news

News August 22, 2025

చిరంజీవికి నారా లోకేశ్, అల్లు అర్జున్ విషెస్

image

మెగాస్టార్ చిరంజీవికి సినీ, రాజకీయ ప్రముఖులు, అభిమానుల నుంచి పుట్టిన రోజు <<17480281>>శుభాకాంక్షలు<<>> వెల్లువెత్తుతున్నాయి. ‘సినిమా, సమాజానికి మీరు చేసిన అద్భుతమైన కృషి గర్వకారణం, స్ఫూర్తిదాయకం’ అని మంత్రి లోకేశ్, ‘వన్ అండ్ ఓన్లీ మెగాస్టార్ చిరంజీవి గారికి జన్మదిన శుభాకాంక్షలు’ అని అల్లు అర్జున్ ట్వీట్ చేశారు. వీరితో పాటు తెలుగు రాష్ట్రాల మంత్రులు, సినీ హీరోలు, దర్శకులు విషెస్ తెలియజేస్తున్నారు.

News August 22, 2025

ప్రకాశ్ రాజ్ ట్వీట్ చంద్రబాబు, పవన్ గురించేనా?

image

క్రిమినల్ కేసుల్లో అరెస్టయి 30రోజులు జైల్లో ఉంటే PM, CMల పదవి పోయేలా కేంద్రం <<17465755>>కొత్త బిల్లును<<>> తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై తనకో చిలిపి సందేహం కలిగిందని నటుడు ప్రకాశ్ రాజ్ ట్వీట్ చేశారు. ‘మాజీ సీఎం కానీ ప్రస్తుత CM కానీ తమ మాట వినకపోతే అరెస్టు చేసి, “మీ మాట వినే ఉపముఖ్యమంత్రిని” CM చేసే కుట్ర ఏమైనా ఉందా?’ అని ప్రశ్నించారు. ఆయన ఈ ట్వీట్‌ను తెలుగులో చేయడంతో ఇది AP గురించేనని చర్చ మొదలైంది.

News August 22, 2025

గోడ దూకి పార్లమెంటు భవనంలోకి..

image

ఢిల్లీలోని పార్లమెంటు ప్రాంగణంలో సెక్యూరిటీ వైఫల్యం చోటుచేసుకుంది. ఓ వ్యక్తి గోడ దూకి పార్లమెంటు భవనంలోకి ప్రవేశించాడు. ఈ ఉదయం 6.30 గంటలకు ఈ ఘటన జరిగింది. పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News August 22, 2025

స్వల్పంగా తగ్గిన బంగారం ధర

image

నిన్న పెరిగిన బంగారం ధరలు ఇవాళ కాస్త తగ్గాయి. HYD బులియన్ మార్కెట్‌లో ఇవాళ 24 క్యారెట్ల పసిడి 10 గ్రాములపై రూ.220 తగ్గి రూ.1,00,530కు చేరింది. ఇక 22 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాములపై రూ.150 పతనమై రూ.92,150 పలుకుతోంది. అటు KG వెండి ధరపై రూ.2,000 పెరిగి రూ.1,28,000గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.

News August 22, 2025

చిరిగిన చొక్కాతోనే తాళికట్టిన చిరు!

image

చిరంజీవి 70వ పుట్టినరోజు సందర్భంగా ఆయన పెళ్లిలో జరిగిన ఓ ఆసక్తికర ఘటన మరోసారి వైరలవుతోంది. చిరు పెళ్లిరోజు MSరెడ్డి నిర్మించిన ‘తాతయ్య ప్రేమలీలలు’ చిత్రంలో ఓ పాట షూట్‌ చేస్తున్నారు. డ్రెస్ మార్చుకునే టైంలేక చిరిగిన చొక్కాతోనే పెళ్లిపీటలపై కూర్చున్నారు. ఎవరో చొక్కా చిరిగింది అనగానే.. ‘షర్ట్ చిరిగితే తాళి కట్టనివ్వరా?’ అని కొంటెగా బదులిచ్చారు. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.

News August 22, 2025

వరంగల్ ఎయిర్‌పోర్ట్.. ఎకరానికి రూ.1.20 కోట్లు జమ

image

TG: వరంగల్ మామునూరు విమానాశ్రయం కోసం భూసేకరణ ప్రక్రియ వేగవంతమైంది. వ్యవసాయ భూములకు ఎకరానికి రూ.1.20 కోట్ల చొప్పున 48 మంది రైతుల ఖాతాల్లో రూ.34 కోట్లు జమ చేశారు. మొత్తం 253 ఎకరాలను సేకరించనుండగా ఇందుకోసం రూ.205 కోట్లు కేటాయించింది. అటు వ్యవసాయేతర భూమి(ఓపెన్ ప్లాట్లు)కి గజానికి రూ.4వేల వరకు ఇస్తామని ప్రభుత్వం చెప్పగా స్థానికులు ఒప్పుకోవట్లేదు. గజానికి రూ.12వేలు ఇవ్వాలంటున్నారు.

News August 22, 2025

నోరా ఫతేహీలా మారాలంటూ భార్యకు టార్చర్

image

హీరోయిన్ నోరా ఫతేహీలా మారాలంటూ తన భర్త వేధింపులకు గురిచేస్తున్నట్లు UPకి చెందిన ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘజియాబాద్‌కు చెందిన మహిళకు 6 నెలల క్రితం టీచర్‌తో వివాహం జరిగింది. కట్నం కింద అతడికి రూ.76 లక్షలు ఇచ్చారు. కానీ ఆమె లావుగా ఉండటంతో 3 గంటలు వ్యాయామం చేయాలని, నోరా ఫతేహీలా మారాలని టార్చర్ చేస్తున్నాడు. తనకు అబార్షన్ అయ్యేలా మాత్రలు కూడా ఇచ్చాడు. దీంతో ఆమె పోలీసులను ఆశ్రయించారు.

News August 22, 2025

కొత్త అప్డేట్ ఎందుకంటే?

image

చాలా ఫోన్‌లలో గతంలోని ‘కాల్ ఇంటర్‌ఫేజ్’ ఇప్పుడు కనిపించడం లేదు. గూగుల్ ఫోన్ యాప్ ‘మెటీరియల్ 3 ఎక్స్‌ప్రెసివ్ రీడిజైన్‌’ను విడుదల చేయడమే <<17480188>>ఈ మార్పుకు<<>> కారణం. పాత డిజైన్ వల్ల జేబులో నుంచి ఫోన్ తీసేటప్పుడు అనుకోకుండా కాల్ ఆన్సర్ లేదా డిక్లైన్ అవుతోందని, దాన్ని పరిష్కరించేందు కొత్త డిజైన్ తీసుకొచ్చింది. స్వైప్ వద్దంటే Call Settingలోకి వెళ్లి Incoming call gestureలో Single tap ఆప్షన్ కూడా ఎంచుకోవచ్చు.

News August 22, 2025

నచ్చినట్లు ఉండేందుకు పెళ్లి ఎందుకు: సుప్రీంకోర్టు

image

వివాహబంధంలో ఉంటూ భార్య లేదా భర్త తాము స్వతంత్రంగా జీవించాలనుకోవడం సరికాదని సుప్రీంకోర్టు తెలిపింది. స్వతంత్రంగా ఉండేందుకు పెళ్లి చేసుకోవడం ఎందుకని ప్రశ్నించింది. ‘ఇద్దరు వ్యక్తులు ఇష్టపూర్తిగానే వివాహం చేసుకుంటారు. అలాంటప్పుడు స్వతంత్రంగా ఎలా జీవిస్తారు. పిల్లల కోసం విభేదాలు పక్కనబెట్టాలి’ అని పేర్కొంది. కాగా ఓ దంపతుల కేసులో జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ ఆర్. మహదేవన్ పైవిధంగా తీర్పునిచ్చారు.

News August 22, 2025

GST: ధరలు తగ్గనున్న వస్తువులు ఇవే!

image

5% <<17473121>>GST<<>> శ్లాబ్: టూత్ పేస్ట్, చిప్స్, జామ్, జ్యూస్, పాస్తా, నూడిల్స్, వెన్న, నెయ్యి, ఔషధాలు, వ్యవసాయ ఉత్పత్తులు.
18%: TV, కంప్యూటర్, ఫర్నీచర్, వాషింగ్ మెషీన్స్, వాటర్ ఫిల్టర్స్, కుట్టు మెషీన్లు, ఎలక్ట్రానిక్స్.
40% స్పెషల్ శ్లాబ్: పొగాకు ఉత్పత్తులు, ఆన్‌లైన్ గేమింగ్, బీర్, లగ్జరీ ఐటమ్స్.
ఆహారం, అత్యవసర మందులు, విద్యకు 0% కొనసాగుతుంది. హెల్త్ ఇన్సూరెన్స్‌ని కూడా ఇందులోకి తెచ్చే అవకాశం ఉంది.