news

News March 11, 2025

KCRను కలిసిన దాసోజు శ్రవణ్

image

TG: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి దాసోజు శ్రవణ్ మాజీ సీఎం కేసీఆర్‌ను కలిశారు. తనకు MLCగా అవకాశం ఇచ్చినందుకు కుటుంబ సమేతంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా కేసీఆర్ ఆశీర్వాదం తీసుకున్నారు. అటు దాసోజుకు కేసీఆర్ అభినందనలు తెలిపారు.

News March 11, 2025

రేపు 1532మందికి ఉద్యోగ నియామక పత్రాలు

image

TG: జూనియర్ లెక్చరర్(1292మంది), పాలిటెక్నిక్ లెక్చరర్(240మంది) ఉద్యోగాలకు ఎంపికైన వారికి సీఎం రేవంత్ రేపు నియామక పత్రాల్ని అందించనున్నారు. హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో ఈ కార్యక్రమం జరగనుంది. కొత్తగా కొలువుల్లోకి చేరే ఈ సిబ్బందికి విద్యాశాఖ విధానాలు, బోధనాపద్ధతులపై ట్రైనింగ్ అనంతరం పోస్టింగ్స్ ఇస్తామని విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా తెలిపారు.

News March 11, 2025

ఎలా డైట్ చేస్తే మంచిది?

image

వెంటనే బరువు తగ్గాలని కొందరు చేస్తున్న డైట్ ప్రాణాలకు ముప్పు తెస్తోంది. తాజాగా కేరళ యువతి <<15712364>>శ్రీనంద<<>> ఇలాగే ఆహారం మానేసి 5నెలల పాటు నీళ్లే తాగి చనిపోయింది. రోజూ మనం తీసుకునే ఫుడ్‌లో 500క్యాలరీల చొప్పున తగ్గిస్తే.. వారానికి 0.5కేజీ, నెలకు 2కిలోలు తగ్గుతామని వైద్యులు చెబుతున్నారు. ఇది ఆరోగ్యవంతమైన డైట్ అని అంటున్నారు. కొందరు 24- 72hrs కేవలం నీళ్లతోనే డైట్ చేస్తారని ఇది ప్రమాదకరమని హెచ్చరిస్తున్నారు.

News March 11, 2025

‘ఛావా‘ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్?

image

విక్కీ కౌశల్, రష్మిక మందన్న జంటగా నటించిన ‘ఛావా‘ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. నెట్‌ఫ్లిక్స్‌లో ఏప్రిల్ 11న ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతుందని సమాచారం. కాగా బాలీవుడ్‌లో దుమ్మురేపిన ఈ మూవీ తెలుగులోనూ పాజిటివ్ టాక్‌ సొంతం చేసుకుంది. విడుదలైన మూడు రోజులకే రూ.10 కోట్లకుపైగా కలెక్షన్లు రాబట్టింది. ఛత్రపతి శివాజీ కుమారుడు శంభాజీ మహారాజ్ జీవితం ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.

News March 11, 2025

మణిపుర్‌లో రోడ్డు ప్రమాదం.. ముగ్గురు జవాన్ల వీరమరణం

image

మణిపుర్‌లో బీఎస్ఎఫ్ జవాన్లు ప్రయాణిస్తున్న ట్రక్కు లోయలో పడటంతో ముగ్గురు జవాన్లు వీరమరణం పొందారు. మరో 13మంది గాయాలపాలయ్యారు. సేనాపతి జిల్లాలోని చాంగౌబంగ్ గ్రామం సమీపంలో ఈ ఘటన జరిగింది. గాయపడిన వారిలో కొంతమంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర గవర్నర్ అజయ్ కుమార్ భల్లా మృతుల కుటుంబాలకు తన సంతాపాన్ని తెలియజేశారు.

News March 11, 2025

బీరువాలో కాగితాలు.. వాటి విలువ రూ.12 లక్షలు!

image

ఇంట్లోని పాత కాగితాలు అతనికి దాదాపు రూ.12 లక్షలు తెచ్చిపెట్టాయి. రతన్ అనే వ్యక్తికి తన తండ్రి 1992లో రిలయన్స్ ఇండస్ట్రీస్‌లో కొన్న షేర్స్ అగ్రిమెంట్ పేపర్స్ బీరువాలో లభించాయి. ఒక్క షేర్‌ రూ.10 చొప్పున 30 షేర్లు కొనుగోలు చేశారు. దీని గురించి రతన్ ట్వీట్ చేయడంతో ట్రేడ్ నిపుణులు కామెంట్స్ చేస్తున్నారు. అన్ని బోనస్‌లు కలిపి ఇప్పుడవి 960 షేర్స్ అయ్యాయని, వీటి విలువ రూ.11.88 లక్షలని చెబుతున్నారు.

News March 11, 2025

పిల్లల ఆకలి తీర్చేందుకు..!

image

పిల్లల కోసం తల్లి ఏమైనా చేస్తుందనే విషయాన్ని లండన్‌కు చెందిన మేరీ ఆన్ బెవన్ నిరూపించారు. నలుగురు పిల్లలున్న ఆమె 1914లో భర్త చనిపోవడంతో కుటుంబ పెద్దగా మారారు. వారి పోషణ కష్టమవగా ఓ కఠిన నిర్ణయం తీసుకున్నారు. అక్రోమెగలీ వ్యాధి కారణంగా ఆమె ముఖం అందవిహీనంగా మారడంతో ‘వరల్డ్ అగ్లీయెస్ట్ ఉమెన్’ పోటీలో పాల్గొన్నారు. గెలిచిన డబ్బుతో వారి ఆకలి తీర్చారు. ఆ తర్వాత సర్కస్‌లో చేరి వారి బాగోగులు చూసుకోగలిగారు.

News March 11, 2025

నెలకు రూ.5,000.. దరఖాస్తు గడువు పెంపు

image

PM ఇంటర్న్‌షిప్ స్కీమ్ దరఖాస్తు గడువు రేపటితో ముగియాల్సి ఉండగా ఈనెల 31 వరకు పొడిగిస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. ఈ స్కీమ్ కింద SSC, ఇంటర్, డిప్లొమా, ITI, డిగ్రీ చదివిన 21-24 ఏళ్ల వయసు నిరుద్యోగులకు దేశంలోని టాప్-500 కంపెనీల్లో 1yr ఇంటర్న్‌షిప్ కల్పిస్తారు. నెలకు ₹5000 స్టైఫండ్, వన్‌టైం గ్రాంట్ కింద ₹6000 ఇస్తారు. అభ్యర్థుల కుటుంబ ఆదాయం ఏడాదికి ₹8Lలోపు ఉండాలి. దరఖాస్తుకు ఇక్కడ <>క్లిక్<<>> చేయండి.

News March 11, 2025

CM రేవంత్‌ను కలిసిన మోహన్ బాబు, విష్ణు

image

TG: నటుడు మోహన్ బాబు, ఆయన తనయుడు మంచు విష్ణు సీఎం రేవంత్‌ను ఈరోజు మర్యాదపూర్వకంగా కలిశారు. జూబ్లీహిల్స్‌లోని తన నివాసానికి వచ్చిన వారిని సీఎం సాదరంగా పలకరించారు. అనంతరం నటులిద్దరూ ముఖ్యమంత్రికి శాలువాలు కప్పి సత్కరించారు. విష్ణు ట్విటర్లో ఈ విషయాన్ని వెల్లడించారు. పలు కీలక అంశాలపై చర్చించామని, రాష్ట్రంలో సినీ పరిశ్రమ అభివృద్ధికి తన సహకారం ఉంటుందని సీఎం హామీ ఇచ్చారని ఆయన పేర్కొన్నారు.

News March 11, 2025

గ్రూప్-2 ఫస్ట్ ర్యాంకర్ ఇతనే

image

TG: టీజీపీఎస్సీ వెల్లడించిన గ్రూప్-2 ఫలితాల్లో నారు వెంకట హర్షవర్ధన్ రెడ్డి ఫస్ట్ ర్యాంక్ సాధించారు. 600 మార్కులకుగానూ 447.088 మార్కులు సాధించి టాపర్‌గా నిలిచారు. కాగా హర్షవర్ధన్ సూర్యాపేట జిల్లా కోదాడ వాసి. ఆయన తండ్రి రమణారెడ్డి కేఆర్ఆర్ ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపల్‌గా పనిచేస్తున్నారు. హర్షవర్ధన్ ఏడో తరగతి వరకు ఖమ్మం, 8 నుంచి ఇంటర్ వరకు విజయవాడ, బీటెక్ తాడేపల్లిగూడెంలో చదివారు.