news

News March 4, 2025

ఉద్యోగాలకు వయోపరిమితి పెంపు

image

ఏపీపీఎస్సీ ఉద్యోగాలకు వయోపరిమితి పెంచుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. యూనిఫాం సర్వీసెస్‌కు రెండేళ్లు, నాన్ యూనిఫామ్ సర్వీసెస్‌కు 34 నుంచి 42 ఏళ్లకు వయోపరిమితి పెంచింది. సెప్టెంబర్ 30లోపు జరిగే పరీక్షలకు ఇది వర్తించనుంది. ఏపీపీఎస్సీతో పాటు పలు ఏజెన్సీలు నిర్వహించే డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ పోస్టులకు దీన్ని అమలు చేయనుంది.

News March 4, 2025

మనుస్మృతి, బాబర్‌నామా విషయంలో వెనక్కి తగ్గిన ఢిల్లీ వర్సిటీ

image

తమ చరిత్ర పుస్తకాల్లో బాబర్‌నామా, మనుస్మృతి చేర్చాలన్న ప్రతిపాదనను ఢిల్లీ వర్సిటీ ఉపసంహరించుకుంది. ఫ్యాకల్టీ నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవడంతోనే ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు పేర్కొంది. వీటిని చరిత్ర పుస్తకాల్లో చేర్చే ప్రతిపాదనను గత నెల 19న వర్సిటీలోని జాయింట్ కమిటీ ఆఫ్ కోర్సెస్ ఆమోదించింది. అయితే వీటి కారణంగా వివాదాలు పెరగొచ్చన్న ఆందోళనలతో వర్సిటీ తాజాగా వెనక్కితగ్గింది.

News March 4, 2025

MLC కౌంటింగ్: ఆధిక్యంలో బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి

image

TG: ఆదిలాబాద్-నిజామాబాద్-కరీంనగర్-మెదక్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి 1,492 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. రెండో రౌండ్ పూర్తయ్యేసరికి అంజిరెడ్డికి 14,690 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి 13,198, బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ 10,746 ఓట్లు సాధించారు.

News March 4, 2025

ప్రియుడితో హీరోయిన్ తమన్నా బ్రేకప్?

image

లవ్ బర్డ్స్ తమన్నా, విజయ్ వర్మ తమ డేటింగ్‌కు బ్రేకప్ చెప్పినట్లు ‘పింక్ విల్లా’ కథనం ప్రచురించింది. కొన్ని వారాల క్రితమే విడిపోయిన వీరిద్దరూ స్నేహితులుగా కలిసి ఉండాలని నిర్ణయించుకున్నారని తెలిపింది. 2023లో లస్ట్ స్టోరీస్-2 సందర్భంగా తమన్నా, విజయ్ మధ్య రిలేషన్‌షిప్ బయటి ప్రపంచానికి తెలిసింది. త్వరలో పెళ్లి చేసుకుంటారని ప్రచారం జరుగుతున్న వేళ బ్రేకప్ వార్తలు రావడం అభిమానులను షాక్‌కు గురి చేస్తోంది.

News March 4, 2025

నాలుగు వికెట్లు కోల్పోయిన ఆసీస్

image

సెమీఫైనల్-1లో ఆసీస్ నాలుగో వికెట్ కోల్పోయింది. జడేజా వేసిన బంతిని ఇంగ్లిస్ కవర్స్ మీదుగా ఆడబోయి కోహ్లీకి ఈజీ క్యాచ్ ఇచ్చి వెనుదిరిగారు. అంతకుముందు లబుషేన్‌(29) జడేజా వేసిన బంతికి వికెట్ల ముందు దొరికిపోయారు. మరోవైపు స్మిత్(59) వేగంగా పరుగులు చేస్తున్నారు. 28 ఓవర్లకు ఆసీస్ స్కోర్ 146-4.

News March 4, 2025

టెలిఫోన్‌కు 75 ఏళ్లు పడితే.. థ్రెడ్స్‌కు 5 రోజులే!

image

టెక్నాలజీ వినియోగం వేగంగా పెరుగుతోంది. కొత్తగా ఏది వచ్చినా దాన్ని అందిపుచ్చుకునేందుకు ప్రజలు మొగ్గుచూపుతున్నారు. దీంతో టెలిఫోన్ వినియోగించే వారి సంఖ్య 100 మిలియన్లకు చేరేందుకు 75 ఏళ్లు పడితే.. Threads 5 రోజుల్లో & ChatGPT 2 నెలల్లోనే ఈ ఘనత సాధించాయి. మొబైల్ ఫోన్‌కు 16 ఏళ్లు, ట్విటర్‌కు 5 ఏళ్లు, ఫేస్‌బుక్‌కి 4.5 ఏళ్లు, వాట్సాప్‌కు 3.5 ఏళ్లు, ఇన్‌స్టాగ్రామ్‌కు 2.5 ఏళ్లు పట్టింది.

News March 4, 2025

పాకిస్థాన్‌కు కొత్త కెప్టెన్

image

పాకిస్థాన్ టీ20 కెప్టెన్ మహమ్మద్ రిజ్వాన్‌కు ఆ దేశ క్రికెట్ బోర్డు షాక్ ఇచ్చింది. న్యూజిలాండ్‌తో 5 టీ20ల సిరీస్ కోసం రిజ్వాన్‌ను తప్పించి సల్మాన్ అలీ అఘాకు పగ్గాలు అప్పగించింది. ఈ సిరీస్‌కు రిజ్వాన్‌తో పాటు మాజీ కెప్టెన్ బాబార్ ఆజమ్‌ను పక్కనపెట్టింది. అయితే వన్డేలకు మాత్రం రిజ్వాన్ కెప్టెన్సీ చేస్తారని వెల్లడించింది. ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్థాన్ ఘోరంగా విఫలమైన సంగతి తెలిసిందే.

News March 4, 2025

SLBC టన్నెల్ సహాయక చర్యల్లో పురోగతి

image

TG: SLBC టన్నెల్ సహాయక చర్యల్లో పురోగతి కనిపించింది. సొరంగంలో పనుల కోసం ఉపయోగించే కన్వేయర్ బెల్ట్ మరమ్మతులకు గురికాగా, సాంకేతిక సిబ్బంది దాన్ని పునరుద్ధరించారు. ప్రస్తుతం అది పని చేస్తోంది. దీంతో సొరంగంలోని బురద, మట్టిని తొలగించే ప్రక్రియ వేగవంతం కానుంది. సొరంగంలో చిక్కుకుపోయిన 8మంది ఉద్యోగుల ఆచూకీ కోసం 10 రోజులుగా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

News March 4, 2025

Stock Markets: గ్యాప్‌డౌన్ నుంచి రికవరీ..

image

స్టాక్‌మార్కెట్లు స్వల్పంగా నష్టపోయాయి. నిఫ్టీ 22,082 (-36), సెన్సెక్స్ 72,989 (-96) వద్ద ముగిశాయి. గ్యాప్‌డౌన్లో మొదలైన సూచీలు నష్టాలను కొంత పూడ్చుకున్నాయి. బ్యాంకు, ఫైనాన్స్, మీడియా, మెటల్, PSU బ్యాంకు, వినియోగం, O&G షేర్లు ఎగిశాయి. ఆటో, ఎఫ్ఎంసీజీ, ఐటీ, ఫార్మా సూచీలు నష్టపోయాయి. ఎస్బీఐ, BPCL, BEL, శ్రీరామ్ ఫైనాన్స్, Adani Ent టాప్ గెయినర్స్. బజాజ్ ఆటో, హీరోమోటో, బజాజ్ ఫిన్‌సర్వ్ టాప్ లూజర్స్.

News March 4, 2025

ఐదేళ్లుగా ఆదాయం పెరగడం ఆగిపోయింది: పయ్యావుల

image

AP: రాష్ట్రంలో ఐదేళ్లుగా ఆదాయం పెరగడం ఆగిపోయిందని మంత్రి పయ్యావుల కేశవ్ అసెంబ్లీలో అన్నారు. ‘రాష్ట్ర ఆదాయం, కేంద్రం నుంచి వచ్చేది కలిపి రూ.1,54,065cr. రాష్ట్రం అప్పులు, వడ్డీలు రూ.63,962cr కట్టాల్సి ఉంది. జీతభత్యాలు, వడ్డీలు, అప్పుల అసలు కలిపి రూ.65,962cr ఖర్చు చేస్తున్నాం. జీతభత్యాలు, అప్పులు, వడ్డీలకే మనకు వచ్చే ఆదాయం సరిపోతోంది. అభివృద్ధి పనులకు అప్పులు చేయాల్సిన పరిస్థితి’ అని అన్నారు.