news

News April 11, 2025

శుభ ముహూర్తం (11-04-2025)(శుక్రవారం)

image

తిథి: శుక్ల చతుర్దశి రా.2.32 వరకు
నక్షత్రం: ఉత్తర మ.2.56 వరకు
రాహుకాలం: ఉ.10.30-మ.12.00 వరకు
యమగండం: మ.3.00-మ.4.30 వరకు
దుర్ముహూర్తం: ఉ.8.24-ఉ.9.12, మ.12.24-మ1.12 వరకు
వర్జ్యం: రా.12.07-రా.1.52 వరకు
అమృత ఘడియలు: ఉ.6.51-ఉ.8.35 వరకు

News April 11, 2025

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

News April 11, 2025

నేటి ముఖ్యాంశాలు

image

* TG:‘యంగ్ ఇండియా స్కూల్’ నా బ్రాండ్: సీఎం రేవంత్
* రైతుల కోసం కొత్త పథకం: మంత్రి తుమ్మల
* మరో 6 నెలల్లో ప్రతి ఇంటికి ఇంటర్నెట్: మంత్రి శ్రీధర్ బాబు
* 30 లక్షల మందికి రేషన్ కార్డులు: మంత్రి ఉత్తమ్
* AP: నర్సింగ్ విద్యకు కామన్ ప్రవేశ పరీక్ష: మంత్రి సత్యకుమార్
* గోడకు కొట్టిన బంతిలా ప్రతిచర్య తప్పదు: జగన్
* వైసీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ అరెస్టు

News April 11, 2025

రాణాను కోర్టులో హాజరుపరిచిన NIA

image

26/11 ముంబై దాడుల సూత్రధారి తహవూర్ రాణాను ఎన్ఐఏ అధికారులు ఢిల్లీలోని పటియాలా హౌస్ కోర్టులో భారీ బందోబస్తు మధ్య హాజరుపరిచారు. అతడిపై UAPA కేసుల్ని నమోదు చేసిన అధికారులు, 14రోజుల కస్టడీకి రాణాను అనుమతించాలని న్యాయస్థానాన్ని కోరారు. మరోవైపు ఈ కేసు విచారణ కోసం ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్‌ను కేంద్రం నియమించింది.

News April 11, 2025

మూవీ ఇండస్ట్రీలోకి రొనాల్డో

image

పోర్చుగల్ స్టార్ ఫుట్‌బాల్ ప్లేయర్ క్రిస్టియానో రొనాల్డో ‘URMarv’ పేరిట ఫిల్మ్ ప్రొడక్షన్ స్టూడియోను లాంచ్ చేశారు. హాలీవుడ్ ఫిల్మ్ మేకర్ మాథ్యూ వాన్‌తో కలిసి పనిచేయనున్నట్లు సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. ఇప్పటికే ఫ్యాషన్, పర్ఫ్యూమ్, లగ్జరీ వాచ్‌లకు సంబంధించిన వ్యాపారాల్లో భాగమైన రొనాల్డో ఇప్పుడు సినిమాల్లోనూ అడుగు పెట్టారు. కొన్ని నెలల క్రితం ఆయన యూట్యూబ్ ఛానల్‌నూ ప్రారంభించిన సంగతి తెలిసిందే.

News April 11, 2025

రికార్డు: 64 ఏళ్ల వయసులో టీ20ల్లో అరంగేట్రం

image

పోర్చుగల్ మహిళా క్రికెట్ జట్టు తరఫున జొన్నా చైల్డ్ 64 ఏళ్ల వయసులో టీ20 అరంగేట్రం చేశారు. దీంతో అతిపెద్ద వయసులో టీ20ల్లోకి ఎంట్రీ ఇచ్చిన రెండో ప్లేయర్‌గా నిలిచారు. నార్వేతో జరిగిన మ్యాచులో ఆమె ఈ ఘనత అందుకున్నారు. ఈ లిస్టులో జిబ్రాల్టర్‌కు చెందిన సాలీ బార్టన్ (66 ఏళ్ల 334 రోజులు) తొలి స్థానంలో కొనసాగుతున్నారు. నార్వేతో జరిగిన టీ20 సిరీస్‌ను పోర్చుగల్ 2-1 తేడాతో గెలుచుకుంది.

News April 11, 2025

ALERT.. రేపు వర్షాలు, వడగాలులు

image

AP: రాష్ట్రంలో రేపు విజయనగరం, SKLM, మన్యం, అల్లూరి, VZG, అనకాపల్లి, కాకినాడ, చిత్తూరు, TPTY జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని APSDMA హెచ్చరించింది. వ్యవసాయ పనులకు వెళ్లే రైతులు, కూలీలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. మరోవైపు మన్యం, అల్లూరి, ఏలూరు, కృష్ణా, గుంటూరు, NTR, బాపట్ల, పల్నాడులోని 21 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది.

News April 10, 2025

జగన్ నుంచి రాష్ట్రానికి భద్రత కావాలి: నిమ్మల

image

AP: వైసీపీ చీఫ్ జగన్‌కు మరింత భద్రత కేటాయించాలన్న ఎమ్మెల్సీ బొత్స వ్యాఖ్యలకు మంత్రి నిమ్మల రామనాయుడు కౌంటర్ ఇచ్చారు. నేర స్వభావం ఉన్న వ్యక్తి రాజకీయాల్లో ఉంటే ఎవరికి భద్రత కావాలని ప్రశ్నించారు. భద్రత జగన్‌కు కాదని, ఆయన నుంచి రాష్ట్రానికి, ప్రజలకు కావాలని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. సీఎం చంద్రబాబు సైతం తన పర్యటనల్లో సెక్యూరిటీని తగ్గించుకున్నారనే విషయాన్ని గుర్తు చేశారు.

News April 10, 2025

IPL: రుతురాజ్‌కు రీప్లేస్‌మెంట్ ఎవరు?

image

మోచేతి గాయంతో IPL 18వ సీజన్ మొత్తానికి దూరమైన రుతురాజ్ స్థానంలో CSK ఎవరిని తీసుకుంటుందనే దానిపై చర్చ మొదలైంది. పృథ్వీ షా, ఆయుశ్ మాత్రే, మయాంక్ అగర్వాల్‌లో ఒకరిని తీసుకోవచ్చని నేషనల్ మీడియా పేర్కొంది. పృథ్వీ, మయాంక్‌కు ఇప్పటికే IPLలో చాలా సీజన్లు ఆడిన అనుభవం ఉంది. మరోవైపు ముంబైకి చెందిన 17 ఏళ్ల ఆయుశ్ ఇటీవల దేశవాళీ టోర్నీల్లో సత్తా చాటి అందరి దృష్టిలో పడ్డారు. మరి వీరిలో ఎవరికి ఛాన్స్ దక్కుతుందో?

News April 10, 2025

మాజీ ప్రేయసికి బుద్ధి చెప్పాలని..

image

ప్రేమలో ఉన్నప్పుడు ఆన్‌లైన్ షాపింగ్, గిఫ్ట్‌లు కావాలంటూ వేధించిన యువతికి కోల్‌కతాలో మాజీ ప్రియుడు ఊహించని షాక్ ఇచ్చాడు. నాలుగు నెలల వ్యవధిలో ఏకంగా ఆమెకు 300 COD ఆర్డర్లు చేశాడు. విసిగిపోయిన యువతి ఫిర్యాదుతో విచారణ చేపట్టిన పోలీసులు ఇది మాజీ ప్రియుడి నిర్వాకమేనని తేల్చారు. తెలియని నంబర్ల నుంచి మెసేజులు పంపి వేధించినట్లు వెల్లడించారు. నిన్న యువకుడిని కోర్టులో ప్రవేశపెట్టగా బెయిల్ మంజూరైంది.