news

News March 6, 2025

ఉత్తర తెలంగాణలో బీజేపీ హవా

image

ఉత్తర తెలంగాణలో బీజేపీ పట్టు నిలుపుకుంది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 4, నిజామాబాద్ జిల్లాలో 3 సీట్లు గెలిచింది. 2024 ఎంపీ ఎన్నికల్లో ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మెదక్ సొంతం చేసుకుంది. తాజాగా ఆదిలాబాద్-నిజామాబాద్-కరీంనగర్-మెదక్ గ్రాడ్యుయేట్, టీచర్ ఎమ్మెల్సీ స్థానాలు సైతం తన ఖాతాలో వేసుకుంది. దీన్ని బట్టి చూస్తే ఉత్తర తెలంగాణలో బీజేపీ హవా స్పష్టంగా కనిపిస్తోంది.

News March 6, 2025

సీఎం ప్రచారం చేసినా దక్కని విజయం!

image

TG: KNR-MDK-NZB-ADB ఎమ్మెల్సీ ఎన్నికలో కాంగ్రెస్ ఓడిపోవడం ఆ పార్టీకి బిగ్ షాక్ అని చెప్పవచ్చు. పార్టీ అధికారంలో ఉన్నా, సీఎం రేవంత్ ప్రచారం నిర్వహించినా సిట్టింగ్ స్థానంలో గెలవకపోవడంతో ఈ జిల్లాల్లో కాంగ్రెస్ హవా తగ్గిందా అనే చర్చ మొదలైంది. ఈ ఎన్నికలో గెలిచినా, ఓడినా తమకు పోయేదేం లేదని స్వయంగా రేవంత్ వ్యాఖ్యానించడమూ ఆ పార్టీ ఓటమికి కారణమైందని పలువురు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

News March 5, 2025

సౌతాఫ్రికా ఓటమి.. ఫైనల్‌లో కివీస్‌తో భారత్ పోరు

image

భారత్‌తో CT ఫైనల్ ఆడే జట్టేదో తేలిపోయింది. మిల్లర్ సెంచరీతో అద్భుత పోరాటం చేసినా సెమీ‌ఫైనల్-2లో NZ చేతిలో SA 50పరుగుల తేడాతో ఓడిపోయింది. దీంతో ఈ నెల 9న CT ఫైనల్‌లో భారత్, న్యూజిలాండ్ తలపడనున్నాయి. కివీస్ నిర్దేశించిన 363 రన్స్ లక్ష్యంతో బరిలోకి దిగిన SA ఒత్తిడిని జయించలేక వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయింది. చివర్లో మిల్లర్(100) 4 సిక్సులు, 10 ఫోర్లతో విధ్వంసం సృష్టించినా ఫలితం లేకపోయింది.

News March 5, 2025

విద్యార్థులు ఇలా చేస్తే పరీక్షలు ఈజీగా రాయొచ్చు!

image

☛ ఎగ్జామ్ టైమ్‌లో క్వశ్చన్ పేపర్ మొత్తం చదివి, ముందుగా తెల్సినవి రాయాలి. ఇలా చేస్తే టైమ్ వేస్ట్ అవ్వదు.
☛ పరీక్షలకు ముందు చదవడంతో పాటు రాయడం ప్రాక్టీస్ చేయాలి.
☛ క్లాస్‌లు జరుగుతున్నప్పుడు రన్నింగ్ నోట్స్ రాసుకోవాలి. ఫాస్ట్‌గా రాయడం అలవాటౌతుంది.
☛ ఓల్డ్ క్వశ్చన్ పేపర్లను ప్రాక్టీస్ చేయడంతో పాటు ప్రీ ఫైనల్స్ రాయాలి. దీని వల్ల టైమ్ మేనేజ్‌మెంట్ అలవడుతుంది.

News March 5, 2025

సంప్రదాయమేనా? సర్‌ప్రైజ్ ఉంటుందా?

image

TG: కాంగ్రెస్‌లో MLA కోటా MLC పదవులకు రెడ్డి సామాజికవర్గం నుంచి ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి, సిట్టింగ్ MLC జీవన్ రెడ్డి పేర్లు విన్పిస్తున్నాయి. One Leader One Post నిర్ణయంతో నరేందర్‌ను, ఇప్పటికే చాలా ఛాన్సులు పొందారని జీవన్‌ను రెడ్డి నేతలు వ్యతిరేకిస్తున్నారు. సీనియార్టీ సంప్రదాయాన్ని కాదని OLOPతో పాటు యువరక్తంపై మొగ్గు చూపితే సామ రామ్మోహన్ రెడ్డి వంటి వారికీ సర్‌ప్రైజ్ ఛాన్స్ రావచ్చు.

News March 5, 2025

రాజధానిపై జగన్ వ్యాఖ్యలు వింతగా ఉన్నాయి: మంత్రి నారాయణ

image

AP: రాజధాని అమరావతి నిర్మాణంలో ప్రజలపై భారం ఉండదని, YCP నేతల మాటలు నమ్మొద్దని మంత్రి నారాయణ స్పష్టం చేశారు. రాజధానిపై మాజీ CM జగన్ వ్యాఖ్యలు వింతగా ఉన్నాయన్నారు. రూ.63వేల కోట్లతో రాజధాని నిర్మాణం చేపట్టనున్నట్లు, బడ్జెట్‌లో రూ.6వేల కోట్లు కేటాయించినట్లు తెలిపారు. 1200 ఎకరాలు వివిధ సంస్థలకు కేటాయిస్తున్నట్లు చెప్పారు. ప్రపంచంలోని అత్యుత్తమ 5నగరాల్లో అమరావతిని ఒకటిగా తీర్చుదిద్దుతామన్నారు.

News March 5, 2025

‘దేవర’ పార్ట్-2 షూటింగ్ ఎప్పుడంటే ?

image

‘దేవర’ పార్ట్-2 షూటింగ్ ఈ ఏడాది చివర్లో లేదా 2026 ప్రారంభంలో మొదలయ్యే అవకాశాలున్నట్లు సినీ వర్గాలు తెలిపాయి. మే/జూన్ వరకు స్క్రిప్ట్ వర్క్‌ను పూర్తి చేసి, ఆ తర్వాత ప్రీ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ చేయాలని డైరెక్టర్ కొరటాల శివ భావిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం NTR ‘వార్-2’ షూటింగ్‌ను దాదాపుగా పూర్తి చేశారు. త్వరలో ప్రశాంత్ నీల్ సినిమా సెట్స్‌లో జాయిన్ కానున్నారు. ఆ తర్వాతే ‘దేవర-2’ షూట్ ఉండనుంది.

News March 5, 2025

పౌష్టికాహారం దొరికే చౌకైన ఆహార పదార్థాలు!

image

తక్కువ ధరకే దొరికే పౌష్టిక ఆహార పదార్థాలను ప్రముఖ న్యూట్రీషియన్ సునీత సూచించారు. ‘గుడ్లు, పాలు, ఇంట్లో తయారు చేసిన పెరుగు, వేరుశెనగ, నువ్వులు, కాల్చిన శనగలు, తాజా కొబ్బరి, మొలకలు తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. వైట్ రైస్& గోధుమలు కాకుండా రాగి, జొన్న వంటి మిల్లెట్స్‌ను తినడం మంచిది. ఆకు కూరలు ముఖ్యంగా మునగ ఆకు, మెంతిని ఇంట్లోనే పండించుకోవచ్చు. సీజనల్ ఫ్రూట్ తినడం బెస్ట్’ అని తెలిపారు.

News March 5, 2025

అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు షాక్

image

అమెరికా సుప్రీంకోర్టులో ఆ దేశ అధ్యక్షుడు ట్రంప్‌కు షాక్ తగిలింది. విదేశాలకు ఆర్థిక సాయం నిలిపివేయాలన్న ట్రంప్ సర్కార్ అభ్యర్థనను కోర్టు తిరస్కరించింది. అయితే ఆ డబ్బును ఎప్పుడు విదేశాలకు రిలీజ్ చేయాలనే దానిపై న్యాయస్థానం స్పష్టత ఇవ్వలేదు. ఈ తీర్పుపై వైట్ హౌస్ దిగువ కోర్టుల్లో ఛాలెంజ్ చేసే అవకాశం ఉంది.

News March 5, 2025

అతి త్వరలోనే గ్రూప్-1 ఫలితాలు: TGPSC

image

గ్రూప్-1 పరీక్ష ఫలితాలను అతి త్వరలోనే వెల్లడిస్తామని TGPSC ప్రకటించింది. నియామక ప్రక్రియ పారదర్శకంగా, ఎలాంటి తప్పులు లేకుండా జరుగుతోందని స్పష్టం చేసింది. గ్రూప్-1 పోస్టులపై కొంత మంది సోషల్ మీడియాలో తప్పుడు వార్తలను పోస్ట్ చేస్తున్నారని, వారిపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపింది. తప్పుడు ప్రచారాన్ని నమ్మవద్దని అభ్యర్థులకు సూచించింది. మార్కుల జాబితాను త్వరలోనే వెబ్‌సైట్‌లో ఉంచుతామని పేర్కొంది.