news

News March 8, 2025

అప్పుడు రయ్ రయ్.. ఇప్పుడు నై నై అంటే ఎలా చంద్రబాబు?: YCP

image

AP: జిల్లా పరిధిలోనే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణమంటూ చంద్రబాబు గతంలోనే చెప్పారంటూ టీడీపీ చేసిన పోస్టుకు వైసీపీ కౌంటరిచ్చింది. ఎన్నికల ముందు ఆయన మరో <>ప్రసంగ వీడియోను<<>>, జనసేన యాడ్‌ను, మేనిఫెస్టోను షేర్ చేసింది. ‘ఎన్నికల ముందు రయ్ రయ్.. గెలిచాక నై నై అంటే ఎలా చంద్రబాబు? RTC బస్సు ఎక్కి ఎక్కడికైనా వెళ్లండి.. టికెట్ డబ్బు అడిగితే నా పేరు చెప్పండి అని నువ్వు చెప్పింది నిజం కాదా?’ అని ప్రశ్నించింది.

News March 8, 2025

169 ఎకరాల్లో సోలార్ సెల్ ప్లాంట్

image

AP: తిరుపతి(D) నాయుడుపేటలో సోలార్ సెల్ ప్లాంట్ ఏర్పాటు చేయనున్నట్లు ప్రీమియర్ ఎనర్జీస్ వెల్లడించింది. 169 ఎకరాల్లో రూ.1700 కోట్లతో 4 గిగా వాట్ల సామర్థ్యంతో దీనిని ఏర్పాటు చేస్తున్నామంది. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వంపై ఒప్పందం చేసుకున్నట్లు తెలిపింది. ముడి సరుకుల దిగుమతికి సమీపంలోనే పోర్టు ఉండటంతో నాయుడుపేటను ఎంచుకున్నట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు. 2026 జూన్‌లో ప్రొడక్షన్ ప్రారంభం అవుతుందన్నారు.

News March 8, 2025

ఇవాళ ఇంటర్ పరీక్షకు ఎంపిక చేసిన సెట్ ఇదే

image

AP: రాష్ట్రంలో ఇంటర్ పరీక్షలు కొనసాగుతున్నాయి. ఇవాళ జరిగే ఫస్టియర్ మ్యాథ్స్ 1B ఎగ్జామ్‌కు సెట్-3 ప్రశ్నపత్రాన్ని విద్యాశాఖ ఎంపిక చేసింది. ఈ నెల 20 వరకు పరీక్షలు జరుగుతాయి.
* విద్యార్థులందరికీ ALL THE BEST

News March 8, 2025

ఉద్యోగం ఇప్పిస్తామంటే నమ్మొద్దు:TGPSC

image

TG: అన్ని పరీక్షలనూ పారదర్శకంగా నిర్వహించామని TGPSC స్పష్టం చేసింది. ప్రతిభావంతులను ఎంపిక చేసేందుకు కసరత్తు చేస్తున్నామంది. ఈ విషయంలో తప్పుడు ప్రచారం చేస్తున్నవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపింది. ఉద్యోగాలు ఇప్పిస్తామని ఎవరైనా చెప్తే నమ్మవద్దని, 9966700339 నంబర్‌కు ఫిర్యాదు చేయాలని అభ్యర్థులకు సూచించింది. కాగా ఈ నెల 10, 11, 14 తేదీల్లో గ్రూప్-1,2,3 <<15683630>>ఫలితాలు<<>> వెల్లడికానున్నాయి.

News March 8, 2025

అసెంబ్లీకి వస్తా.. కాంగ్రెస్ అంతు చూస్తా: కేసీఆర్

image

TG: రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వంతో విసిగిపోయారని మాజీ సీఎం KCR అన్నారు. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో తాను ప్రభుత్వ తీరును ఎండగడతానని చెప్పారు. ‘కాంగ్రెస్ సర్కార్ అసత్య ప్రచారాలతో కాలం వెళ్లదీస్తోంది. కాంగ్రెస్ నిజస్వరూపాన్ని ప్రజలు ఇప్పుడు తెలుసుకున్నారు. రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా BRSదే అధికారం. వచ్చే నెల 27న వరంగల్‌లో జరిగే సభలో కాంగ్రెస్, బీజేపీని నిలదీస్తాం’ అని పేర్కొన్నారు.

News March 8, 2025

వచ్చే నెల 7 నుంచి ఎన్టీఆర్ వైద్య సేవలు బంద్

image

AP: వచ్చే నెల 7 నుంచి రాష్ట్రంలోని అన్ని నెట్‌వర్క్ ఆస్పత్రుల్లో NTR వైద్య సేవలను నిలిపేస్తున్నట్లు ఆస్పత్రుల సంఘం తెలిపింది. ప్రభుత్వం నుంచి రూ.3,500 కోట్ల బకాయిలు రావాలని, దీంతో ఆస్పత్రుల నిర్వహణ చేయలేకపోతున్నామని వెల్లడించింది. ఇప్పటికే ప్రభుత్వంతో పలుమార్లు చర్చించినా ఫలితం లేకుండా పోయిందని పేర్కొంది. ఇప్పటివరకు తమ సామర్థ్యానికి మించి సేవలు అందించామని, ఇకపై కొనసాగించలేమని నోటీసులు పంపింది.

News March 8, 2025

‘నేను.. శైలజ’ దర్శకుడితో రవితేజ మూవీ?

image

మాస్ మహారాజా మరో మూవీకి సిద్ధమైనట్లు తెలుస్తోంది. ‘నేను.. శైలజ’, ‘చిత్రలహరి’ సినిమాల దర్శకుడు కిశోర్ తిరుమల తెరకెక్కించనున్న ఓ మూవీలో రవితేజ నటించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. యాక్షన్ స్టోరీతో తెరకెక్కే ఈ చిత్రాన్ని చెరుకూరి సుధాకర్ నిర్మించనున్నట్లు టాక్. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతోందని, ఏప్రిల్ లేదా మేలో ఈ మూవీ సెట్స్‌పైకి వెళ్తుందని సమాచారం.

News March 8, 2025

పోరాడదాం రండి.. నేడు అన్ని పార్టీల ఎంపీలతో సీఎం భేటీ

image

TG: రాష్ట్రానికి పెండింగ్ ప్రాజెక్టులను సాధించడమే లక్ష్యంగా ఇవాళ అన్ని పార్టీల ఎంపీలతో సీఎం రేవంత్ సమావేశం కానున్నారు. ఇప్పటికే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, సంజయ్‌తోపాటు లోక్‌సభ ఎంపీలకు ఫోన్ చేసి ఆహ్వానించారు. రాష్ట్ర రుణ భారం తగ్గించుకోవడం, కేంద్రం నుంచి పన్నుల వాటా పెంపు, గ్రాంట్ ఇన్ ఎయిడ్‌పై చర్చించనున్నారు. కేంద్రంపై ఒత్తిడి తెచ్చేలా కార్యాచరణను రూపొందిస్తారు.

News March 8, 2025

ఇవాళ స్కూళ్లకు సెలవు

image

AP: రాష్ట్రంలోని ప్రకాశం, సత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో ఇవాళ సెలవు ఇస్తున్నట్లు ఆయా జిల్లాల DEOలు ప్రకటించారు. కాగా ఇటీవల వరదల కారణంగా ఆయా జిల్లాల్లోని పాఠశాలలకు వరుసగా సెలవులు ఇచ్చారు. ఇందుకు ప్రత్యామ్నాయంగా ఇవాళ తరగతులు నిర్వహిస్తామని గతంలో ప్రకటించారు. కానీ మహిళా దినోత్సవం నేపథ్యంలో వర్కింగ్ డేను రద్దు చేసి సెలవు ఇచ్చారు. ప్రత్యామ్నాయంగా మరో రోజు క్లాసులు నిర్వహిస్తారు.

News March 8, 2025

25న గోదావరి బోర్డు భేటీ.. ‘బనకచర్ల’పై చర్చ

image

ఈ నెల 25న తెలుగు రాష్ట్రాల అధికారులతో గోదావరి బోర్డు సమావేశం జరగనుంది. గోదావరి పరీవాహకంలోని 16 ప్రాజెక్టుల నిర్వహణ బాధ్యతలను తమకు అప్పగించాలని AP, TGలను బోర్డు కోరనుంది. అలాగే వివాదాస్పదమైన గోదావరి-బనకచర్ల ప్రాజెక్టుపై చర్చ జరగనుంది. ఏపీకి చెందిన 4, తెలంగాణకు చెందిన 11 ప్రాజెక్టుల అనుమతులపైనా వివరాలు సేకరించనుంది.