news

News March 7, 2025

విద్యా, ఉద్యోగ రంగాల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు: క్యాబినెట్

image

TG: బలహీన వర్గాలకు స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించడానికి ఉద్దేశించిన ముసాయిదా బిల్లుకు రాష్ట్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. అలాగే విద్యా, ఉద్యోగ రంగాల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని తీర్మానించింది. వచ్చే శాసనసభ సమావేశాల్లో ఇందుకు సంబంధించిన బిల్లును ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. అలాగే ఎస్సీ వర్గీకరణపై కూడా అసెంబ్లీలో బిల్లును ప్రవేశపెట్టాలని తీర్మానించింది.

News March 7, 2025

ఎమ్మెల్యే కోటా MLC అశావహులు వీరేనా?

image

TG: MLA కోటా MLC సీటు దక్కించుకునేందుకు పలువురు కాంగ్రెస్ నేతలు తీవ్రంగా పోటీ పడుతున్నారు. దీంతో పలువురు ఆశావహులు ఢిల్లీలో చక్కర్లు కొడుతున్నారు. సంపత్ కుమార్ (SC), కుసుమ కుమార్ (కమ్మ), VH, కొనగాల మహేశ్ (మున్నూరు కాపు), చరణ్ కౌశిక్ (యాదవ), శంకర్ నాయక్, విజయభాయి (ST), అద్దంకి దయాకర్ (మాల), ఫహీం ఖురేషి, ఫిరోజ్ ఖాన్ (మైనార్టీ), సామ రామ్మోహన్ (రెడ్డి), విజయశాంతి తదితరులు సీటు ఆశిస్తున్నట్లు సమాచారం.

News March 7, 2025

మహిళలకు వేతనంతో కూడిన నెలసరి సెలవు: L&T

image

మహిళా ఉద్యోగులకు ఎల్ అండ్ టీ శుభవార్త చెప్పింది. వారికి వేతనంతో కూడిన నెలసరి సెలవు(ఏడాదికి 12) ఇవ్వనున్నట్లు ప్రకటించింది. రేపు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. సెలవును ఎలా అమలు చేస్తామనేది త్వరలోనే ప్రకటిస్తామని పేర్కొంది. ఈ నిర్ణయంతో దాదాపు 5వేల మందికి లబ్ధి చేకూరుతుంది. దేశంలో ఇలాంటి సెలవును ప్రకటించడం ఇంజినీరింగ్& కన్‌స్ట్రక్షన్ ఇండస్ట్రీలో ఇదే తొలిసారి.

News March 7, 2025

ఉచిత బస్సు ప్రయాణం జిల్లాల వరకే: మంత్రి సంధ్యారాణి

image

AP: మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం జిల్లాల వరకే పరిమితమని మంత్రి గుమ్మడి సంధ్యారాణి మండలిలో తెలిపారు. ఉచిత బస్సు పథకం కోసం మహిళలు ఎదురుచూస్తున్నారని YCP సభ్యుడు PV సూర్యనారాయణరాజు అన్నారు. దీనిపై మంత్రి స్పందిస్తూ.. ఏ జిల్లాల్లోని మహిళలకు, ఆ జిల్లాల్లోనే RTC ఉచిత ప్రయాణానికి అనుమతించాలని నిర్ణయించామన్నారు. TG, కర్ణాటకలో RTC ఉచిత ప్రయాణం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న విషయం తెలిసిందే.

News March 7, 2025

సూసైడ్ చేసుకున్న రైతుల కుటుంబాలకు రూ.7లక్షలు: అచ్చెన్న

image

APలో గత ఏడాది జూన్ నుంచి ఇప్పటి వరకు 39 మంది అన్నదాతలు/కౌలు రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. వీరి కుటుంబాలకు త్వరలో రూ.7 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందజేస్తామని ప్రకటించారు. 2024 జూన్‌కు ముందు 103 మంది రైతులు సూసైడ్ చేసుకున్నారని చెప్పారు. వీరిలో 49 కుటుంబాలకు రూ.3.43 కోట్లు విడుదల చేశామన్నారు. మరో 32 కేసులకు రూ.2.24 కోట్లను త్వరలో రిలీజ్ చేస్తామని పేర్కొన్నారు.

News March 7, 2025

‘శ్రీశైలం’ దిగువన గొయ్యి ప్రమాదకరం.. పూడ్చేయండి: NDSA

image

శ్రీశైలం ప్రాజెక్టు దిగువన ఏర్పడిన గొయ్యి(ప్లంజ్ పూల్)ని మే నెలాఖరులోపు పూడ్చేయాలని తెలుగు రాష్ట్రాలకు NDSA సూచించింది. డ్యాం పునాది 380 అడుగులు ఉంటే ఈ గొయ్యి 410 అడుగుల వరకు ఉందని తెలిపింది. కృష్ణా నదికి ఏటా వస్తున్న వరదలతో ప్లంజ్ పూల్ ప్రాజెక్టుకు ప్రమాదకరంగా మారుతోందని తెలిపింది. సముద్ర తీరం కోతకు గురికాకుండా వినియోగించే టెట్రా పాట్స్‌తో చర్యలు చేపట్టవచ్చని అధికారులు అభిప్రాయపడ్డారు.

News March 7, 2025

నేడు అందుబాటులోకి టెన్త్ హాల్ టికెట్లు

image

TG: పదో తరగతి పరీక్షల హాల్ టికెట్లను అధికారులు ఇవాళ వెబ్‌సైటులో అందుబాటులోకి తీసుకురానున్నారు. https://bse.telangana.gov.in సైట్‌లో విద్యార్థులు లాగిన్ అయి హాల్ టికెట్లు పొందవచ్చని తెలిపారు. ఈ నెల 21 నుంచి వచ్చే నెల 4 వరకు పదో తరగతి పరీక్షలు జరగనున్నాయి. దాదాపు ఐదున్నర లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నట్లు తెలుస్తోంది.

News March 7, 2025

16 ఏళ్లు కలిసుండి రేప్ అంటే ఎలా?: సుప్రీం

image

16 ఏళ్లపాటు రిలేషన్‌లో ఉండి ఇప్పుడు రేప్ కేసు పెడితే ఎలా అని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని ఓ మహిళ కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా ధర్మాసనం విచారించింది. ‘16 ఏళ్లపాటు లైంగికదాడి భరించిందంటే నమ్మశక్యంగా లేదు. పరస్పర సమ్మతితోనే శారీరక సంబంధం కొనసాగినట్లు ఉంది. ఇన్నేళ్లలో ఒక్కసారి కూడా అతడిపై అనుమానం రాలేదా. ఇందులో అత్యాచారం కోణం లేనే లేదు’ అని తీర్పునిచ్చింది.

News March 7, 2025

‘రాబిన్‌హుడ్’లో వార్నర్.. రెమ్యునరేషన్ ఎంతంటే?

image

నితిన్ హీరోగా తెరకెక్కుతున్న ‘రాబిన్‌హుడ్’ మూవీలో ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ డేవిడ్ వార్నర్ నటించారు. ఈ సినిమాలో నటించినందుకు ఆయన ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నారని అందరూ ఆరా తీస్తున్నారు. కానీ ఈ చిత్రంలో నటించినందుకు వార్నర్ ఎలాంటి పారితోషికం డిమాండ్ చేయలేదట. నిర్మాతలే రెమ్యునరేషన్‌గా రూ.50 లక్షలు అందించారని సమాచారం. ఆయన క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకుని చిన్న పాత్ర అయినా భారీ పారితోషికం ఇచ్చారట.

News March 7, 2025

నీట్-UG దరఖాస్తుకు నేడే లాస్ట్

image

2025-26 విద్యాసంవత్సరానికి గాను MBBS, BDS, ఇతర వైద్య కోర్సుల్లో ప్రవేశాలకు నీట్-UG దరఖాస్తు గడువు నేటితో ముగియనుంది. ఈ నెల 9 నుంచి 11వ తేదీ వరకు దరఖాస్తుల్లో సవరణలకు అవకాశం ఉంటుంది. మే 4న దేశవ్యాప్తంగా మ.2 గంటల నుంచి సా.5 వరకు ఆఫ్‌లైన్ విధానంలో పరీక్ష నిర్వహిస్తారు.
వెబ్‌సైట్: https://examinationservices.nic.in/