India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

AP: విశాఖపట్నం ఎండాడలోని ‘హయగ్రీవ’ భూములను రాష్ట్ర సర్కార్ నిషేధిత జాబితాలో చేర్చింది. ఈ భూములకు సంబంధించి రిజిస్ట్రేషన్ జరగకుండా కలెక్టర్ హరేంధిర ప్రసాద్ చర్యలు తీసుకున్నారు. కాగా వైసీపీ హయాంలో హయగ్రీవ ఫార్మ్స్ అండ్ డెవలపర్స్ సంస్థకు 12.51 ఎకరాలు కేటాయించింది. నిబంధనలు ఉల్లంఘించి అక్రమాలకు పాల్పడిందంటూ కూటమి సర్కార్ ఆ భూములను వెనక్కి తీసుకుంది. ఇప్పుడు వీటిని నిషేధిత జాబితాలో చేర్చింది.

డీలిమిటిషన్‌లో భాగంగా దేశంలోని అన్ని రాష్ట్రాల్లో సీట్లు పెరుగుతాయని, తమిళనాడులో కూడా పెరుగుతాయని కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. ‘నియోజకర్గాల పునర్విభజనలో ఉత్తరాది రాష్ట్రాలకే ప్రయోజనం చేకూరుతుందనేది అపోహే. దక్షిణాది రాష్ట్రాల్లో కూడా పెరుగుతాయి. దీనిపై కొందరు రాద్ధాంతం చేస్తున్నారు. ఒక ప్లాన్ ప్రకారం పునర్విభజన ప్రక్రియ జరుగుతుంది. దీనికి అందరి సలహాలు స్వీకరిస్తాం’ అని చెప్పారు.

ఆమిర్ ఖాన్, రణ్‌బీర్ కపూర్ ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్ ఇవ్వనున్నారు. నటి అలియా భట్ ఈ విషయాన్ని తన ఇన్‌స్టాలో ప్రకటించారు. ‘బ్యాటిల్ ఆఫ్ ది బెస్ట్. నాకు అత్యంత ఇష్టమైన ఇద్దరు నటులు పోటీ పడనున్నారు. చాలా ఉత్సుకతగా ఉంది. మరిన్ని వివరాలు రేపు చెప్తా. నాకెంత నచ్చిందో మీకూ అంత నచ్చుతుంది. నాకు తెలుసు’ అని పోస్ట్ చేశారు. దీంతో ఇది మల్టీస్టారరా లేక ఏదైనా ప్రకటనా అంటూ సినీ అభిమానులు చర్చించుకుంటున్నారు.

ఛాంపియన్స్ ట్రోఫీ ముగియడంతో దేశంలో IPL ఫీవర్ ప్రారంభమైంది. ఆయా జట్ల ఆటగాళ్లు ఇప్పుడిప్పుడే తమ జట్లతో చేరుతున్నారు. RCB కెప్టెన్ రజత్ పాటిదార్, ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్య, పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ తమ టీమ్‌తో జతకలిశారు. కృనాల్ పాండ్య, భువనేశ్వర్ కుమార్ (RCB), నోకియా, డికాక్, రమణ్‌దీప్ సింగ్ (KKR) తదితరులు ఇప్పటికే ప్రాక్టీస్ మొదలెట్టారు. ఈ నెల 22 నుంచి క్యాష్ రిచ్ లీగ్ ప్రారంభం కానుంది.

నేటి కాలంలో స్వచ్ఛమైన గాలి దొరకడమూ గగనంగానే మారింది. ఓ అధ్యయనం ప్రకారం ఐస్‌ల్యాండ్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఫిన్లాండ్, కెనడా దేశాల్లో అత్యంత స్వచ్ఛమైన గాలి లభిస్తోందని తేలింది. ఈ దేశాల విస్తీర్ణంతో పోలిస్తే జనాభా బాగా తక్కువగా ఉండటంతో కాలుష్యం తక్కువగా ఉంటోందని పరిశోధకులు పేర్కొన్నారు. రణగొణ ధ్వనులు లేని ప్రశాంతమైన జీవితం, పచ్చటి ప్రకృతి, స్వచ్ఛమైన నీరు ఈ దేశాల్లో లభ్యమవుతున్నాయని వివరించారు.

స్టాక్‌మార్కెట్లు ఫ్లాటుగా ముగిశాయి. నిఫ్టీ 22497 (37), సెన్సెక్స్ 74,102 (-12) వద్ద స్థిరపడ్డాయి. గ్యాప్‌డౌన్లో మొదలైన సూచీలు నష్టాల నుంచి రికవరీ అయ్యాయి. రియాల్టి, O&G, PSE, ఇన్ఫ్రా, ఫైనాన్స్, హెల్త్‌కేర్, మెటల్ షేర్లు ఎగిశాయి. బ్యాంకు, ఐటీ, ఆటో, మీడియా, FMCG షేర్లు తగ్గాయి. ట్రెంట్, BPCL, సన్‌ఫార్మా, ICICI బ్యాంకు, శ్రీరామ్ ఫైనాన్స్ టాప్ గెయినర్స్. ఇండస్‌ఇండ్, ఇన్ఫీ, M&M, టాప్ లూజర్స్.

కన్నడ నటి రన్యా రావ్ గోల్డ్ స్మగ్లింగ్ కేసు విచారణను CBI వేగవంతం చేసింది. ఆమె పెళ్లి చేసుకున్న వేదిక, ఇళ్లు, ఆఫీసుల్లో సోదాలు ఆరంభించినట్టు తెలిసింది. కీలక పత్రాలను పరిశీలిస్తున్నట్టు సమాచారం. అలాగే VVIPలు, పోలీసులు, రాజకీయ నాయకులతో ఆమె సంబంధాలపై కూపీ లాగుతున్నట్టు తెలిసింది. ఒకవైపు DRI మరోవైపు CBI విచారణతో రన్యా రావ్ ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ప్రస్తుతం ఆమె కోర్టు కస్టడీలో ఉన్నారు.

AP ఐసెట్ నోటిఫికేషన్‌ను ఆంధ్రా యూనివర్సిటీ విడుదల చేసింది. 2025-26 విద్యాసంవత్సరానికి సంబంధించి MBA, MCA కోర్సుల్లో ప్రవేశాల కోసం ఈ పరీక్ష నిర్వహిస్తారు. మార్చి 13వ తేదీ నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం అవుతుంది. ఎలాంటి లేట్ ఫీజు లేకుండా ఏప్రిల్ 9 వరకు అప్లై చేయవచ్చు. మే 7వ తేదీన ఉదయం 9-11.30 వరకు, మ.2-4.30 వరకు పరీక్ష జరుగుతుంది. ఫీజు OCలు రూ.650, బీసీలు రూ.600, ఎస్సీ, ఎస్టీలు రూ.550 చెల్లించాలి.

ప్రస్తుత ఆటగాళ్లలో అత్యధిక సెంచరీలు చేసిన ప్లేయర్ రన్ మెషీన్ విరాట్ కోహ్లీ. ఈయన కెరీర్‌లో 5 ICC ట్రోఫీలు గెలవగా అందులో మూడు సార్లు ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్‌గా నిలిచారు. ICC ఈవెంట్స్‌లో అత్యధిక రన్స్, ICC సెమీస్& ఫైనల్స్‌లో POTM, రెండు సార్లు ICC డికేడ్ అవార్డ్స్, 8 సార్లు ICC యాన్వల్ అవార్డ్స్ పొందారు. ఇన్ని అవార్డులున్న కోహ్లీ కాకుంటే ఇంకెవరు Mr.ICC అని ఆయన అభిమానులు ట్వీట్స్ చేస్తున్నారు.

AP: గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రవ్యాప్తంగా 228 ఆలయాలపై దాడులు జరిగాయని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు. కానీ వీటిపై 32 కేసులే నమోదయ్యాయని శాసనమండలిలో చెప్పారు. ‘ఆలయాలపై దాడులకు సంబంధించి విచారణకు ఆదేశించాం. వీటిపై పూర్తి నివేదిక అందించాలని అధికారులకు సూచించాం. ఆలయాలపై దాడులు జరగకుండా CC కెమెరాలు ఏర్పాటు చేశాం. వీటిని RTGSకు లింక్ చేశాం’ అని ఆయన వెల్లడించారు.
Sorry, no posts matched your criteria.