news

News March 10, 2025

‘డైటింగ్’ చేసి యువతి మృతి

image

బరువు తగ్గాలని చేసిన ‘డైటింగ్’ ఓ అమ్మాయి ప్రాణం తీసింది. కేరళలోని కూతుపరంబకు చెందిన శ్రీనంద(18) ఆన్‌లైన్‌లో చూసి లావు తగ్గాలనుకుంది. ఆహారం తినడం మానేసి నీరు మాత్రమే తాగేది. ఎక్సర్‌సైజ్‌లు చేసింది. దీంతో శ్రీనంద ఆరోగ్యం పూర్తిగా క్షీణించింది. ఆమెను ఆసుపత్రిలో చేర్పించగా వైద్యులు చూసి షాక్ అయ్యారు. శ్రీనంద బరువు 24 కేజీలకు దిగజారింది. షుగర్ లెవెల్స్, సోడియం, BP పడిపోవడంతో ప్రాణాలు కోల్పోయింది.

News March 10, 2025

ఉద్యమకారిణిగా నాకు అవకాశం వచ్చింది: విజయశాంతి

image

TG: MLC పదవి అడుక్కోవడానికి బిచ్చగాళ్లం కాదని, ఉద్యమకారిణిగా తనకు కాంగ్రెస్ ఆ పదవి ఇచ్చిందని విజయశాంతి వెల్లడించారు. ‘మేమే అసలైన ఉద్యమకారులం. KCRను ఓడించేందుకు BJP గతంలో నన్ను ఆహ్వానించింది. కానీ BJP-BRS మధ్య లోపాయికారి ఒప్పందం జరిగింది. అందుకే కమలం పార్టీ నుంచి బయటకు వచ్చాను. BC మహిళా నేతగా నన్ను కాంగ్రెస్‌లో గుర్తించారు. క్యాబినెట్‌లోకి తీసుకోవడం అనేది పార్టీ నిర్ణయిస్తుంది’ అని ఆమె చెప్పారు.

News March 10, 2025

ITBP స్పోర్ట్స్ కోటాలో 133 ఉద్యోగాలు

image

ITBP స్పోర్ట్స్ కోటాలో 133 కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది. అథ్లెటిక్స్, స్విమ్మింగ్, షూటింగ్, బాక్సింగ్, కబడ్డీ, తదితర క్రీడా విభాగాల్లో 3/4/2023 నుంచి 2/4/2025 వరకు నోటిఫికేషన్‌లోని పేరా (4)Dలో పేర్కొన్న క్రీడల్లో మెడల్స్ సాధించి ఉండాలి. ఈ నెల 4న ప్రారంభమైన ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ వచ్చే నెల 4 వరకు అందుబాటులో ఉంటుంది. నోటిఫికేషన్ పూర్తి వివరాల కోసం ఇక్కడ <>క్లిక్<<>> చేయండి.

News March 10, 2025

కోర్టులో జడ్జి ముందు ఒక్కసారిగా విలపించిన నటి!

image

బంగారం స్మగ్లింగ్ చేస్తూ కెంపెగౌడ విమానాశ్రయంలో దొరికిపోయిన నటి రన్యారావు కోర్టులో ఒక్కసారిగా బరస్ట్ అయ్యారు. న్యాయమూర్తి ముందు కన్నీరు పెట్టుకున్నారు. కస్టడీలో అధికారులు తనను మానసికంగా హింసించారని, దుర్భాషలాడారని ఆరోపించారు. మరోవైపు విచారణకు రన్య సహకరించడం లేదని కోర్టుకు DRI వెల్లడించింది. హింసించారన్న ఆమె ఆరోపణ అవాస్తవమని పేర్కొంది.

News March 10, 2025

రేపు SRM యూనివర్సిటీకి సీఎం చంద్రబాబు

image

AP: అమరావతి నీరుకొండలోని SRM యూనివర్సిటీకి సీఎం చంద్రబాబు రేపు వెళ్లనున్నారు. పాపులేషన్ డైనమిక్స్ అండ్ డెవలప్‌మెంట్ అనే వర్క్‌షాప్‌లో సా.4.30 గంటలకు సీఎం పాల్గొని ప్రసంగిస్తారు. ఏపీ ప్రణాళిక శాఖ ఆధ్వర్యంలో జరిగే ఈ కార్యక్రమంలో జాతీయ, అంతర్జాతీయ నిపుణులు పాల్గొననున్నారు. పర్యటనలో భాగంగా SRMలోని పలు భవనాలను సీఎం ప్రారంభిస్తారు.

News March 10, 2025

అప్పుడు హాస్యాస్పదం.. ఇప్పుడేమో!

image

ఈజీగా మనీ సంపాదించవచ్చు అంటూ సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. ఈక్రమంలో IPS అధికారి రమేశ్ ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశారు. ‘లలిత జువెల్లరీ ఓనర్ కిరణ్ డబ్బులు ఎవరికీ ఊరికే రావు అని చెప్పే వ్యాఖ్యలు చాలా మందికి హాస్యాస్పదం అనిపించవచ్చు. ఇప్పుడు జరుగుతున్న ఆర్థిక నేరాలు చూస్తుంటే ఇదే వేద వాక్కు అనిపిస్తుంది. అత్యాశకు పోయి డబ్బు సంపాదించుకోవాలని అనుకునేవారు ఓ సారి పునరాలోచించండి’ అని పేర్కొన్నారు.

News March 10, 2025

‘అవతార్’లో హీరోగా నేనే ఉండాల్సింది: బాలీవుడ్ నటుడు

image

‘అవతార్‌’లో హీరోగా చేయాలని దర్శకుడు జేమ్స్ కామెరూన్ మొదట తన వద్దకే వచ్చారని బాలీవుడ్ నటుడు గోవిందా ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ‘పాత్రకోసం బాడీకి పెయింట్ వేసుకోవాలన్నారు. ఆరోగ్యం పాడవుతుందేమోనని ఆ సినిమాకు నో చెప్పాను. ‘అవతార్’ టైటిల్ బాగుంటుందని నేనే ప్రతిపాదించాను’ అని వెల్లడించారు. కాగా.. ఆ మూవీ ఇప్పటి వరకు రెండు భాగాలుగా విడుదల కాగా ‘ఫైర్ అండ్ యాష్’ పేరిట మూడో భాగం ఈ ఏడాది డిసెంబరులో రిలీజవనుంది.

News March 10, 2025

ఆస్ట్రేలియా వద్దే అత్యధిక ట్రోఫీలు!

image

ఛాంపియన్స్ ట్రోఫీని టీమ్ఇండియా గెలుచుకున్న విషయం తెలిసిందే. ఈ విజయంతో ఇండియా ఖాతాలో 7 ICC ట్రోఫీలు నమోదయ్యాయి. ఇందులో 2 వన్డే వరల్డ్ కప్స్, 2 టీ20 వరల్డ్ కప్స్‌తో పాటు 3 ఛాంపియన్స్ ట్రోఫీలు ఉన్నాయి. అయితే, అత్యధిక ట్రోఫీలు మాత్రం ఆస్ట్రేలియా వద్దే ఉండటం గమనార్హం. AUS ఏకంగా 10 ICC ట్రోఫీలు గెలుచుకుంది. ఇండియా తర్వాత వెస్టిండీస్ వద్ద 5, శ్రీలంక, పాకిస్థాన్, ఇంగ్లండ్ వద్ద చెరో మూడు ట్రోఫీలున్నాయి.

News March 10, 2025

తెలంగాణ భక్తులకు నిరాశ

image

తిరుమలలో తెలంగాణ భక్తులకు మళ్లీ నిరాశే ఎదురైంది. మంత్రులు, ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలపై తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్దామనుకున్న వారి లేఖలను టీటీడీ స్వీకరించడం లేదు. ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండా ఇలా చేయడం ఏంటని భక్తులు మండిపడుతున్నారు. కేవలం తెలంగాణకు చెందిన ప్రజాప్రతినిధుల లేఖలే తీసుకోవడం లేదని భక్తులు ఆరోపిస్తున్నారు. దీనిపై టీటీడీ ఇంకా స్పందించలేదు.

News March 10, 2025

‘మండే’పోయిన Stock Markets

image

స్టాక్‌మార్కెట్లు భారీగా నష్టపోయాయి. సెన్సెక్స్ 74115 (-217), నిఫ్టీ 22460 (-92) వద్ద ముగిశాయి. అనిశ్చితి, ట్రంప్ టారిఫ్స్, US షట్‌డౌన్ అంశాలు సూచీలను పడేశాయి. FMCG షేర్లు ఎగిశాయి. రియాల్టి, PSUబ్యాంకు, O&G, వినియోగం, ఎనర్జీ, ఆటో, తయారీ, మెటల్, హెల్త్‌కేర్, ఫార్మా, బ్యాంకు షేర్లు ఎరుపెక్కాయి. పవర్‌గ్రిడ్, HUL, ఇన్ఫీ, SBI లైఫ్, నెస్లే, ఏషియన్ పెయింట్స్ టాప్ గెయినర్స్. ONGC, ట్రెంట్ టాప్ లూజర్స్.