India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

త్రిభాషా విధానంలో భాగంగా తమ రాష్ట్రంలోని స్కూళ్లలో తెలుగు, తమిళం, కన్నడ, బెంగాలీ, మరాఠీ తదితర భాషలు బోధిస్తున్నట్లు UP CM యోగి ఆదిత్యనాథ్ తెలిపారు. దీనివల్ల తమ స్టేట్ ఏమైనా చిన్నదైపోతుందా? అని ఓ ఇంటర్వ్యూలో ప్రశ్నించారు. త్రిభాషా విధానం వల్ల కొత్త ఉపాధి అవకాశాలు సృష్టించగలుగుతున్నట్లు చెప్పారు. రాజకీయ ప్రయోజనాల కోసమే TN CM స్టాలిన్ ఈ విధానంపై వివాదాలు రాజేస్తున్నారని యోగి మండిపడ్డారు.

ఉద్యోగ జీవితంలో తల్లిదండ్రులు బిజీ అయిపోవడంతో పిల్లలు ఇరువురి ప్రేమకు దూరమైపోతున్నారు. ఇంట్లో మాట్లాడేందుకు ఎవరూ లేకపోవడంతో ఒంటిరైపోతున్నారు. కానీ, పిల్లలతో మాట్లాడుతూ ఉండాలని మానసిక వైద్యులు చెబుతున్నారు. వారితో కలిసి ఒక్కపూటైనా భోజనం చేయాలని, ఏ విషయమైనా మాట్లాడుతూ ఉండాలని సూచిస్తున్నారు. పడుకునే ముందు ఓ కథ చెప్పడం, రోజులో ఏదో ఒక సమయంలో యాక్టివిటీలో పాల్గొనాలంటున్నారు.

NTPC గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ 182 ఇంజినీరింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. వివిధ విభాగాల్లోని పోస్టులకు BE, బీటెక్, ME, డిగ్రీ, CA, తదితర విద్యార్హతలతో పాటు పని అనుభవం ఉండాలి. అన్ని పోస్టులకు వార్షిక వేతనం రూ. 11లక్షలు కాగా, వయసు 30ఏళ్ల వరకు ఉండొచ్చు. ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రక్రియ ఈ నెల 11న ప్రారంభమై వచ్చే నెల 1తో ముగియనుంది. పూర్తి వివరాలకు https://www.ngel.in/careerను సంప్రదించండి.

IBPS నిర్వహించిన 11,826 కస్టమర్ సర్వీస్ అసోసియేట్స్(CSA)-క్లర్క్ పోస్టుల మెయిన్స్ ఫలితాలు విడుదలయ్యాయి. ఎగ్జామ్ రాసిన అభ్యర్థులు <

TG: ఎన్నికల్లో ఇచ్చిన అన్ని హామీలను త్వరలోనే అమలు చేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. హుస్నాబాద్‌లో సన్నబియ్యం పథకాన్ని ఆయన ప్రారంభించారు. రాజీవ్ యువ వికాసం పథకానికి నిరుద్యోగులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. కరవు వస్తుందని కొందరు మాట్లాడుతున్నారని, మానేరు ప్రాజెక్టులో గతేడాది కంటే ఇప్పుడే నీటి నిల్వలు ఎక్కువగా ఉన్నాయని చెప్పారు. అర్హులకు రేషన్ కార్డులు ఇస్తామని పేర్కొన్నారు.

AP: కూటమి ప్రభుత్వం తమపై పాల్పడుతున్న కక్ష సాధింపు చర్యలకు భయపడేది లేదని వైసీపీ నేత పేర్ని నాని అన్నారు. ఎన్ని వేధింపులకు గురిచేసినా జగన్‌ను విడిచివెళ్లనని స్పష్టం చేశారు. స్వయనా కూటమి మంత్రి వెళ్లి బియ్యాన్ని పట్టుకున్నా ఎలాంటి క్రిమినల్ కేసులు పెట్టలేదని విమర్శించారు. కాగా పేర్ని నాని సతీమణి జయసుధకు ఇచ్చిన బెయిల్ రద్దు చేయాలంటూ పోలీసులు హైకోర్టును ఆశ్రయించారు. ఇవాళ విచారణ జరగనుంది.

బంగారం ధరలు ఇవాళ కూడా భారీగా పెరగడంతో ఆల్ టైమ్ రికార్డుకు చేరాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.850 పెరిగి రూ.85,100లకు చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.930 పెరగడంతో రూ.92,840 వద్ద కొనసాగుతోంది. అటు వెండి ధర కూడా రూ.1000 పెరగడంతో కేజీ సిల్వర్ రేటు రూ.1,14,000గా ఉంది. రెండ్రోజుల్లోనే గోల్డ్ రేటు రూ.1640 పెరగడం గమనార్హం.

TG: కంచ గచ్చిబౌలి భూముల అమ్మకం కాంగ్రెస్ ప్రభుత్వ అవకాశవాదమని కేంద్ర మంత్రి బండి సంజయ్ విమర్శించారు. ప్రభుత్వం వేలం వేయాలనుకున్న ఆ 400 ఎకరాల భూమి అటవీ శాఖ పరిధిలోకి వస్తుందన్నారు. కేంద్రం ఆమోదం లేకుండా అడవులను నరికివేయడం కుదరదని సుప్రీంకోర్టు ఆదేశాలున్నాయని గుర్తుచేశారు. ఈ భూమికి సంబంధించిన కేసు హైకోర్టులో నడుస్తోందని చెప్పారు. బీఆర్ఎస్ కన్నా కాంగ్రెస్ ప్రభుత్వం దారుణంగా ఉందని మండిపడ్డారు.

పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణ సంస్థ ట్రెండ్ ఫాలో అవడంలో ముందుంటామంటోంది. SMలో వైరలవుతోన్న జీబ్లీ ట్రెండ్‌లో తాము కూడా చేరుతున్నామంటూ కొన్ని ఫొటోలను షేర్ చేసింది. ‘ది రాజాసాబ్’ సినిమాలో ప్రభాస్ జీబ్లీ పిక్ ఆకట్టుకుంటోంది. ‘మిరాయ్’లో సూపర్ యోధాగా తేజా సజ్జ, ‘తెలుసుకదా’లో సిద్ధూ & రాశి, ఏజెంట్ 116లో అడివిశేష్‌ల పోస్టర్లను ఎడిట్ చేసింది. మరి ఈ ట్రెండ్‌లో మీరూ పాల్గొన్నారా? COMMENT

TG: హైదరాబాద్‌లో దారుణం చోటు చేసుకుంది. నగరంలోని పహాడీషరీఫ్ ప్రాంతంలో జర్మనీ దేశానికి చెందిన యువతిపై గ్యాంగ్ రేప్ జరిగింది. లిఫ్ట్ ఇస్తామని ఆమెను కారులో ఎక్కించుకున్న దుండగులు మార్గంమధ్యలో ఘాతుకానికి పాల్పడ్డారు. ఘటన అనంతరం పోలీసులకు బాధితురాలు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేశారు. ఈ దారుణానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Sorry, no posts matched your criteria.