news

News March 11, 2025

R5 జోన్‌ లబ్ధిదారులకు వేరే చోట స్థలాలు: నారాయణ

image

AP: రాజధానిపై కక్షతోనే అమరావతిలో మాజీ CM జగన్ R5 జోన్ క్రియేట్ చేశారని మంత్రి నారాయణ అన్నారు. అక్కడ సెంటు చొప్పున 50వేల మందికి ఇచ్చిన స్థలాన్ని వెనక్కి తీసుకొని వారికి వేరేచోట స్థలాలు ఇస్తామని చెప్పారు. ప్రతిపక్షంలో రాజధానికి 30K ఎకరాలు కావాలన్న జగన్ అధికారంలోకి వచ్చి మూడుముక్కలాట ఆడారని విమర్శించారు. 3 ఏళ్లలో రాజధానిని నిర్మిస్తామని, కీలకమైన 185అడుగుల వెడల్పు రోడ్లు 2 ఏళ్లలో పూర్తవుతాయన్నారు.

News March 11, 2025

తగ్గిన బంగారం ధరలు!

image

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు కాస్త తగ్గాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.300 తగ్గి రూ.80,200లకు చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.330 తగ్గడంతో రూ.87,490కు చేరింది. అటు వెండి ధర కూడా రూ.1000 తగ్గడంతో కేజీ సిల్వర్ రేటు రూ.1,07,000గా ఉంది. వివాహ శుభకార్యాల నేపథ్యంలో బంగారం, వెండికి భారీ డిమాండ్ నెలకొంది.

News March 11, 2025

భారత్‌కు US ఇంటెలిజెన్స్ చీఫ్ తులసీ గబ్బార్డ్!

image

అమెరికా ఇంటెలిజెన్స్ చీఫ్‌ తులసీ గబ్బార్డ్ తొలిసారి భారత్‌‌కు వస్తున్నారు. 4 దేశాల పర్యటనలో భాగంగా మొదట జపాన్‌కు వెళ్తారు. అక్కడి నుంచి థాయ్‌లాండ్‌కు, ఆ తర్వాత భారత్‌కు వస్తారు. ఇక్కడి ఇంటెలిజెన్స్, సెక్యూరిటీ వర్గాలతో సమావేశమవుతారు. సైబర్ సెక్యూరిటీ, కౌంటర్ టెర్రరిజం, AI, ఇంటెలిజెన్స్ షేరింగ్‌పై చర్చిస్తారు. ఆ తర్వాత ఫ్రాన్స్‌కు వెళ్తారు. చైనా‌ను కౌంటర్ చేయడమే ఆమె పర్యటన ఉద్దేశంగా తెలుస్తోంది.

News March 11, 2025

ఫ్రీ బస్ వల్లే మహిళలకు గౌరవం తగ్గిందా?

image

TGSRTCపై ప్రయాణికుల నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నాయి. అర్ధరాత్రి వేళ మహిళలు బస్సు ఆపమంటే స్టాప్ లేదని దూరంగా ఆపుతున్నారని, ఎంతో ఇబ్బంది అవుతోందని పలువురు ఫిర్యాదులు చేస్తున్నారు. మహిళలు ఎక్కడ ఆపమన్నా ఆపాలని రూల్ ఉందని, దీన్ని పట్టించుకోవట్లేదని ఫైరవుతున్నారు. కొందరు ఆవేశంగా మాట్లాడుతున్నారని చెబుతున్నారు. ఫ్రీ బస్సు వల్ల మహిళలను గౌరవించట్లేదని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. దీనిపై మీ కామెంట్?

News March 11, 2025

కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ పనులు 65% పూర్తి: కిషన్ రెడ్డి

image

TG: హన్మకొండ(D) కాజీపేటలో నిర్మిస్తున్న రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ప్రాజెక్టు పనులు 65% పూర్తయినట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ఈ ప్రాజెక్టు రివైజ్డ్ బడ్జెట్ రూ.716 కోట్లు అని పేర్కొన్నారు. 160 ఎకరాలలో అంతర్జాతీయ ప్రమాణాలతో దీనిని అభివృద్ధి చేస్తున్నామని, ఇది ఏడాదికి 2,400కు పైగా వ్యాగన్లను తయారు చేసే సామర్థ్యాన్ని కలిగి ఉంటుందని చెప్పారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను Xలో షేర్ చేశారు.

News March 11, 2025

Stock Markets: తప్పని విలవిల..

image

స్టాక్‌మార్కెట్లు నష్టాల్లో చలిస్తున్నాయి. నిఫ్టీ 22,356 (-104), సెన్సెక్స్ 73,724 (-383) వద్ద ట్రేడవుతున్నాయి. ట్రంప్ టారిఫ్స్ భయం, అమెరికా మార్కెట్లు కుప్పకూలడం నెగటివ్ సెంటిమెంటుకు దారితీసింది. చమురు, రియాల్టి, హెల్త్‌కేర్ సూచీలు స్వల్పంగా ఎగిశాయి. మిడ్, స్మాల్ క్యాప్, మీడియా, ఐటీ, ప్రైవేటు బ్యాంకు, వినియోగ, ఆటో, బ్యాంకు షేర్లు విలవిల్లాడుతున్నాయి. ఇండస్ఇండ్, ఇన్ఫీ, M&M, విప్రో టాప్ లూజర్స్.

News March 11, 2025

రోహిత్ వల్లే ఓడిపోయాం: శాంట్నర్

image

ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌లో ఓడిపోవడంపై NZ కెప్టెన్ శాంట్నర్ స్పందించారు. బ్యాటింగ్‌లో 20రన్స్ తక్కువగా చేశామని, ఆపై రోహిత్ అసాధారణ బ్యాటింగ్‌తో మ్యాచ్‌ను తమ నుంచి లాగేసుకున్నారని తెలిపారు. హిట్‌మ్యాన్ బ్యాటింగే రెండు టీమ్‌ల మధ్య తేడా అన్నారు. బలమైన జట్టు చేతిలోనే ఓడిపోయామని వివరించారు. తమ జట్టు మంచి క్రికెట్ ఆడి INDకు గట్టి పోటీ ఇచ్చిందని చెప్పారు. ఈ ఓటమి చేదు, తీపితో కూడుకున్నదని తెలిపారు.

News March 11, 2025

త్వరలో 900 అంగన్వాడీలు ప్రారంభం: మంత్రి సంధ్యారాణి

image

AP: రాష్ట్ర వ్యాప్తంగా రానున్న రెండుమూడు నెలల్లో 900 అంగన్వాడీ కేంద్రాలు ప్రారంభించనున్నట్లు మహిళా, శిశు, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు. అంగన్వాడీల్లో తాగునీరు, టాయిలెట్స్ కోసం రూ.7 కోట్లు కేటాయించినట్లు చెప్పారు. అలాగే గిరిజనుల కోసం 18 రకాల సంక్షేమ పథకాలు అమలు చేస్తామని బడ్జెట్ ఆమోదం కోసం జరిగిన చర్చలో వివరించారు. మరోవైపు మహిళల సాధికారత TDPతోనే ప్రారంభమైందని వివరించారు.

News March 11, 2025

IPL: లక్నోకు బిగ్ షాక్!

image

ఐపీఎల్ 2025 ప్రారంభానికి ముందే లక్నో సూపర్ జెయింట్స్‌కు షాక్ తగిలింది. ఫాస్ట్ బౌలర్ మయాంక్ యాదవ్ గాయం కారణంగా ఈ సీజన్ ఫస్టాఫ్‌కు అందుబాటులో ఉండరని క్రీడా వర్గాలు పేర్కొన్నాయి. గత సీజన్‌లో అదరగొట్టడంతో మెగా వేలంలో రూ.11 కోట్లు చెల్లించి మయాంక్‌ను LSG రిటైన్ చేసుకుంది. 150kmph వేగంతో బంతులు వేయడం మయాంక్ ప్రత్యేకత. కాగా మార్చి 24న లక్నో తన తొలి మ్యాచ్ ఢిల్లీ క్యాపిటల్స్‌తో ఆడనుంది.

News March 11, 2025

18 సీజన్లు.. ఒక్కడే కింగ్: RCB

image

విరాట్ కోహ్లీని 2008లో సరిగ్గా ఇదే రోజున IPL ఆక్షన్‌లో కొనుగోలు చేసినట్లు RCB ట్వీట్ చేసింది. ‘U19 ప్లేయర్ డ్రాఫ్ట్ నుంచి ఈ టాలెంటెడ్ బాయ్‌ను తీసుకున్నాం. 18yrs తర్వాత కూడా ఈ గేమ్‌కు అతడే కింగ్. ఇది చాలా గొప్ప ప్రయాణం. థాంక్యూ విరాట్. 18 సీజన్లు, 1 టీమ్, 1 కాన్‌స్టాంట్ కింగ్’ అని ఓ స్పెషల్ పోస్టర్‌ను రిలీజ్ చేసింది. ఇప్పటివరకు ఒక్క టైటిల్ కూడా గెలవని RCB ఈసారైనా ఛాంపియన్‌గా నిలుస్తుందేమో చూడాలి.