India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

SLBC టన్నెల్‌లో 8 మంది కార్మికులు చిక్కుకొని ఇవాళ్టికి 15 రోజులు అవుతోంది. అత్యంత కఠిన పరిస్థితుల మధ్య శతవిధాలా ప్రయత్నిస్తున్నా ఇప్పటివరకు వారి ఆచూకీ లభించలేదు. నిన్నటి నుంచి కేరళకు చెందిన క్యాడవర్ డాగ్స్‌ను రంగంలోకి దించారు. బెల్జియన్ మాలినోస్ జాతికి చెందిన ఈ శునకాలు 15మీటర్ల లోతులో ఉన్న మానవ అవశేషాలను కూడా గుర్తించగలవు. దీంతో అధికారులు ఆశలన్నీ వీటిపైనే పెట్టుకున్నారు.

రేపు న్యూజిలాండ్‌తో జరిగే ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో భారత్ టాస్ గెలవకూడదని మాజీ స్పిన్నర్ అశ్విన్ వ్యాఖ్యానించారు. ‘భారత్ వరసగా 11 మ్యాచుల్లో టాస్ ఓడింది. అయినప్పటికీ చక్కటి ప్రదర్శన కొనసాగిస్తోంది. మొదట బ్యాటింగ్ అయినా బౌలింగ్ అయినా బాగా ఆడుతోంది. రేపు కూడా టాస్ ఓడి న్యూజిలాండ్‌ను ఏది కావాలంటే అది తీసుకోనివ్వాలి. మ్యాచ్‌లో భారత్ గెలిచేందుకు 54శాతం ఛాన్స్ ఉందని భావిస్తున్నా’ అని పేర్కొన్నారు.

హాలీవుడ్ యాక్టర్ జీన్ హ్యాక్‌మన్ భార్య బెట్సీ అర్కావా <<15598233>>మరణానికి<<>> కారణమైన హంటావైరస్‌పై చర్చ జరుగుతోంది. ఇది ఇన్ఫెక్టైన ఎలుకలు స్రవించిన ద్రవాలతో సోకుతుంది. వాటి నుంచి మనిషికి వస్తుందే కానీ అంటువ్యాధి కాదు. అలసట, జ్వరం, కండరాల నొప్పి, దగ్గు, శ్వాస తగ్గడం, లంగ్స్‌లో నీరుచేరడం దీని లక్షణాలు. ప్రతి ముగ్గురు రోగుల్లో ఒకరు బతకడం కష్టం. అందుకే నివాస ప్రాంతాలను శుభ్రంగా ఉంచుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.

అక్షర్ పటేల్ కన్నా ముందు KL రాహుల్ బ్యాటింగ్‌కు రావాలని టీమ్ఇండియా మాజీ కోచ్ అనిల్ కుంబ్లే సూచించారు. టాప్‌ఆర్డర్ కుప్పకూలినా, ఛేజింగ్‌లో అతడు 30+ స్కోర్ చేస్తే జట్టును గెలిపించి తీరుతాడని అన్నారు. ‘రాహుల్‌పై విపరీతంగా ప్రెజర్ ఉంటుంది. బాగా ఆడితే సరి. లేదా ఒక్క ఇన్నింగ్సులో విఫలమైనా ప్రపంచమంతా అతడి వెంటే పడుతుంది. కీపింగ్ చేస్తూనే ఆసీస్ మ్యాచులో తన ప్రతిభేంటో చూపించారు’ అని ప్రశంసించారు.

వృద్ధులను టార్గెట్ చేస్తూ సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. వారి వాట్సాప్ ఖాతాలను హ్యాక్ చేసి కాంటాక్ట్స్‌కు ఆర్థిక సహాయం చేయాలంటూ మెసేజ్‌లు పంపిస్తున్నారు. ఈ ఫ్రాడ్‌ను ఓ నెటిజన్ లేవనెత్తుతూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనకు తెలిసిన వృద్ధుడి అకౌంట్‌ను దుండగులు హ్యాక్ చేసి కాంటాక్ట్స్‌లోని చాలా మంది దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసినట్లు తెలిపారు. దీనికి పరిష్కారం చూపాలని కోరారు.

ఫైనాన్షియల్ ఫ్యూచర్, ఇండిపెండెన్సీపై మహిళల ఆలోచనా తీరు మారింది. వారి పెట్టుబడుల్లో మూడో వంతు పిల్లలు, రిటైర్మెంటుకే కేటాయిస్తున్నారని డేటా చెబుతోంది. ప్రస్తుత FYలో టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకుంటున్న స్త్రీల సంఖ్య 18% పెరిగిందని పాలసీ బజార్ తెలిపింది. ఇందులో వేతన జీవులు 49%, హోమ్‌మేకర్స్ 39% అని పేర్కొంది. యంగర్ విమెన్ ఆర్థిక అంశాల్లో చురుగ్గా ఉంటున్నారని మణిపాల్ సిగ్నా రిపోర్ట్ వెల్లడించింది.

రేపు జరిగే ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌లో న్యూజిలాండ్‌తో ఇండియా తలపడనుంది. ఇప్పటికే గ్రూప్ స్టేజ్‌లో న్యూజిలాండ్‌ను చిత్తు చేసిన భారత్ ఫైనల్‌లోనూ అదే జోరును కొనసాగించి కప్ కొట్టాలనుకుంటోంది. ఇక విజయమెవరిదో తెలియాలంటే మరికొన్ని గంటలు వేచి ఉండాల్సిందే. అయితే, కప్ కోసం ఇరు జట్లను నడిపిస్తున్న రోహిత్, శాంట్నర్ ఈనెల 23 నుంచి ఒకే టీమ్ కోసం ఆడనున్నారు. వీరిద్దరూ ఐపీఎల్‌లో MI జట్టు సభ్యులు కావడం విశేషం.

AP: రాష్ట్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. పథకాలు, ఇతర ప్రయోజనాల కోసం గ్రామ, వార్డు సచివాలయాల హౌస్ హోల్డ్ జాబితా లేదా RTGSలో వివరాల నమోదును తప్పనిసరి చేసింది. ఆయా పథకాల అమలు, వినతుల పరిష్కార సమయంలో ఈ లిస్టులోని వివరాలు సరిపోల్చుకున్నాకే చర్యలు తీసుకుంటామంది. ఈ మేరకు గ్రామ, వార్డు సచివాలయాల కార్యదర్శి కాటమనేని భాస్కర్ ఉత్తర్వులు జారీ చేశారు.

బాలీవుడ్ హీరోయిన్ సోనాక్షి సిన్హా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. వెంకట్ కళ్యాణ్ తెరకెక్కిస్తున్న ‘జటాధర’లో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇవాళ మహిళా దినోత్సవం సందర్భంగా మూవీ నుంచి ఆమె ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ సినిమాలో సుధీర్ బాబు హీరోగా నటిస్తున్నారు. కాగా అనంత పద్మనాభ స్వామి ఆలయ కథాంశంతో హారర్ థ్రిల్లర్‌గా ఈ చిత్రం రూపొందుతున్నట్లు సమాచారం.

రతన్‌టాటా కీర్తికి ఎయిర్ఇండియా మచ్చతెచ్చేలా ఉంది! నిర్వహణపై ఇప్పటికే మంత్రులు, సెలబ్రిటీలు పెదవి విరిచారు. ముందే వీల్‌ఛైర్ బుక్ చేసుకున్నప్పటికీ 80ఏళ్ల వృద్ధురాలికి నిరాశే మిగిలింది. MAR 4న ఢిల్లీ ఎయిర్‌పోర్టులో ఆమె గంటలకొద్దీ నిరీక్షించి బంధువుల సాయంతో నడుస్తూ కిందపడటంతో గాయాలయ్యాయి. అప్పుడు వీల్‌ఛైర్ తెచ్చి BLR ఫ్లయిట్ ఎక్కించారు. ప్రస్తుతం ఆమె ICUలో చికిత్స పొందుతోంది.
Sorry, no posts matched your criteria.