news

News March 8, 2025

మహిళల చేతికి మోదీ SM అకౌంట్స్!

image

మహిళా దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ తన సోషల్ మీడియా అకౌంట్స్‌ను ఈ రోజు మహిళల కోసం కేటాయించారు. దీంతో స్ఫూర్తిదాయకమైన కొందరు మహిళలు తమ అనుభవాలను తెలియజేస్తూ మోదీ అకౌంట్స్ ద్వారా ట్వీట్స్ చేస్తున్నారు. చెస్ ప్లేయర్ వైశాలి దేశం కోసం ఆడేందుకు కుటుంబం ఎంతలా సపోర్ట్ చేసిందో తెలిపారు. సైంటిస్టులు ఎలినా మిశ్రా, శిల్పి సోని, బిజినెస్ ఉమెన్ అజైతా షా, సామాజికవేత్త అంజలీ అగర్వాల్ ట్వీట్స్ చేశారు.

News March 8, 2025

12న వైసీపీ ‘యువత పోరు’

image

AP: విద్యార్థులకు వెంటనే ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేయాలనే డిమాండ్‌తో వైసీపీ ఈ నెల 12న ఆందోళన చేయనుంది. ఈ నేపథ్యంలో ‘యువత పోరు’ పోస్టర్‌ను ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి ఆవిష్కరించారు. ఆ రోజున అన్ని జిల్లాల కలెక్టరేట్ల వద్ద విద్యార్థులతో కలసి నిరసనలు చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

News March 8, 2025

డిగ్రీ అర్హత.. 650 బ్యాంకు ఉద్యోగాలు

image

IDBI బ్యాంకులో 650 జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకు ఈ నెల 12 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. డిగ్రీ పాసై, 20-25 ఏళ్ల మధ్య వయసున్న వారు అర్హులు. రిజర్వేషన్ బట్టి సడలింపు ఉంటుంది. ఆన్‌లైన్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఏప్రిల్ 6న పరీక్ష ఉంటుంది. దరఖాస్తు ఫీజు SC, ST, PWD అభ్యర్థులకు రూ.250, మిగతా వారికి రూ.1,050.
వెబ్‌సైట్: https://www.idbibank.in/

News March 8, 2025

నేను స్త్రీని.. ఇది నా జీవితం (1/3)

image

నమస్తే.. నేను స్త్రీని. రోజూ మీ ఇంట్లో, మీ చుట్టుపక్కల, ఆఫీసుల్లో నవ్వుతూ తిరిగే మనిషిని. నవ్వే ఆ పెదవుల మాటున నేను బిగబట్టే ఎన్నో బాధల్ని ఈరోజు మీతో చెప్పుకోవాలనుకుంటున్నాను. నేను పుట్టిన వెంటనే మొదట వినపడేది ఓ నిస్పృహ. ఆడపిల్లా అంటూ. ఎదుగుతున్నాను. చిన్నపిల్లనే అయినా అనేక ఆకలి కళ్ల నుంచి తప్పించుకోవాలి. చీకటి పడ్డాక గడప దాటాలంటే మరొకరి సాయం ఉండాలి. నిర్మానుష్య ప్రాంతాల్లో పగలైనా సరే భయపడాలి.

News March 8, 2025

నేను స్త్రీని.. ఇది నా జీవితం (2/3)

image

నెలసరి మొదలైతే ప్రపంచం మరింత మారిపోతుంది. ప్రతి నెలా ఐదు రోజుల నరకం. బస్సుల్లో, రైళ్లలో, ఆఫీసుల్లో జుగుప్సాకరమైన చేతలు, చూపులు, చేతుల నుంచి జాగ్రత్త పడుతుండాలి. ఇన్నేళ్లూ కళ్లల్లో పెట్టుకుని పెంచుకొచ్చిన కన్నవారిని పెళ్లి తర్వాత వదిలేయాలి. మునుపెన్నడూ పరిచయం లేని కొత్త వ్యక్తితో కొత్త చోటికి వెళ్లి కొత్త మనుషులతో కలిసి బతకాలి. భర్త మంచివాడైతే అదృష్టమే. లేదంటే అతడితో నా మిగతా జీవితమంతా సర్దుబాటే.

News March 8, 2025

నేను స్త్రీని.. ఇది నా జీవితం (3/3)

image

గర్భం దాల్చాక శారీరక, మానసిక మార్పుల బాధ అంతాఇంతా కాదు. కడుపును కత్తులు కోస్తున్నట్లు నొప్పి ఉన్నా భరిస్తాను. బిడ్డకు జన్మనిచ్చి మురిసిపోతాను. భర్త, బిడ్డలే సర్వస్వమని బతుకుతాను. 40వ పడి దాటాక మెనోపాజ్‌తో మరో నరకం. ఆ సమయంలో భావోద్వేగాల ఊగిసలాట చెప్పనలవి కాదు. మీనుంచి కోరేది ఒకటే. నన్ను నెత్తిన పెట్టుకోనక్కర్లేదు. దయచేసి చులకనగా, ఓ వస్తువులా, తక్కువగా చూడొద్దు. తోటి మనిషిగా గుర్తించండి. అదే చాలు.

News March 8, 2025

రచ్చ గెలిచి ఇంట ఓడిపోతున్న ఒంగోలు గిత్త!

image

భారత్‌కు గర్వకారణమైన ఒంగోలు గిత్త రచ్చ గెలిచి ఇంట ఓడిపోతోంది. తక్కువ తినడం, రోగాలు, అధిక వేడిని తట్టుకొనే సత్తువ వీటి సొంతం. అందుకే బ్రెజిల్లో ఒంగోలు గిత్త Viatina-19 బ్రీడు మొన్న ఏకంగా రూ.40లక్షల ధర పలికింది. ఇక్కడ రూ.లక్షకే లభించే వీటిని రైతన్నలు నిర్లక్ష్యం చేస్తున్నారు. అధిక పాల దిగుబడి కోసం సంకర జాతికే ఓటేస్తున్నారు. దాంతో 1944లో 15లక్షలున్న గిత్తలు 2019లో 6.34లక్షలకు తగ్గాయి. మీ కామెంట్.

News March 8, 2025

బీఎడ్ ప్రశ్నాపత్రం లీక్.. ముగ్గురు అరెస్ట్

image

AP: గుంటూరు ANUలో బీఎడ్ ప్రశ్నాపత్రం <<15680685>>లీకేజీ<<>> ఘటనలో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. వీళ్లు ఒడిశాకు చెందిన ఏజెంట్లని, ఆ రాష్ట్ర విద్యార్థులకు ఏపీలోని కాలేజీల్లో అడ్మిషన్లు ఇప్పిస్తుంటారని తెలిపారు. అలాగే పాస్ చేయించేందుకు క్వశ్చన్ పేపర్లను లీక్ చేస్తుంటారని గుర్తించారు. ఇందుకోసం పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. విచారణ తర్వాత మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తాయంటున్నారు.

News March 8, 2025

‘ఛావా’కు తొలి రోజు రూ.3 కోట్లు!

image

బాలీవుడ్‌‌లో దాదాపు రూ.480 కోట్లు కలెక్ట్ చేసిన ‘ఛావా’ మూవీ నిన్న తెలుగులో రిలీజవగా మిక్స్‌డ్ టాక్ వస్తోంది. డబ్బింగ్ ఏమాత్రం బాగాలేదని పలువురు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. తెలుగు నేటివిటీకి తగ్గట్లు డైలాగులపై ఫోకస్ చేయాల్సిందంటున్నారు. గీతా ఆర్ట్స్ పెద్ద ఎత్తున విడుదల చేసినా తొలి రోజు కేవలం రూ.3కోట్ల గ్రాస్ వచ్చినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

News March 8, 2025

దారుణం: మహిళా టీచర్ల ఫొటోలను తీసి..

image

TG: విద్యాబుద్ధులు నేర్పే మహిళా టీచర్ల పట్ల కొందరు విద్యార్థులు అనుచితంగా ప్రవర్తిస్తున్నారు. తాజాగా మహబూబాబాద్(D) తొర్రూరులోని ZP హైస్కూల్‌లో పాఠాలు చెబుతున్న సమయంలో వెనుక నుంచి ఫొటోలు తీశారు. బెంచ్‌లో కూర్చుని ప్రశ్నలకు సమాధానాలిస్తుండగా అసభ్యకరంగా ఫొటోలు తీసి ఇన్‌స్టాలో పోస్టు చేసినట్లు సమాచారం. ఓ విద్యార్థిని గమనించి HMకు ఫిర్యాదు చేయగా, విషయం బయటికి రాకుండా చూసినట్లు తెలుస్తోంది.