news

News April 8, 2025

బలం లేదని స్థానిక ఎన్నికలను అడ్డుకున్నారు: జగన్

image

APలో 50 చోట్ల స్థానిక సంస్థలకు ఎన్నికలు జరిగితే 39 చోట్ల వైసీపీ గెలిచిందని వైఎస్ జగన్ అన్నారు. టీడీపీకి బలం లేదని 7 చోట్ల చంద్రబాబు ఎన్నికలను వాయిదా వేయించారని ఆరోపించారు. రామగిరిలో 9 MPTC స్థానాలను వైసీపీ గెలిచిందని, టీడీపీ ఎమ్మెల్యే, తనయుడు, రామగిరి ఎస్ఐ దౌర్జన్యాలు చేసి తమ ఎంపీపీ స్థానం గెలిచేందుకు ప్రయత్నించారని విమర్శించారు. దీన్ని అడ్డుకుంటే తమ పార్టీ నేతలపైనే కేసులు పెట్టారని ధ్వజమెత్తారు.

News April 8, 2025

వీరుడిలా పోరాడావు.. హార్దిక్ ఇన్‌స్టా పోస్ట్

image

LSGతో మ్యాచులో తిలక్ వర్మ రిటైర్డ్ ఔట్‌గా వెనుదిరగగా దీనికి కారణం MI కెప్టెన్ హార్దిక్ అంటూ విమర్శలు వెల్లువెత్తాయి. నిన్న RCBతో మ్యాచులో వీరిద్దరూ పోరాడినా, కీలక సమయంలో ఔటవ్వడంతో ఓటమి తప్పలేదు. అయితే తిలక్‌తో తనకు ఎలాంటి మనస్పర్ధలు లేవని అర్థం వచ్చేలా పాండ్య IGలో పోస్ట్ చేశారు. వీరుడిలా పోరాడావంటూ తిలక్‌తో ఉన్న ఫొటోను షేర్ చేశారు. ఇలా ప్లేయర్లను ప్రోత్సహించాలని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.

News April 8, 2025

ఎల్లుండి మాంసం దుకాణాలు బంద్

image

జైన మత ప్రచారకుడు మహావీర్ జయంతి(APR 10) సందర్భంగా ఎల్లుండి మాంసం దుకాణాలు మూసివేయాలని GHMC కమిషనర్ ఇలంబర్తి ఆదేశాలు జారీ చేశారు. మటన్, బీఫ్ ఇతర మాంసం దుకాణాలు మూసి ఉండేలా చర్యలు తీసుకోవాలని హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనర్లకు సూచించారు.

News April 8, 2025

కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

image

TG: త్వరలో భారీ భూకుంభకోణాన్ని బయటపెడతానని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 400 ఎకరాలు కాదు.. దాని వెనుక రూ.వేల కోట్ల వ్యవహారం ఉందన్నారు. ఈ కుంభకోణంలో బీజేపీ ఎంపీ ఉన్నారన్నారు. ఒకరు ఢిల్లీ నేత చెప్పులు మోస్తే.. మరొకరు ఢిల్లీకి బ్యాగులు మోస్తారని విమర్శించారు. రెండు జాతీయ పార్టీల జుట్టు ఢిల్లీ చేతిలోనే ఉందని ఆరోపించారు.

News April 8, 2025

మోడల్ పర్యాటక కేంద్రంగా కురిడి: పవన్

image

AP: కేరళ తరహాలో అరకును అభివృద్ధి చేస్తామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్పారు. కురిడి గ్రామ పర్యటనలో ఆయన మాట్లాడారు. గ్రామాన్ని దత్తత తీసుకోవాలని ప్రజలు కోరగా అంతకంటే ఎక్కువగా అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. గ్రామ పంచాయతీ అభివృద్ధికి తన వంతుగా రూ.5 లక్షల విరాళం ప్రకటించారు. ఈ విలేజ్‌ను మోడల్ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు.

News April 8, 2025

పల్లా, రాజయ్యకు కడియం సవాల్

image

TG: భూముల కబ్జాకు ప్రయత్నించారనే BRS నేతలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, రాజయ్య ఆరోపణలపై MLA కడియం శ్రీహరి తీవ్రంగా స్పందించారు. ‘నాపై కబ్జా ఆరోపణలు నిరూపిస్తే ఎమ్మెల్యే పదవి విడిచి మీకు గులాంగిరి చేస్తాను. లేకపోతే మీరు నాకు గులాంగిరి చేయాలి’ అని వారికి సవాల్ విసిరారు. చీము నెత్తురు ఉంటే తన సవాల్ స్వీకరించాలన్నారు. ఉపఎన్నికలు వస్తే ఎదుర్కొనేందుకు సిద్ధమని కడియం స్పష్టం చేశారు.

News April 8, 2025

పవన్ కుమారుడికి ప్రమాదం.. స్పందించిన YS జగన్

image

AP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ <<16028483>>అగ్నిప్రమాదంలో <<>>గాయపడిన ఘటనపై వైసీపీ అధినేత జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘ఈ ప్రమాదంలో పవన్ కుమారుడు గాయపడ్డాడని తెలిసి షాకయ్యా. ఈ క్లిష్ట పరిస్థితుల్లో ఆ కుటుంబానికి అండగా ఉంటాం. మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నా’ అని జగన్ Xలో రాసుకొచ్చారు.

News April 8, 2025

ఇవాళ ఈ వ్రతం చేస్తే వైవాహిక సమస్యలుండవు!

image

ఇవాళ ‘కామదా ఏకాదశి’. ఈరోజు వివాహితులు లక్ష్మీ నారాయణులను ఆరాధిస్తే మంచిదని పురోహితులు చెబుతున్నారు. అలాగే విధిగా ‘కామదా ఏకాదశి వ్రతం’ చేస్తే పాపాలు పోవడం, వైవాహిక సమస్యలు తొలగడం తథ్యమని సూచిస్తున్నారు. శాపం కారణంగా ఓ గంధర్వుడు రాక్షసుడి రూపంలో జీవితం కొనసాగిస్తే, అతని భార్య ఈ వ్రతం చేయడంతో శాపం తొలగిపోతుంది. భార్యాభర్తలు విడిపోకుండా చూసే శక్తి ఈ వ్రతానికి ఉందని వివరిస్తున్నారు.

News April 8, 2025

ఆ బిల్లులను గవర్నర్ పెండింగ్‌లో ఉంచలేరు: సుప్రీంకోర్టు

image

తమిళనాడు గవర్నర్ వ్యవహారంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెల్లడించింది. అసెంబ్లీ ఆమోదించిన బిల్లులను గవర్నర్ శాశ్వతంగా తమ వద్ద ఉంచుకోలేరని స్పష్టం చేసింది. అసెంబ్లీ రెండోసారి ఆమోదించాక గవర్నర్ వాటిని రాష్ట్రపతికి నివేదించలేరని పేర్కొంది. గవర్నర్ బిల్లులను ఆమోదించడం లేదని తమిళనాడు ప్రభుత్వం వేసిన పిటిషన్‌పై జస్టిస్ పార్దివాలా ధర్మాసనం తాజాగా తీర్పు ఇచ్చింది.

News April 8, 2025

lola VFX గురించి తెలుసా?

image

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రకటించిన కొత్త చిత్రంలో VFXకు ప్రాధాన్యత ఉన్నట్లుగా తెలుస్తోంది. USలోని ప్రముఖ lola VFX కార్యాలయాన్ని దర్శకుడు అట్లీ, అల్లు అర్జున్ సందర్శించారు. ఇండియా నుంచి కల్కి, GOAT, ఇండియన్-3, హాలీవుడ్‌లో కెప్టెన్ అమెరికా, హ్యారీ పోటర్, అవెంజర్స్:ఎండ్ గేమ్ వంటి చిత్రాలకు ఈ సంస్థ పనిచేసింది. దీంతో అల్లు అర్జున్ ఈ సారి ఏదో గట్టిగానే ప్లాన్ చేశారని ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు.