news

News April 10, 2025

ఇందిరమ్మ ఇళ్ల జాబితాపై ఫిర్యాదులు.. రీవెరిఫికేషన్?

image

TG: ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా తొలివిడతలో 71 వేల మందికి ప్రభుత్వం ఇళ్లు మంజూరు చేసింది. వీరిలో అనర్హులు ఎక్కువ మంది ఉన్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయి. ఇప్పటికే ఇళ్లు ఉన్నవారి పేర్లు జాబితాలో ఉండటం, వాళ్లు పనులు ప్రారంభించకపోవడంపై అధికారులు ఆరా తీస్తున్నారు. దీంతో మరోసారి రీవెరిఫికేషన్‌కు అధికారులు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇచ్చిన మంజూరు పత్రాలను వెనక్కి తీసుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం.

News April 10, 2025

కాకాణిపై లుకౌట్ నోటీసులు.. ఏ క్షణమైనా అరెస్ట్!

image

AP: అక్రమ మైనింగ్ కేసులో మాజీ మంత్రి, YCP నేత కాకాణి గోవర్ధన్ రెడ్డికి ఉచ్చు బిగుస్తోంది. మూడుసార్లు నోటీసులు ఇచ్చినా ఆయన విచారణకు రాకపోవడంతో పోలీసులు తాజాగా లుకౌట్ నోటీసులు జారీ చేశారు. కాకాణి దేశం విడిచి వెళ్లిపోకుండా అన్ని ఎయిర్‌పోర్టులు, సీపోర్టుల్లో అలర్ట్ చేశారు. ఇప్పటికే ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్ తిరస్కరణకు గురికావడంతో ఏ క్షణమైనా కాకాణి అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది.

News April 10, 2025

సిద్ధూ జొన్నలగడ్డ ‘JACK’ రివ్యూ&రేటింగ్

image

దేశభక్తి ఉన్న హీరో RAWలో చేరేందుకు ఏం చేశాడన్నదే JACK కథ. సిద్ధూ జొన్నలగడ్డ కామెడీ టైమింగ్, యాక్టింగ్ ఆకట్టుకుంటాయి. అమ్మతో ఉండే ఎమోషనల్ సీన్లు మెప్పిస్తాయి. కథ, రొటీన్ స్క్రీన్‌ప్లే, మ్యూజిక్, పాటలు, BGM, సినిమాటోగ్రఫీ నిరాశపరుస్తాయి. స్పై యాక్షన్ మూవీ అయినా థ్రిల్లింగ్ సీన్లు లేకపోవడం మైనస్. సీరియస్‌గా ఉండాల్సిన చోట్ల కామెడీ, లవ్ ట్రాక్ ప్రేక్షకుడిని ఇబ్బందికి గురిచేస్తాయి. RATING: 2.25/5

News April 10, 2025

IPL2025: వ్యూవర్షిప్‌లో RCB మ్యాచులు టాప్

image

ఈ ఏడాది IPL మ్యాచులు అంచనాలకు భిన్నంగా సాగుతున్నాయి. 3 దిగ్గజ జట్లు CSK, MI, SRHలు పేలవ ప్రదర్శనతో పాయింట్స్ టేబుల్‌లో అట్టడుగుకు చేరాయి. అయితే, వ్యూవర్షిప్‌లో మాత్రం RCB ఆడిన ప్రతి మ్యాచుకు JioHotstarలో అత్యధిక వ్యూస్ వచ్చాయి. RCBvsKKR మ్యాచ్‌కు 41.7 కోట్లు, RCBvsCSKకు 37.4 కోట్లు, RCBvsMIకు 34.7కోట్ల వ్యూస్ వచ్చినట్లు క్రికెట్ వర్గాలు తెలిపాయి. RCB 4 మ్యాచుల్లో 3 గెలిచి టాప్-3లో కొనసాగుతోంది.

News April 10, 2025

నేరుగా తిహార్ జైలుకు తహవూర్ రాణా!

image

26/11 ముంబై పేలుళ్ల సూత్రధారి తహవూర్ రాణా(64)ను అధికారులు US నుంచి ప్రత్యేక విమానంలో భారత్‌కు తీసుకొస్తున్నారు. మధ్యాహ్నంలోపు అతడు ఢిల్లీకి చేరుకునే అవకాశం ఉంది. ఇక్కడికి రాగానే రాణాను NIA అధికారికంగా అరెస్ట్ చేయనుంది. అనంతరం అతడిని తిహార్ జైలులోని హైసెక్యూరిటీ వార్డులో ఉంచనున్నారు. 2008 NOV 26న ముంబైలోని తాజ్ హోటల్‌లో 10 మంది పాకిస్థానీ టెర్రరిస్టుల నరమేధం వెనుక రాణాదే మాస్టర్ మైండ్.

News April 10, 2025

YS భారతిపై అనుచిత వ్యాఖ్యలు.. TDP సంచలన నిర్ణయం

image

AP: YS భారతిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన iTDP కార్యకర్త చేబ్రోలు కిరణ్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు TDP ప్రకటించింది. అతడిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని పోలీసులను కోరింది. దీంతో గుంటూరు పోలీసులు కిరణ్‌పై కేసు ఫైల్ చేశారు. మహిళలపై ఇలాంటి వ్యాఖ్యలను ఉపేక్షించేది లేదని పార్టీ స్పష్టం చేసింది. కాగా భారతిపై కామెంట్స్‌ చేయడంపై YCP తీవ్రంగా స్పందించింది. దీంతో కిరణ్ <<16049878>>క్షమాపణలు<<>> చెప్పాడు.

News April 10, 2025

అజిత్ ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ పబ్లిక్ టాక్

image

కోలీవుడ్ హీరో అజిత్ నటించిన ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ విడుదలైంది. ఇప్పటికే USలో చూసినవారు తమ అభిప్రాయాన్ని SMలో పంచుకున్నారు. మాస్ ఎంటర్‌టైనర్‌గా మూవీ ఉందని, అజిత్ ఫ్యాన్స్‌కు పండగేనని కొందరు పేర్కొంటున్నారు. భారీ యాక్షన్ సీన్లు, ఇంటర్వెల్ సీన్ అజిత్ కెరీర్‌లోనే బెస్ట్ అని పోస్టులు చేస్తున్నారు. సెకండాఫ్ స్లోగా ఉందని, మ్యూజిక్ బాగుందని అంటున్నారు. కాసేపట్లో వే2న్యూస్ రివ్యూ.

News April 10, 2025

కంచ గచ్చిబౌలిలో పర్యటిస్తున్న సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ

image

TG: కంచ గచ్చిబౌలి భూముల్లో సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ పర్యటిస్తోంది. స్థలాన్ని పరిశీలించి వాస్తవ పరిస్థితులపై అధ్యయనం చేయనుంది. అనంతరం ఆ నివేదికను సుప్రీంకోర్టుకు అందజేస్తుంది. దాన్నిబట్టి అత్యున్నత న్యాయస్థానం విచారణ కొనసాగించనుంది. ఆ భూములను వేలం వేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించగా HCU విద్యార్థులతో పాటు సర్వత్రా నిరసనలు వ్యక్తం అయ్యాయి. చివరికి SC జోక్యంతో అభివృద్ధి పనులు నిలిచిపోయాయి.

News April 10, 2025

పోసాని క్వాష్ పిటిషన్‌పై నేడు విచారణ

image

AP: నటుడు పోసాని కృష్ణమురళి దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై నేడు హైకోర్టు విచారణ చేపట్టనుంది. తనపై నెల్లూరు పోలీసులు తప్పుడు కేసులు నమోదు చేశారని దానిని క్వాష్ చేయాలని కోరుతూ పోసాని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. Dy.CM పవన్ కళ్యాణ్‌తో పాటు పలువురిపై అనుచిత వ్యాఖ్యలు చేశారని పోసానిపై కేసులు నమోదయ్యాయి. కొద్దిరోజుల క్రితమే ఆయన బెయిల్‌పై విడుదలైన సంగతి తెలిసిందే.

News April 10, 2025

ప్రముఖ హాలీవుడ్ నటుడు మృతి

image

ప్రముఖ హాలీవుడ్ నటుడు మెల్ నోవాక్(93) వృద్ధాప్య సమస్యలతో కన్నుమూశారు. గేమ్ ఆఫ్ డెత్‌లో బ్రూస్‌లీతో కలిసి విలన్‌గా నటించారు. ఐ ఫర్ యాన్ ఐ, బ్లాక్ బెల్ట్ జోన్స్ వంటి యాక్షన్ సినిమాల్లో నటించారు. 1974లో ట్రక్ టర్నర్‌లో నటించిన ఆయన చివరగా 2020లో ఎబోలా రెక్స్ వర్సెస్ మర్డర్ హార్నెట్స్ సినిమాలో కనిపించారు.