India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

TG: హైదరాబాద్‌ను దేశానికి రెండో రాజధానిగా చేయాలని బీఆర్ అంబేడ్కర్ మనవడు ప్రకాశ్ యశ్వంత్ డిమాండ్ చేశారు. ఎయిర్‌పొల్యూషన్, PAK, చైనాకు ఢిల్లీ దగ్గరలో ఉండటంతో దేశ రక్షణ దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకోవాలని నిన్న HYDలో జరిగిన సమావేశంలో కోరారు. ‘సుప్రీంకోర్టు బెంచ్‌ను ఏర్పాటు చేయాలి. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ఇక్కడే జరపాలి. HYDను దేశానికి రెండో రాజధాని చేయాలి’ అని సదస్సులో పేర్కొన్నారు.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఉక్రెయిన్‌కు సైనిక సహాయాన్ని నిలిపివేశారు. రష్యాతో శాంతి విషయంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ సహకరించడం లేదని ట్రంప్ ఆరోపిస్తున్నారు. ఆ దేశానికిచ్చే సాయాన్ని ఆయన సమీక్షిస్తున్నారని శ్వేతసౌధం పేర్కొంది. ‘అధ్యక్షుడి దృష్టంతా శాంతిస్థాపన మీదే ఉంది. రష్యా-ఉక్రెయిన్ సమస్య పరిష్కారం కోసం ఆయన కృషి చేస్తున్నారు’ అని తెలిపింది.

హైదరాబాద్-విజయవాడ NH-65 రహదారి 6 లేన్ల విస్తరణ విషయంలో కీలక ముందడుగు పడింది. డిటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్(DPR) రూపొందించే బాధ్యతల్ని మధ్యప్రదేశ్‌కు చెందిన ఓ సంస్థ దక్కించుకుంది. ఈ నెలాఖరుకల్లా ఈ సంస్థతో కేంద్రం ఒప్పందం ఖరారు కానుంది. డీపీఆర్ తయారీకి రూ.9.86 కోట్లు ఖర్చు కానున్నట్లు అంచనా. TGలోని దండు మల్కాపూర్ నుంచి APలోని గొల్లపూడి వరకు 265 కి.మీ మేర హైవే విస్తరణ జరగనుంది.

AP: ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీగా తాము మద్దతిచ్చిన వ్యక్తే గెలిచారంటూ మంత్రి అచ్చెన్నాయుడు చేసిన <<15643983>>వ్యాఖ్యలపై<<>> గాదె శ్రీనివాసులు నాయుడు స్పందించారు. ‘అవునా.. అచ్చెన్న నాకు మద్దతిచ్చారా? నాకు దానిపై అవగాహన లేదు. ఉపాధ్యాయ సంఘాల మద్దతుతో మాత్రమే నేను గెలిచా’ అని స్పష్టం చేశారు. కాగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి నేతలు ప్రత్యక్షంగా సపోర్ట్ చేసిన రఘువర్మ ఓడిపోయిన విషయం తెలిసిందే.

AP: నిరుద్యోగులు ఎన్నో నెలలుగా ఎదురుచూస్తున్న మెగా డీఎస్సీపై మంత్రి లోకేశ్ గుడ్ న్యూస్ చెప్పారు. ఈ నెలలోనే 16,347 టీచర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేస్తామని ప్రకటించారు. టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. స్కూళ్లు ఎక్కువ దూరంలో ఉన్న విద్యార్థులకు రవాణా భత్యం ఇస్తామని తెలిపారు. త్వరలో పాఠశాలల్లో వార్షికోత్సవాలు నిర్వహిస్తామన్నారు.

జపాన్ విదేశాంగమంత్రి టకేషీ ఇవాయ్ సహా 9మంది జపాన్ పౌరులు తమ దేశంలో ప్రవేశించకుండా రష్యా శాశ్వత నిషేధం విధించింది. ఈ మేరకు ఓ జాబితాను విడుదల చేసింది. వారిలో ఇసూజూ సంస్థ అధ్యక్షుడు షిన్సుకే మినామీ, జపాన్ అంతర్జాతీయ కో-ఆపరేషన్ ఏజెన్సీ సీనియర్ ఉపాధ్యక్షుడు షొహెయ్ హరా తదితరులున్నారు. తమపై జపాన్ ఆంక్షలకు నిరసనగా గత ఏడాది సైతం 13మంది జపనీయులపై మాస్కో ఇవే చర్యలు తీసుకుంది.

కేరళలో ఓ వాట్సాప్ ఎమోజీ తీవ్ర విషాదం మిగిల్చింది. పతనంతిట్టకు చెందిన బైజు, వైష్ణవి (28) భార్యాభర్తలు. వీరి ఇంటి ఎదురుగా విష్ణు (30) అనే వ్యక్తి ఉండేవాడు. ఈ క్రమంలో విష్ణు ఫోన్ నుంచి వైష్ణవి ఫోన్‌కు కిస్ ఎమోజీ వచ్చింది. ఇది చూసిన బైజు ఆగ్రహం కట్టలు తెంచుకుంది. దీంతో భార్యపై కొడవలితో దాడి చేశాడు. ఆమె ఇంట్లో నుంచి పారిపోయి విష్ణు ఇంటికి చేరుకుంది. అయినా వదలకుండా వెంటాడి నరకడంతో ఇద్దరూ మరణించారు.

TG: SLBC సొరంగంలో ఎనిమిది మంది కార్మికులు చిక్కుకుపోయి 10 రోజులు అవుతున్నా వారి ఆచూకీ లభించలేదు. శరవేగంగా సహాయక చర్యలు కొనసాగుతున్నా సొరంగం లోపలి పరిస్థితులు అనుకూలించడం లేదు. మట్టి, నీరు తొలగిస్తున్న కొద్ది మళ్లీ వచ్చి చేరుతోంది. దేశంలోని అన్ని రంగాల నిపుణులు రెస్క్యూలో పాల్గొన్నా ఫలితం లేదు. 2, 3 రోజుల్లో ఆపరేషన్ నిలిపేసి ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం.

సినీ నిర్మాత <<15577363>>కేదార్ సెలగంశెట్టి<<>> అంత్యక్రియలు దుబాయ్‌లో జరిగాయి. ఆయన మృతి వెనుక ఎలాంటి కుట్ర లేదని అక్కడి పోలీసులు విచారణ జరిపి క్లీన్ చిట్ ఇచ్చారు. అనంతరం ఆయన మృతదేహాన్ని భార్య రేఖా వీణకు అప్పగించారు. ఇండియాలో రాజకీయ దుమారం రేగుతుందని అక్కడే దహనసంస్కారాలు నిర్వహించినట్లు తెలుస్తోంది. కేదార్ అంత్యక్రియల్లో సినీ, రాజకీయ ప్రముఖులెవరూ పాల్గొనలేదని సమాచారం.

AP: ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థిగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సోదరుడు, నటుడు నాగబాబును ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో మొత్తం 5 ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీగా ఉన్నాయి. వాటిలో ఒకటి జనసేన తరఫున నాగబాబుకు ఖరారైనట్లు సమాచారం. కాగా ఎమ్మెల్సీగా ఎన్నికైన తర్వాత నాగబాబును క్యాబినెట్‌లోకి తీసుకుంటారని వార్తలు వస్తున్నాయి. గతంలో చంద్రబాబు కూడా ఆయనను మంత్రిమండలిలోకి తీసుకుంటామని ప్రకటించారు.
Sorry, no posts matched your criteria.