news

News March 5, 2025

జమ్మూ అందాలు చూడండి!

image

సమ్మర్ వచ్చేసింది. వెకేషన్‌కు ఎక్కడికి వెళ్లాలో ప్లాన్ చేస్తున్నారా? అలాంటి వారికి జమ్మూకశ్మీర్ టూరిజం వెల్కమ్ చెప్తోంది. దేశంలో ఓవైపు ఎండలు మండుతుండగా కశ్మీర్ మాత్రం భూతల స్వర్గంలా కనిపిస్తోంది. ఎటు చూసినా పచ్చదనం, పొగ మంచుతో కూడిన వాతావరణం ఆహ్లాదాన్ని పంచుతోంది. దీనికి సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరలవుతున్నాయి. సమ్మర్ వెకేషన్‌కు ఎక్కడికి వెళ్తున్నారో కామెంట్ చేయండి.

News March 5, 2025

అందుకే చనిపోవాలనుకున్నా: సింగర్ కల్పన

image

నిద్రమాత్రలు మింగి <<15655341>>ఆత్మహత్యాయత్నం<<>> చేసిన ప్రముఖ సింగర్ కల్పన కోలుకుంటున్నారు. ఇవాళ ఆమె స్టేట్‌మెంట్‌ను పోలీసులు రికార్డు చేశారు. ‘కేరళలో ఉన్న పెద్ద కూతురిని చదువుకోవడానికి హైదరాబాద్ రావాలని కోరా. అయితే ఆమె అక్కడే ఉంటానని చెప్పింది. ఆవేదనతో నిద్ర మాత్రలు మింగి చనిపోవాలనుకున్నా’ అని తెలిపారు. కాగా కల్పన ఊపిరితిత్తుల్లో నీళ్లు చేరడంతో ఇన్ఫెక్షన్ అయిందని వైద్యులు తెలిపారు.

News March 5, 2025

Volkswagen నుంచి చౌకైన SUV!

image

జర్మన్ కార్ల దిగ్గజం ‘ఫోక్స్ వాగన్’ నుంచి సరికొత్త చౌకైన SUV లాంచ్ అయింది. బ్రెజిలియన్ మార్కెట్లో ‘TERA’ మోడల్ SUVని కంపెనీ ఆవిష్కరించింది. అయితే, ఇండియాలో లాంచ్ చేయడంపై కంపెనీ ఇంకా ప్రకటన చేయలేదు. 1.0లీటర్ ఇంజిన్‌తో తయారైన ఈ SUV.. 118bhp & 178Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. అయితే, ఇదే ఇంజిన్‌తో మార్కెట్‌లోకి వచ్చిన Kylaq విజయంపైనే TERA భవిష్యత్తు ఆధారపడి ఉంది. 2027లో మార్కెట్‌లోకి రావొచ్చు.

News March 5, 2025

సీఎంను కలిసిన మీనాక్షి నటరాజన్

image

TG: సీఎం రేవంత్ రెడ్డితో రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్ భేటీ అయ్యారు. జూబ్లీహిల్స్‌లోని సీఎం నివాసంలో గంటకు పైగా జరిగిన ఈ సమావేశంలో MLA కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై చర్చించారు. అలాగే నామినేటెడ్ పదవులు, బీసీలకు 42శాతం రిజర్వేషన్ అంశం కూడా చర్చకు వచ్చింది. ఈ సమావేశంలో పీసీసీ చీఫ్, మంత్రులు భట్టి, ఉత్తమ్ కూడా పాల్గొన్నారు. అటు CM రేవంత్ ఎల్లుండి ఢిల్లీ వెళ్లనున్నారు.

News March 5, 2025

హింసాత్మక సినిమా.. టీవీ ప్రసారానికి సెన్సార్ నో

image

ఉన్ని ముకుందన్ హీరోగా తెరకెక్కిన మార్కో మూవీకి షాక్ తగిలింది. ఇప్పటికే ఓటీటీలోకి వచ్చిన ఈ సినిమా శాటిలైట్ ప్రసారానికి మాత్రం బ్రేక్ పడింది. దాన్ని టీవీల్లో టెలికాస్ట్ చేయొద్దని సెన్సార్ బోర్డు ఆదేశించడంతో ఈ చిత్రానికి టీవీ ప్రీమియర్ ఇక అనుమానమే. హనీఫ్ అదేనీ డైరెక్ట్ చేసిన మార్కో, మలయాళ చిత్ర చరిత్రలోనే అత్యంత హింసాత్మక సన్నివేశాలు కలిగిన చిత్రంగా నిలిచింది.

News March 5, 2025

పరువు హత్య.. ప్రేమించిందని కూతుర్ని తగలబెట్టాడు

image

AP: అనంతపురం జిల్లా గుంతకల్లులో పరువు హత్య కలకలం రేపింది. ప్రేమ వ్యవహారంలో తన మాట వినలేదనే కారణంతో కూతురు భారతి(19)ని తండ్రి రామాంజనేయులు చంపేశాడు. అనంతరం కసాపురం శివారు అటవీ ప్రాంతంలో శవంపై పెట్రోల్ పోసి తగలబెట్టాడు. ఈ నెల 1న దారుణానికి పాల్పడగా నిన్న పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయాడు. మృతదేహం పూర్తిగా కాలిపోవడంతో పోలీసులు అక్కడే పోస్టుమార్టం నిర్వహించి దర్యాప్తు చేస్తున్నారు.

News March 5, 2025

సెన్సెక్స్ 850 పాయింట్లు అప్.. ₹5లక్షల కోట్ల లాభం

image

దేశీయ స్టాక్‌మార్కెట్లలో బలమైన కౌంటర్ ర్యాలీ జరుగుతోంది. ఆరంభం నుంచీ దూకుడు మీదున్న సూచీలు ఇన్వెస్టర్ల కొనుగోళ్లతో ఇంట్రాడే గరిష్ఠాలకు చేరాయి. నిఫ్టీ 22,369 (+286), సెన్సెక్స్ 73,836 (+850) వద్ద ట్రేడవుతున్నాయి. వరుసగా 10 సెషన్లు ఎరుపెక్కిన సూచీలు ఇవాళ గ్రీన్‌లో కళకళలాడుతుండటంతో మార్కెట్ వర్గాలు ఖుషీ అవుతున్నాయి. NIFTY NEXT50 ఏకంగా 1269pts ఎగిసింది. మదుపరుల సంపద రూ.5లక్షల కోట్లమేర పెరిగింది.

News March 5, 2025

BREAKING: MLC అభ్యర్థిగా నాగబాబు

image

AP: జనసేన ఎమ్మెల్సీ అభ్యర్థిగా నాగబాబు పేరును డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఖరారు చేశారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఆయన త్వరలో నామినేషన్ దాఖలు చేయనున్నారు. కాగా ఆయనను ఎమ్మెల్సీ కోటాలో మంత్రివర్గంలోకి తీసుకుంటానని సీఎం చంద్రబాబు గతంలో ప్రకటించారు. దీంతో జనసేన అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

News March 5, 2025

తమిళం కోసం స్టాలిన్ చేసిందేముంది: అన్నామలై

image

పార్లమెంటులో సెంగోల్ ప్రతిష్ఠాపన తమిళ సంస్కృతికి దక్కిన గౌరవమని TN BJP చీఫ్ అన్నామలై అన్నారు. తమిళంపై ఇంత గొంతు చించుకుంటున్న CM స్టాలిన్ భాషాభివృద్ధి కోసం ఏం చేశారని ప్రశ్నించారు. స్వార్థ ప్రయోజనాల కోసం భాషను రాష్ట్రానికే పరిమితం చేశారని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ ఆఫీసుల్లో <<15657406>>హిందీ<<>>ని తొలగించాలన్న ఆయన డిమాండును ఖండించారు. LS స్థానాల డీలిమిటేషన్‌పై ఆయన చెప్పేవన్నీ ఊహాగానాలేనని కొట్టిపారేశారు.

News March 5, 2025

BREAKING: స్టీవెన్ స్మిత్ రిటైర్మెంట్

image

ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవెన్ స్మిత్ వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించారు. ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ చేతిలో ఓటమి నేపథ్యంలో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే టెస్టులు, టీ20లలో కొనసాగుతానని తెలిపారు. స్మిత్ 170 వన్డేల్లో 5,800 రన్స్ చేశారు. ఇందులో 12 సెంచరీలు, 35 అర్ధసెంచరీలు ఉన్నాయి.