news

News February 2, 2026

దలైలామాకు గ్రామీ అవార్డు

image

టిబెట్‌ బౌద్ధమతగురువు దలైలామా ప్రతిష్ఠాత్మక గ్రామీ అవార్డును గెలుచుకున్నారు. బెస్ట్‌ ఆడియో బుక్‌ నెరేషన్‌ విభాగంలో ‘మెడిటేషన్’ అనే ఆల్బమ్‌కు ఈ అవార్డు దక్కింది. ఇందులో ఆయన తన ఆలోచనలు, సందేశాలను ఆడియో రూపంలో అందించారు. సంగీత రంగంలో ప్రతిష్ఠాత్మకంగా భావించే ఈ అవార్డును 90 ఏళ్ల వయసులో గెలుచుకున్నారు. ఈ అవార్డును దలైలామా తరఫున ప్రముఖ సంగీతకారుడు రూఫస్ వేన్‌రైట్ స్వీకరించారు.

News February 2, 2026

యాత్ర ఇండియా లిమిటెడ్‌లో 4,039 పోస్టులు

image

<>యాత్ర <<>>ఇండియా లిమిటెడ్ 4,039 ట్రేడ్ అప్రెంటిస్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఇండియన్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలలో ఈ పోస్టులను భర్తీ చేయనుంది. ITI, టెన్త్ అర్హత గలవారు MARCH 3 వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 35ఏళ్లు. మెరిట్, DV, మెడికల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. టెన్త్ అభ్యర్థులకు నెలకు రూ.8200, ITI అభ్యర్థులకు రూ.9600 స్టైపెండ్ చెల్లిస్తారు. సైట్: https://recruit-gov.com/

News February 2, 2026

పాకిస్థాన్‌కు ముందుంది ముసళ్ల పండుగ!

image

T20 WC-2026లో భారత్‌‌తో మ్యాచును బాయ్‌‌కాట్ చేస్తున్నట్లు ప్రకటించిన పాకిస్థాన్‌కు భారీ షాకులు తప్పవని క్రీడా విశ్లేషకులు చెబుతున్నారు.
*టోర్నమెంట్ నుంచి పూర్తిగా బ్యాన్
*పీసీబీకి ICC వార్షిక ఆదాయ పంపిణీ నిలిపివేత
*ద్వైపాక్షిక సిరీస్‌లపై ఆంక్షలతో ఐసీసీ ర్యాంకింగ్స్, WTC పాయింట్లపై ప్రభావం పడే ఛాన్స్
*జియో- హాట్‌స్టార్ కోల్పోయిన ఆదాయాన్ని PCB చెల్లించాల్సి ఉంటుంది.

News February 2, 2026

ఇందిరమ్మ ఇళ్లు.. 4.13 లక్షల ఇళ్లకు కేంద్రం నిధులు!

image

TG: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి కేంద్రం నుంచి ప్రధానమంత్రి ఆవాస్ యోజన(PMAY) పథకం కింద 2026-27 FYలో 4.13 లక్షల ఇళ్లకు నిధులు రానున్నట్లు అధికారులు తెలిపారు. పీఎంఏవై కింద పట్టణ ప్రాంతాల్లో రూ.1.50 లక్షలు, గ్రామాల్లో రూ.72 వేలు అందించనుంది. కాగా ఈ పథకానికి మొత్తం రూ.5 లక్షల నగదు విడతల వారీగా అందజేస్తున్న సంగతి తెలిసిందే.

News February 2, 2026

173 పోస్టులు.. అప్లైకి ఇవాళే లాస్ట్ డేట్

image

<>NCERT<<>>లో 173 నాన్ అకడమిక్ పోస్టులకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. పోస్టును బట్టి టెన్త్, ఇంటర్, డిగ్రీ, డిప్లొమా( ప్రింటింగ్ టెక్నాలజీ, గ్రాఫిక్స్), ITI, B.Tech, M.Tech, PG, MBA, B.L.Sc, M.L.Scఅర్హతతో పాటు పని అనుభవం ఉండాలి. వయసు 27-50ఏళ్ల మధ్య ఉండాలి. రాతపరీక్ష/CBT, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: www.ncert.nic.in

News February 2, 2026

మహిళల్లో ఎక్కువగా వచ్చే క్యాన్సర్లివే..

image

మహిళలకు వచ్చే క్యాన్సర్‌ వ్యాధుల్లో సర్వైకల్‌ (గర్భాశయ ముఖద్వార) క్యాన్సర్‌ మొదటిస్థానంలో ఉంటుంది. దీని తర్వాత స్థానం రొమ్ము క్యాన్సర్‌. వీటితోపాటు యూట్రస్‌ క్యాన్సర్‌, అండాశయ (ఓవేరియన్‌) క్యాన్సర్‌ కూడా ఎక్కువగా వస్తున్నాయి. రొమ్ము క్యాన్సర్‌, ఓవేరియన్‌ క్యాన్సర్‌ వ్యాధులు వంశపారంపర్యంగా వస్తాయి. వీటిని రాకుండా ఆపలేం కానీ, రాకముందే గుర్తించి అప్రమత్తమై చికిత్స చేయవచ్చని నిపుణులు చెబుతున్నారు.

News February 2, 2026

బియ్యపు పిండి దీపంతో అష్టైశ్వర్య ప్రాప్తి

image

సర్వసాధారణంగా, అత్యంత శక్తివంతంగా వాడేది బియ్యపు పిండి దీపం. ఈ దీపాన్ని వెలిగించడం వల్ల అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని శాస్త్ర వచనం. లక్ష్మీదేవి ముందు ప్రతిరోజు బియ్యపు పిండి దీపం వెలిగిస్తే ఆర్థిక ఇబ్బందులు శాశ్వతంగా తొలగిపోతాయి. జాతకంలోని రాహు-కేతు దోషాల నివారణకు కూడా ఈ దీపం రామబాణంలా పనిచేస్తుంది. కుటుంబంలో అభివృద్ధి, సంతాన సౌఖ్యం, నిరంతర సంపద కోరుకునే వారు ఈ దీపారాధన చేయడం అత్యంత శుభప్రదం.

News February 2, 2026

మహిళల్లో క్యాన్సర్ ముప్పును పెంచే అలవాట్లు

image

సిగరెట్లు, మద్యం తాగే మహిళలకు పురుషుల కంటే క్యాన్సర్, గుండె జబ్బుల ప్రమాదం ఎక్కువగా ఉందని పరిశోధకులు గుర్తించారు. పొగాకులోని హానికారకాలకు మహిళల్లోని ఈస్ట్రోజెన్ వంటి కొన్ని ఎంజైమ్‌లు, హార్మోన్లు స్పందించే తీరు భిన్నంగా ఉంటుందని ఇది క్యాన్సర్‌ కారకంగా మారుతుందని నిపుణులు చెబుతున్నారు. ప్రేగు, ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో పాటు గుండె జబ్బులు, ఎంఫిసెమా, ఇతర తీవ్రమైన అనారోగ్యాల ముప్పును కూడా పెంచుతుంది.

News February 2, 2026

తిరుమలలో సర్వ దర్శనానికి 8 గంటలు

image

AP: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. SSD టోకెన్ లేని భక్తులకు శ్రీవారి దర్శనానికి సుమారు 8 గంటల సమయం పడుతోంది. వేంకటేశ్వరుడి దర్శనానికి వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని 5 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న 74,192 మంది స్వామిని దర్శించుకోగా 22,313 మంది తలనీలాలు సమర్పించారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.57 కోట్లు వచ్చినట్లు టీటీడీ ప్రకటించింది.

News February 2, 2026

పీఎం కిసాన్ రూ.6వేలే.. పెంపు లేదు

image

దేశవ్యాప్తంగా పంట పెట్టుబడి సాయం కోసం కేంద్రం పీఎం కిసాన్ స్కీమ్ కింద రైతులకు ఏడాదికి రూ.6వేలు (3 విడతల్లో) ఇస్తున్న సంగతి తెలిసిందే. దీన్ని రూ.8 వేలు లేదా రూ.10 వేలకు పెంచుతారని వార్తలు వచ్చాయి. అయితే బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి నిర్మల దీనిపై ఎలాంటి ప్రకటన చేయలేదు. కాగా తెలంగాణలో ఈ స్కీమ్ ద్వారా 30 లక్షల మంది రైతులు లబ్ధి పొందుతున్నారు.