news

News March 14, 2025

జనసేన ఆవిర్భావ సభ: దారులన్నీ చిత్రాడ వైపే..

image

AP: కాసేపట్లో కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలోని చిత్రాడలో జనసేన ఆవిర్భావ సభ ప్రారంభం కానుంది. ఇందుకోసం రాష్ట్రం నలుమూలల నుంచి జనసైనికులు చిత్రాడకు బయల్దేరారు. సభ కోసం 50 ఎకరాల్లో ఏర్పాట్లు చేశారు. పవన్ సహా 250 మంది వేదికపై కూర్చుంటారు. డొక్కా సీతమ్మ, రాజా సూర్యారావు బహుద్దూర్, మల్లాడి నాయకర్ పేర్లతో ద్వారాలు సిద్ధం చేశారు. పవన్ మ.3.30 గంటలకు ఇక్కడికి చేరుకోనున్నారు.

News March 14, 2025

ఢిల్లీ నుంచి ఒక్క రూపాయీ తేలేదు: KTR

image

TG: సీఎం రేవంత్ 39 సార్లు ఢిల్లీ వెళ్లి మీడియా ముందు సెల్ఫ్ డబ్బా కొట్టుకున్నారని, కానీ అక్కడి నుంచి రాష్ట్రానికి ఒక్క రూపాయి కూడా తేలేదని KTR విమర్శించారు. ‘ ఓటేసి మోసపోయాం అని జనం చివాట్లు పెడుతుంటే ఢిల్లీలో చక్కర్లు కొడుతున్నావ్. నీళ్లు లేక పంటలు ఎండిపోతే కనీసం సాగునీళ్లపై సమీక్ష కూడా లేదు. హామీల అమలు చేతగాక గాలి మాటలు, గబ్బు కూతలు. జాగో తెలంగాణ జాగో’ అని ట్వీట్ చేశారు.

News March 14, 2025

ఇన్సూరెన్స్ కంపెనీ కొంటున్న బాబా రాందేవ్

image

FMCG మేజర్, బాబా రాందేవ్‌కు చెందిన పతంజలి ఆయుర్వేద బీమా రంగంలోకి ప్రవేశిస్తోంది. మాగ్మా ఇన్సూరెన్స్‌లో తన 90% వాటాను పతంజలి, DS గ్రూప్‌నకు విక్రయిస్తున్నట్టు అదార్ పూనావాలా ప్రకటించారు. ఈ డీల్ విలువ రూ.4500 కోట్లని తెలుస్తోంది. ప్రస్తుతం వెహికల్, హెల్త్, పర్సనల్ యాక్సిడెంట్, హోమ్, కమర్షియల్ ఇన్సూరెన్స్ సేవలను మాగ్మా అందిస్తోంది. FY24లో కంపెనీ GWP రూ.3,295 కోట్లుగా ఉంది.

News March 14, 2025

గన్నవరం నుంచి మంగళగిరికి హెలికాప్టరా?: వైసీపీ

image

AP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గన్నవరం నుంచి మంగళగిరికి కూడా రూ.లక్షలు ఖర్చు చేసి హెలికాప్టర్లో తిరుగుతున్నారని వైసీపీ విమర్శించింది. ‘ప్రజలు అవస్థల్లో ఉన్నప్పుడు ఏనాడూ ఇంత హుటాహుటిన వెళ్లింది లేదు. సొంత విలాసాల కోసం మాత్రం ఎగురుకుంటూ వెళ్తారు. అటు కాశినాయన సత్రాలు కూల్చేసినా, ఇటు మహిళలపై వరుస దాడులు జరుగుతున్నా సేనానికి కనిపించదు.. వినిపించదు’ అని ట్వీట్ చేసింది.

News March 14, 2025

NEPని ఒప్పుకోనందుకు రూ.2,152 కోట్లు ఇవ్వలేదు: తమిళనాడు మంత్రి

image

నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీని అంగీకరించనందుకు కేంద్రం తమిళనాడుకు రూ.2,152 కోట్లు విడుదల చేయలేదని ఆ రాష్ట్ర ఆర్థిక మంత్రి తంగం తెన్నరసు తెలిపారు. ‘మా రాష్ట్రంలో మూడు భాషల విధానాన్ని అంగీకరించనందుకు కేంద్రం ఆ నిధులను ఆపింది. అయినా ఫర్వాలేదు. ప్రభుత్వ విద్యార్థుల సంక్షేమం, టీచర్ల జీతాలు, ఇతర ఖర్చుల కోసం మా రాష్ట్ర ప్రభుత్వ నిధులు కేటాయిస్తాం’ అని బడ్జెట్ సందర్భంగా వెల్లడించారు.

News March 14, 2025

BPO ఉద్యోగులకు Shocking News!

image

AI రాకతో BPO/BPM ఇండస్ట్రీలో హైరింగ్ తగ్గుతుందని నిపుణుల అంచనా. కంపెనీ ఆపరేషన్స్‌లో రీస్ట్రక్చర్ తప్పనిసరని, ఉద్యోగుల విధులు మారుతాయని అంటున్నారు. డేటా ఎంట్రీ, కస్టమర్ సపోర్టు, లావాదేవీల ప్రక్రియ వంటి సాధారణ పనులకు ఇకపై మనుషుల అవసరం ఉండదని చెప్తున్నారు. AI టాస్కుల పర్యవేక్షణ, దాంతో పనిచేయించే, కలిసి పనిచేసే ఉద్యోగాల సృష్టి జరుగుతుందని, ఇందుకు వారు ట్రైనింగ్ తీసుకోవాల్సి ఉంటుందని అంటున్నారు.

News March 14, 2025

CM గారికి ఇంత అసహనం పనికిరాదు: కవిత

image

TG: BRS MLA జగదీశ్ రెడ్డిపై సస్పెన్షన్ ఎత్తివేయాలని MLC కవిత డిమాండ్ చేశారు. ‘ఓర్పు లేని వాళ్లు మార్పు ఎలా తెస్తారు? జగదీశ్ రెడ్డి గారిని అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేయడాన్ని ఖండిస్తున్నా. ప్రజా సమస్యలపై గొంతెత్తుతూ, ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపితే సభ నుంచి బహిష్కరిస్తారా? కాంగ్రెస్ ప్రభుత్వానికి, CM గారికి ఇంత అసహనం పనికిరాదు. ప్రజా సమస్యలపై చర్చ జరగకుండా ఉండేందుకే సస్పెండ్ చేశారు’ అని ఆరోపించారు.

News March 14, 2025

హోలీ.. సీఎం రేవంత్ పాత ఫొటోలు

image

TG: హోలీ పండుగ వేళ సీఎం రేవంత్ రెడ్డి పాత ఫొటోలను కొందరు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. నాటి ఆప్తమిత్రులతో కలిసి రేవంత్ రెడ్డి సంబరాలు చేసుకున్నారు. మరి పై ఫొటోల్లో సీఎం ఎక్కడ ఉన్నారో గుర్తు పట్టారా? కామెంట్ చేయండి.

News March 14, 2025

ప్రముఖ నటుడు కన్నుమూత

image

బాలీవుడ్ నటుడు దేబ్ ముఖర్జీ (83) కన్నుమూశారు. గత కొన్ని నెలలుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఇవాళ తుదిశ్వాస విడిచారు. అధికార్, జో జీతా వోహీ సికందర్ వంటి పలు సినిమాల్లో నటించారు. ఆయన కుమారుడు అయాన్ ముఖర్జీ హిందీ సినీ పరిశ్రమలో దర్శకుడిగా రాణిస్తున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్, హృతిక్ రోషన్ నటిస్తున్న ‘వార్-2’ను డైరెక్ట్ చేస్తున్నారు.

News March 14, 2025

సీఎం ఒక్కరే నిర్ణయాలు తీసుకోరు: మంత్రి పొన్నం

image

TG: తమ ప్రభుత్వంలో ఏ నిర్ణయమైనా CM ఒక్కరే తీసుకోరని, అంతా కలిసి నిర్ణయం తీసుకుంటామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. అసెంబ్లీ నుంచి జగదీశ్ రెడ్డిని సస్పెండ్ చేయడంపై BRS నిరసనకు దిగడం సిగ్గుచేటని అన్నారు. ‘తాము అనుకున్నట్లుగా సభ నడవాలనేది BRS నేతల ఉద్దేశం. అందుకే దుష్ప్రచారాలు చేస్తున్నారు. స్పీకర్‌గా దళితుడు ఉన్నారనే అవమానించారు. పొరపాటు అయ్యిందని చెబితే వివాదం ముగిసేది’ అని వ్యాఖ్యానించారు.