news

News March 9, 2025

నీడనిచ్చిన బాపూజీకి నిలువనీడ లేకుండా చేశారు: రేవంత్

image

తెలంగాణ ఉద్యమంలో కొండా లక్ష్మణ్ బాపూజీది కీలకపాత్ర అని CM రేవంత్ గుర్తుచేశారు. ఉద్యమ టైంలో నీడ లేని వాళ్లకు తన ఇల్లు ఇచ్చిన మహనీయుడు బాపూజీ అని వివరించారు. అలాంటి ఆయనకు తెలంగాణ వచ్చాక కొందరు నిలువనీడ లేకుండా చేశారని మండిపడ్డారు. బాపూజీ చనిపోతే మాజీ CM కనీసం చూసేందుకు వెళ్లలేదని ఆరోపించారు. టెక్స్‌టైల్ యూనివర్సిటీకి బాపూజీ పేరు పెట్టామని, ఆసిఫాబాద్ మెడికల్ కాలేజీకీ ఆయన పేరే పెడతామని వెల్లడించారు.

News March 9, 2025

పద్మశాలీల రుణం తీర్చుకుంటా: సీఎం రేవంత్

image

TG: రైతన్నలకు ఇస్తున్న ప్రాధాన్యతను నేతన్నలకు కూడా ఇస్తున్నట్లు సీఎం రేవంత్ తెలిపారు. ఎన్నికల్లో తనను ఆశీర్వదించిన కుటుంబాలకు ఏదైనా చేయాలనే తపనతో ఉన్నానని, పద్మశాలీల రుణం తీర్చుకుంటానని వెల్లడించారు. డ్వాక్రా మహిళలకు రెండు చీరలు ఇవ్వాలని నిర్ణయించామని తెలిపారు. 1.30 కోట్ల చీరలు నేసే ఆర్డర్లను నేతన్నలకే ఇస్తున్నట్లు HYDలో అఖిల భారత పద్మశాలి మహాసభలో సీఎం ప్రకటించారు.

News March 9, 2025

నన్ను ట్రాప్ చేశారు.. బోరున ఏడ్చేసిన నటి!

image

గోల్డ్ స్మగ్లింగ్‌లో <<15692269>>పట్టుబడ్డ<<>> నటి రన్యారావు DRI విచారణలో బోరున విలపించినట్లు తెలుస్తోంది. తాను అమాయకురాలినని, ట్రాప్ చేసి స్మగ్లింగ్‌లో ఇరికించారని చెప్పినట్లు సమాచారం. ‘నేను మెంటల్ ట్రామాలో ఉండిపోయా. ఇందులోకి ఎందుకు వచ్చానో అర్థం కావడంలేదు’ అంటూ తన లాయర్ల వద్ద ఏడ్చేశారు. 17 కేజీల బంగారంతో ఎయిర్‌పోర్టులో పట్టుబడ్డ రన్యా తరచూ దుబాయే కాకుండా US, EU, మిడిల్ ఈస్ట్ వెళ్లి వస్తున్నట్లు గుర్తించారు.

News March 9, 2025

అమెరికాలో హిందూ దేవాలయంపై దుండగుల దాడి

image

అమెరికాలోని సదరన్ కాలిఫోర్నియాలో ఉన్న బాప్స్ స్వామి నారాయణ్ దేవాలయంపై దాడి జరిగింది. దుండగులు గుడి గోడలపై భారత్, మోదీ, హిందూ వ్యతిరేక సందేశాలతో గ్రాఫిటీ స్ప్రే చేశారు. ఆ హిందూద్వేష రాతలపై స్థానిక భారతీయులు ఆందోళన వ్యక్తం చేశారు. కాగా భారత విదేశీ వ్యవహారాల శాఖ ఈ ఘటనను ఖండించింది. అమెరికా సత్వర చర్యల్ని తీసుకోవాలని, నిందితుల్ని గుర్తించాలని కోరింది.

News March 9, 2025

ఇంత తప్పుడు ప్రచారం ఎందుకు?: YCP

image

AP: అమరావతికి నిధుల కేటాయింపుపై వైసీపీ ఆసక్తికర ట్వీట్ చేసింది. ‘అధికారంలోకి రాగానే ఆఘమేఘాల మీద అమరావతి అభివృద్ధికి రూ.6000 కోట్లు కేటాయించారు. ఆ డబ్బు ఎడాపెడా ఖర్చు చేసేసి ఆ తర్వాత అమరావతి స్వయం సమృద్ధి ప్రాజెక్టు అని ఊదరగొట్టారు. ఇప్పుడు ఇదే నిధులు భూస్వాముల పెన్షన్లకు అని కబుర్లు చెబుతున్నారు. ఇంత తప్పుడు ప్రచారం ఎందుకు? ప్రజల కళ్లకు గంతలు కట్టడానికా?’ అని CM చంద్రబాబును YCP ప్రశ్నించింది.

News March 9, 2025

భారత్ గెలుస్తుందా అంటూ గంభీర్ ప్రశ్న.. ఫ్యాన్స్ ఆగ్రహం

image

‘భారత్ ఛాంపియన్స్ ట్రోఫీ గెలుస్తుందా? రోహిత్-కోహ్లీ జోడీ గెలిపిస్తారా?’. ఇవీ టీమ్ ఇండియా హెడ్ కోచ్ గంభీర్ ట్విటర్ ఖాతాలో ప్రత్యక్షమైన ప్రశ్నలు. ఓ బెట్టింగ్ పోర్టల్‌ను ప్రమోట్ చేస్తూ గంభీర్ ఆ ట్వీట్ చేశారు. ఆ ప్రమోషనే తప్పంటే.. హెడ్ కోచ్ అయి ఉండీ భారత్ గెలుస్తుందా అని అడగడమేంటంటూ భారత అభిమానులు ఫైరవుతున్నారు. మరోవైపు.. అది ముందే షెడ్యూల్ అయిన ట్వీట్ అంటూ ఆయన ఫ్యాన్స్ సపోర్ట్‌గా నిలుస్తున్నారు.

News March 9, 2025

INDvNZ: భారత్ బౌలింగ్.. జట్లు ఇవే

image

ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో టాస్ ఓడిన భారత్ తొలుత బౌలింగ్ చేయనుంది. గత మ్యాచులో ఆడిన టీంతోనే బరిలోకి దిగనుంది. NZ పేసర్ హెన్రీ గాయంతో దూరమయ్యారు.
భారత జట్టు: రోహిత్(C), గిల్, కోహ్లీ, అయ్యర్, అక్షర్, రాహుల్, హార్దిక్, జడేజా, షమీ, కుల్‌దీప్, వరుణ్.
న్యూజిలాండ్: యంగ్, రచిన్ రవీంద్ర, విలియమ్సన్, మిచెల్, లాథమ్, ఫిలిప్స్, బ్రాస్‌వెల్, శాంట్నర్ (C), జేమీసన్, విలియమ్, నాథన్ స్మిత్.

News March 9, 2025

FINAL: టాస్ గెలిచిన న్యూజిలాండ్

image

దుబాయ్‌లో జరుగుతున్న ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌లో న్యూజిలాండ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో టీమ్ ఇండియా తొలుత బౌలింగ్ చేయనుంది. భారత్ వరుసగా 15వ సారి టాస్ ఓడటం గమనార్హం.

News March 9, 2025

కొల్లేరు ఆక్రమణలపై సర్వే

image

AP: సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కొల్లేరు సరస్సు ఆక్రమణలపై అటవీశాఖ సర్వే ప్రారంభించింది. గుడివాకలంక నుంచి డ్రోన్ల సహాయంతో ఆక్రమణలను గుర్తిస్తోంది. కొల్లేరు సరస్సులో సహజ నీటి ప్రవాహాన్ని అడ్డుకొని వన్యప్రాణుల మనుగడకు ప్రమాదకరమైన ఆక్రమణలపై ఉక్కుపాదం మోపాలని కోర్టు ఆదేశించింది. దీంతో సరిహద్దులను గుర్తించి అక్షాంశాలు, రేఖాంశాలను అటవీ శాఖ ఖరారు చేయనుంది. ఈ సర్వేపై Dy.CM పవన్ కళ్యాణ్ ఆరా తీస్తున్నారు.

News March 9, 2025

పాకిస్థాన్ ఎందుకు ఓడింది?: రైనా

image

ఛాంపియన్స్ ట్రోఫీలో ఒకే వేదికలో ఆడటం భారత్‌కు కలిసొచ్చిందని పలువురు చేస్తున్న విమర్శలపై భారత మాజీ క్రికెటర్ సురేశ్ రైనా స్పందించారు. ‘పాకిస్థాన్ స్వదేశంలోనే ఆడింది కదా? ఎందుకు గెలవలేకపోయింది. దుబాయ్ భారత్‌కు హోం గ్రౌండ్ కాదు. IND ట్రోఫీ కచ్చితంగా గెలుస్తుంది. భారత జట్టును రోహిత్ శర్మ అద్భుతంగా ముందుకు నడిపిస్తున్నారు. ఇవాళ గిల్ అదరగొడతారు. టాస్ కీలకంగా ఉంటుంది’ అని రైనా విశ్లేషించారు.