news

News April 11, 2025

ఇంటర్ రిజల్ట్స్ అందరికంటే ముందుగా..

image

ఏపీలో ఇంటర్ ప్రశ్నాపత్రాల వ్యాల్యూయేషన్, డేటా కంప్యూటరైజేషన్ పూర్తయింది. రేపు ఉదయం 11 గంటలకు ఫలితాలు రిలీజ్ కానున్నాయి. రిజల్ట్స్‌ను ఎప్పట్లాగే వే2న్యూస్‌లో అందరికంటే ముందుగా తెలుసుకోవచ్చు. యాప్‌లో రిజల్ట్ స్క్రీన్‌పై హాల్ టికెట్ నంబర్ ఎంటర్ చేస్తే చాలు. యాడ్స్, డేంజరస్ థర్డ్ పార్టీ లింక్స్ గొడవ లేకుండా క్షణాల్లో ఫలితం మీ స్క్రీన్‌పై. అంతే వేగంగా ఒకే క్లిక్‌తో రిజల్ట్ కార్డ్ షేర్ చేయొచ్చు.

News April 11, 2025

‘ఆస్కార్’కు రాజమౌళి ధన్యవాదాలు

image

ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డుల్లో స్టంట్ డిజైన్‌ కేటగిరీని చేర్చడంపై డైరెక్టర్ రాజమౌళి హర్షం వ్యక్తం చేశారు. ‘ఎట్టకేలకు వందేళ్ల నిరీక్షణ తర్వాత. 2027లో విడుదలయ్యే చిత్రాలకు ఆస్కార్ డిజైన్ కేటగిరీని చేర్చడం సంతోషం. దీనిని సాధ్యం చేసినందుకు డేవిడ్ లీచ్, క్రిస్ ఓ హారా & స్టంట్ కమ్యూనిటీకి, అకాడమీ సీఈవో బిల్ క్రామెర్‌కు ధన్యవాదాలు. ఈ ప్రకనటలో RRR యాక్షన్ విజువల్ వాడటం చూసి ఆనందించా’ అని తెలిపారు.

News April 11, 2025

BREAKING: రేపు ఇంటర్ రిజల్ట్స్

image

ఏపీ ఇంటర్ ఫలితాలు రేపు విడుదల కానున్నాయి. ఉదయం 11 గంటలకు ఫస్టియర్, సెకండియర్ ఫలితాలు విడుదల చేస్తామని మంత్రి లోకేశ్ ట్వీట్ చేశారు. ఫలితాలను అందరికంటే ముందుగా వే2న్యూస్‌లో పొందవచ్చు.
– వే2న్యూస్ యాప్‌లో వచ్చే స్పెషల్ స్క్రీన్‌లో హాల్ టికెట్ నంబర్ ఎంటర్ చేసి సెర్చ్ నొక్కితే చాలు. సెకన్లలో ఫలితాలు వస్తాయి. డౌన్లోడ్ అని మరొక్క క్లిక్ చేస్తే రిజల్ట్ కార్డ్ సన్నిహితులకు షేర్ చేసుకోవచ్చు.

News April 11, 2025

TGPSC కీలక నిర్ణయం

image

టీజీపీఎస్సీ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకనుంచి ప్రభుత్వ ఉద్యోగాల సర్టిఫికేట్ వెరిఫికేషన్ 1:1నిష్పత్తిలో జరపనున్నట్లు వెల్లడించింది. అదనపు అభ్యర్థులను పిలవడం వల్ల నియామక ప్రక్రియ ఆలస్యమవుతుండటంతో పాటు పోటీదారులను ఆశకు గురిచేసినట్లు అవుతోందని కమిషన్ పేర్కొంది. కాగా ఇది వరకు మల్టీ జోనల్, జోనల్ పోస్టులకు 1:2, జిల్లా పోస్టులకు 1:3, దివ్యాంగుల కేటగిరీకి 1:5 నిష్పత్తిలో అభ్యర్థులను పిలిచేవారు.

News April 11, 2025

యువతిపై 23 మంది అత్యాచారం.. స్పందించిన మోదీ

image

యూపీ వారణాసిలో 19 ఏళ్ల యువతిపై 23 మంది అత్యాచారానికి ఒడిగట్టిన ఘటనపై ప్రధాని మోదీ స్పందించారు. వారణాసిలో ల్యాండ్ కాగానే ఈ ఘటనపై పోలీసులు, కలెక్టర్‌తో మాట్లాడారు. మృగాళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కాగా తనను కిడ్నాప్ చేసి ఆరు రోజుల పాటు హోటళ్లు, హుక్కా బార్లకు తీసుకెళ్లి 23 మంది అత్యాచారం చేశారని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది.

News April 11, 2025

మాతృభాషకు దూరం చేయవద్దు: వెంకయ్యనాయుడు

image

ఇంటర్ విద్యార్థులకు ద్వితీయ భాషగా సంస్కృతం ఉంచాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలిసి తాను బాధపడినట్లు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. మార్కుల దృష్ట్యా సంస్కృతం ఉంచాలని చూస్తుంటే మాత్రం, ఈ నిర్ణయంపై పునరాలోచన చేయాలని విజ్ఞప్తి చేశారు. సంస్కృతం తప్పు కాదని, అమ్మ భాష(తెలుగు)కు విద్యార్థులను దూరం చేయడం సరికాదన్నారు. జాతీయ విద్యావిధానం సైతం మాతృభాషకు ప్రాధాన్యత ఇచ్చిందని గుర్తుచేశారు.

News April 11, 2025

రాణాపై మోదీ ట్వీట్.. 14ఏళ్ల తర్వాత వైరల్

image

ముంబై ఉగ్రదాడి నిందితుడు తహవూర్ రాణాపై ప్రస్తుత ప్రధాని మోదీ 2011, జూన్ 10న చేసిన ట్వీట్ తాజాగా వైరలవుతోంది. ‘ముంబై దాడిలో తహవూర్ రాణా నిర్దోషి అని అమెరికా ప్రకటించి భారత సార్వభౌమత్వాన్ని అవమానించింది. ఇది విదేశాంగ విధానానికి తిరోగమనం’ అని ట్వీట్‌లో ఆయన రాసుకొచ్చారు. ఇప్పుడు 14ఏళ్ల తర్వాత రాణాను అమెరికా నుంచి రప్పించిన విషయం తెలిసిందే.

News April 11, 2025

మూడు రోజుల్లో రూ.5670 పెరిగిన బంగారం ధర

image

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు రికార్డు స్థాయిలో పెరిగాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేట్ ఏకంగా రూ.1850 పెరగడంతో రూ.87,450కు చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.2,020 పెరిగి రూ.95,400 పలుకుతోంది. ఇక కేజీ వెండి ధర రూ.1,000 పెరిగి రూ.1,08,000కు చేరింది. కేవలం మూడు రోజుల్లోనే తులం బంగారంపై రూ.5670, కేజీ వెండిపై రూ.5000 పెరగడం గమనార్హం.

News April 11, 2025

CSK కెప్టెన్‌గా ధోనీ.. 2022 సీన్ రిపీట్?

image

CSK కెప్టెన్‌గా తిరిగి ధోనీని నియమించడంపై కొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వరుస ఓటముల వల్ల ఉద్దేశపూర్వకంగానే యాజమాన్యం ఇలా చేస్తోందని అంటున్నారు. తాజాగా గాయం కారణంతో రుతురాజ్ నుంచి కెప్టెన్సీ బాధ్యతలను ధోనీకి అప్పగించిన CSK 2022లోనూ జడేజాను కెప్టెన్సీ నుంచి తప్పించిందని ఆరోపిస్తున్నారు. ఇప్పుడు గైక్వాడ్ కెప్టెన్సీలో 5 మ్యాచుల్లో 4 ఓడగా.. అప్పుడు జడేజా కెప్టెన్సీలో 8 మ్యాచుల్లో 6 ఓడింది.

News April 11, 2025

‘లులు’ చేతికి మంజీరా

image

HYD కూకట్‌పల్లిలోని మంజీరా మాల్‌ను లులు ఇంటర్నేషనల్ సంస్థ సొంతం చేసుకుంది. మంజీరాపై 49 సంస్థలు ఆసక్తి చూపగా చివరికి 7 మాత్రమే పోటీలో నిలిచాయి. దివాలా పరిష్కార ప్రక్రియ ద్వారా రూ.318 కోట్లకు లులు కొనుగోలు చేసింది. మంజీరా మాల్ నిర్మాణానికి చేసిన అప్పులు చెల్లించలేక పారిశ్రామికవేత్త యోగానంద్ 2023లో దివాలా పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ మంజీరాలోనే లులు మాల్‌ అద్దెకు ఉంటోంది.