచోటిలోని తన కార్యాలయంలో బుధవారం రమేశ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. కల్లబొల్లి మాటలతో ప్రజలను మభ్యపెట్టి పథకాలు అమలు చేస్తున్నారని ఆరోపించారు.

News August 7, 2024

ఒంటిమిట్ట రామాలయ మరమ్మత్తులకు భూమి పూజ

image

ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామి దేవాలయ మరమ్మత్తులకు బుధవారం రాష్ట్ర పురావస్తు శాఖ ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా రామాలయంలోని గర్భాలయం, అంతరాలయం, విమానాగోపురం, రంగ మండపాన్ని రాష్ట్ర పురావస్తు శాఖ సూపర్డెంట్ గోపీనాథ్ జన పర్యవేక్షణలో ఇంజినీరింగ్ శాఖ వారు కొలతలు తీసుకున్నారు. అనంతరం మరమ్మత్తు పనులు చేసే గుత్తేదారులకు వారు దిశా నిర్దేశాలు చేశారు.

News August 7, 2024

సైనిక పాఠశాలకు నిధులు కేటాయింపు చేయాలి: ఎంపీ అవినాశ్

image

పులివెందుల మండల పరిధిలోని నల్లపురెడ్డిపల్లిలో ఏర్పాటు చేయబోయే సైనిక పాఠశాలకు విస్తృత స్థాయిలో నిధులు కేటాయింపు చేయాలని కేంద్ర రక్షణ శాఖ కార్యదర్శి శ్రీ గిరిధర్ అరమనేను కోరినట్లు ఎంపీ అవినాశ్ రెడ్డి పేర్కొన్నారు. నిధులు కేటాయింపు చేసి త్వరలోనే భవనాలు కూడా పూర్తి చేసే విధంగా తగిన చర్యలు తీసుకోవాలని లేఖలో కోరినట్లు వెల్లడించారు.

News August 7, 2024

మైదుకూరు: కరెంట్ షాక్‌తో మహిళ మృతి

image

మైదుకూరు మున్సిపాలిటీ పరిధిలోని లింగాలదిన్నెలో బుధవారం మధ్యాహ్నం ప్రమాదవశాత్తు విద్యుత్ ప్రమాదంలో ధనికెల చిన్నక్క(28) అనే మహిళ మృతి చెందింది. గ్రామ సమీపంలోని పంట పొలంలో గల విద్యుత్ మోటార్ వద్దకు వెళ్లిన చిన్నక్క ప్రమాదవశాత్తు విద్యుత్ ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే మృతి చెందింది. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News August 7, 2024

రైల్వేకోడూరు: లారీ బైక్ ఢీ.. వ్యక్తి స్పాట్ డెడ్

image

రైల్వేకోడూరు- మైసూరు వారిపల్లి దగ్గర బైక్‌లో వస్తున్న వ్యక్తి లారీని ఢీకొని అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికుల వివరాల ప్రకారం.. మృతుని పేరు కిరణ్ కుమార్ రెడ్డి(23) అని ఇతను కోడూరు నుంచి మాధవరంపోడుకు వళ్తున్న సమయంలో ఈ ఘటన జరిగిందన్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ట్రాఫిక్‌ని క్లియర్ చేసి కేసు నమోదు చేశారు.