news

News April 11, 2025

సన్నబియ్యం పంపిణీకి స్పందన అద్భుతం: మంత్రి ఉత్తమ్

image

TG: సన్నబియ్యం పంపిణీకి ప్రజల నుంచి అద్భుతమైన స్పందన వస్తోందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. గతంలో 2.8కోట్ల జనాభాకు దొడ్డు బియ్యం ఇచ్చేందుకు రూ.10వేల కోట్లు ఖర్చు చేశారని, తాము 3.10కోట్ల మందికి సన్నబియ్యం ఇవ్వడానికి రూ.13 వేల కోట్లు ఖర్చు చేస్తున్నామని వెల్లడించారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ హయాంలో పండని పంట కాంగ్రెస్ హయాంలో పడిందని, తమది రైతు పక్షపాత ప్రభుత్వమనే దానికి ఇదే నిదర్శనమని పేర్కొన్నారు.

News April 11, 2025

వాట్సాప్‌లో కొత్త ఫీచర్లు

image

ఆండ్రాయిడ్, IOS యూజర్లకు వాట్సాప్ కొన్ని కొత్త ఫీచర్లను తీసుకొచ్చింది. ఇక నుంచి గ్రూపు సభ్యుల్లో ఎంత మంది ఆన్‌లైన్‌లో ఉన్నారో నంబర్ రూపంలో (EX: 5) కనిపిస్తుంది. అలాగే గ్రూపులో ప్రతీ మెసేజ్‌కు కాకుండా మనల్ని ఎవరైనా మెన్షన్ చేస్తే లేదా మన మెసేజ్‌కు రిప్లై ఇస్తే మాత్రమే నోటిఫికేషన్ వచ్చేలా మరో ఫీచర్‌ను తీసుకొచ్చింది. అటు ఐఫోన్లలో డాక్యుమెంట్లను స్కాన్ చేసి పంపించే ఆప్షన్‌నూ యాడ్ చేసింది.

News April 11, 2025

తెలంగాణ లోకాయుక్తగా జస్టిస్ రాజశేఖర్ రెడ్డి

image

తెలంగాణ లోకాయుక్తగా జస్టిస్ రాజశేఖర్ రెడ్డిని ప్రభుత్వం నియమించింది. ఉప లోకాయుక్తగా బీఎన్ జగ్జీవన్ కుమార్ పేరును ప్రకటించింది. మానవ హక్కుల కమిషన్ (HRC) ఛైర్మన్‌గా జస్టిస్ షమీమ్ అక్తర్‌ను, HRC సభ్యులుగా శివాడి ప్రవీణ, బి.కిశోర్‌ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

News April 11, 2025

చేబ్రోలుకు 14 రోజుల రిమాండ్.. 111 సెక్షన్ పెట్టడంపై జడ్జి ఆగ్రహం

image

AP: వైఎస్ భారతిని అసభ్యకర వ్యాఖ్యలతో దూషించిన చేబ్రోలు కిరణ్ కుమార్‌కు మంగళగిరి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. కిరణ్ కుమార్‌పై 111 సెక్షన్ పెట్టడంపై జడ్జి మంగళగిరి రూరల్ సీఐపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇష్టానుసారం సెక్షన్లు పెట్టి చట్టాన్ని అవహేళన చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

News April 11, 2025

ఫ్యూచర్ సిటీ వరకు మెట్రో: సీఎం రేవంత్

image

TG: ఫ్యూచర్ సిటీ వరకు మెట్రోను విస్తరించాలని, అందుకు అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను CM రేవంత్ ఆదేశించారు. మెట్రో రెండో దశ విస్తరణ పనుల పురోగతిపై అధికారులతో సమీక్ష తీశారు. మొత్తం 76.4KMల విస్తరణకు రూ.24,269 కోట్ల అంచనాలతో కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం DPR పంపింది. కేంద్రం నుంచి పర్మిషన్ రాగానే పనులు ప్రారంభించేందుకు సిద్ధంగా ఉండాలన్నారు.

News April 11, 2025

పీరియడ్స్ వచ్చాయని బయట కూర్చోబెట్టి పరీక్ష.. నటి ఫైర్

image

తమిళనాడులో నెలసరి బాలికను <<16051110>>తరగతి గది బయట<<>> కూర్చోబెట్టి పరీక్ష రాయించిన ఘటనపై నటి, జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు ఖుష్బూ ఫైరయ్యారు. ‘ఈ ఘటన విచారకరం. నన్ను షాక్‌కు గురిచేసింది. మనం ఏ యుగంలో బతుకుతున్నాం? ఇలాంటి పనులు చేస్తున్నందుకు సిగ్గుగా లేదా?’ అని స్కూల్ సిబ్బందిని దుయ్యబట్టారు. నెలసరి అనేది సహజమని, మానసికంగా ఎదుగుదల లేని అధికారులకు బుద్ధి చెప్పాలని మండిపడ్డారు.

News April 11, 2025

BREAKING: టెట్ నోటిఫికేషన్ విడుదల

image

తెలంగాణ టెట్ (టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్) నోటిఫికేషన్‌పై పాఠశాల విద్యాశాఖ కీలక ప్రకటన చేసింది. జూన్ 15 నుంచి 30 మధ్య ఎగ్జామ్స్ నిర్వహించనున్నట్లు పేర్కొంది. పూర్తి నోటిఫికేషన్ వివరాలు APR 15 నుంచి వెబ్‌సైట్లో అందుబాటులో ఉంటాయని వెల్లడించింది. కాగా ఏడాదికి 2సార్లు టెట్ నిర్వహిస్తామని గతంలో ప్రభుత్వం ప్రకటించింది. 2024 NOVలో నోటిఫికేషన్ రాగా, ఈ JANలో ఎగ్జామ్స్ జరిగాయి. FEBలో రిజల్ట్స్ ప్రకటించారు.

News April 11, 2025

‘గార్డెన్స్ బై ది వే’ను తలపించేలా బర్డ్స్ ప్యారడైజ్: CM

image

TG: మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టు పనులను వేగవంతం చేయాలని CM రేవంత్ ఆదేశించారు. మీర్ ఆలం ట్యాంక్‌పై 2km బ్రిడ్జి నిర్మించి, పర్యాటకులను ఆకట్టుకునేలా దానిపై ఐల్యాండులు ఏర్పాటు చేయాలన్నారు. సింగపూర్‌లోని ‘గార్డెన్స్ బై ది వే’ను తలపించేలా బర్డ్స్ ప్యారడైజ్, వాటర్ ఫాల్స్‌ను అభివృద్ధి చేయాలని చెప్పారు. బోటింగ్, రిసార్ట్స్, హోటల్స్ నిర్మించాలని, ఐలాండ్‌ జోన్‌ను జూపార్క్‌కు అనుసంధించాలని CM సూచించారు.

News April 11, 2025

భూ దోపిడీపై KTR చర్చకు సిద్ధమా?: మహేశ్

image

IMG బిల్లీరావు దగ్గర కమీషన్ తీసుకున్నందుకే కంచ గచ్చిబౌలి భూముల కోసం BRS పోరాడలేదని TPCC అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ ఆరోపించారు. కాంగ్రెస్ సుప్రీంకోర్టులో పోరాడి 400 ఎకరాలు సాధించిందని, వాటిలో కంపెనీలు నిర్మిస్తే యువతకు ఉద్యోగాలొస్తాయన్నారు. గత ప్రభుత్వం కోకాపేటలో వేల ఎకరాలు అమ్ముకోగా, లక్షఎకరాలు డీఫారెస్ట్ చేసిందన్నారు. BRS హయాంలో జరిగిన భూదోపిడీపై KTR చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు.

News April 11, 2025

క్రికెట్‌లో త్వరలో కొత్త రూల్స్!

image

కొత్త రూల్స్ తీసుకొచ్చేందుకు ICC కసరత్తు చేస్తోంది. వన్డేల్లో రెండు కొత్త బంతుల రూల్‌ను సవరించనుంది. దీని ప్రకారం బౌలింగ్ టీమ్ 2 న్యూ బాల్స్‌తో ఆటను ఆరంభించవచ్చు. 25 ఓవర్ల తర్వాత వాటిలో ఒక్క దానినే కొనసాగించాల్సి ఉంటుంది. అలాగే టెస్టుల్లో ఒక్క రోజులో 90 ఓవర్లు పూర్తయ్యేలా ఓవర్ల మధ్య 60sec మాత్రమే విరామం ఉండేలా టైమర్‌ను తీసుకురానుంది. అటు మెన్స్ U19 WCను T20 ఫార్మాట్‌కు మార్చాలని యోచిస్తోంది.