news

News March 3, 2025

అయోధ్యపై ISI కుట్ర: బాంబుదాడికి సిద్ధపడ్డ టెర్రరిస్టు

image

అయోధ్య రామమందిరాన్ని పేల్చేసేందుకు ISI భారీ కుట్ర పన్నినట్టు తెలిసింది. ఇందుకోసం ఫైజాబాద్ మటన్ వ్యాపారి, టెర్రరిస్టు అబ్దుల్ రెహ్మాన్‌ను నియమించుకుంది. రెక్కీ నిర్వహించాక ఫైజాబాద్ నుంచి హరియాణాలోని ఫరీదాబాద్‌కు చేరుకున్న రెహ్మాన్‌కు ఓ హ్యాండ్లర్ హ్యాండ్ గ్రెనేడ్లను ఇచ్చాడు. రైల్లో తిరుగు ప్రయాణానికి సిద్ధమవుతుండగా గుజరాత్ ATF, ఫరీదాబాద్ STF టీమ్స్ అతడిని పట్టుకున్నాయి.

News March 3, 2025

దుబాయి మాకు హోం గ్రౌండ్ కాదు: రోహిత్ శర్మ

image

దుబాయ్ తమ హోం గ్రౌండ్‌ కాదని, ఈ పిచ్‌ తమకూ కొత్తేనని టీమ్‌ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మఅన్నారు. ఇక్కడ తామాడిన మూడు మ్యాచులలో ప్రతి గేమ్‌కు పిచ్ పరిస్థితులు మారాయన్నారు. ILT20 టోర్నమెంట్‌ చూసినప్పుడు గ్రౌండ్ కండీషన్ అర్థమైందని పిచ్‌లు స్లోగా ఉండటం వల్లే 5గురు స్పిన్నర్లను ఆడించామని తెలిపారు. దుబాయిలోనే అన్నిమ్యాచులు ఆడటం ఇండియాకు కలసివచ్చిందని పలు దేశాల క్రికెటర్లు ఆరోపించిన సంగతి తెలిసిందే.

News March 3, 2025

కేంద్రమంత్రితో సీఎం రేవంత్ భేటీ

image

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి ఆయన కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్‌తో భేటీ అయ్యారు. కృష్ణా జలాల్లో తెలంగాణ వాటా, ప్రాజెక్టులపై ఆయనతో చర్చిస్తున్నారు.

News March 3, 2025

Stock Markets: నష్టాల నుంచి రికవరీ..

image

స్టాక్‌మార్కెట్లు ఫ్లాటుగా ముగిశాయి. నిఫ్టీ 22,119 (-5), సెన్సెక్స్ 73,085 (-112) వద్ద స్థిరపడ్డాయి. భారీ నష్టాల నుంచి సూచీలు మధ్యాహ్నం రికవర్ అయ్యాయి. ఐటీ, మెటల్, రియాల్టి, హెల్త్‌కేర్, ఫార్మా, కన్జంప్షన్ షేర్లు ఎగిశాయి. బ్యాంకు, మీడియా, O&G స్టాక్స్ ఎరుపెక్కాయి. బీఈఎల్, గ్రాసిమ్, ఐచర్ మోటార్స్, JSW స్టీల్, BCPL టాప్ గెయినర్స్. బజాజ్ ఆటో, కోల్ఇండియా, RIL, బజాజ్ ఫిన్‌సర్వ్, HDFC టాప్ లూజర్స్.

News March 3, 2025

ఈ నెల 17 వరకు వల్లభనేని వంశీకి రిమాండ్

image

AP: మాజీ ఎమ్మెల్యే, YCP నేత వల్లభనేని వంశీకి సీఐడీ కోర్టు ఈ నెల 17 వరకు రిమాండ్ విధించింది. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో CID అధికారులు కోర్టులో ఇవాళ పీటీ వారెంట్ దాఖలు చేశారు. దీంతో విజయవాడ సీఐడీ కోర్టు ఆయన్ను వర్చువల్‌గా విచారించి రిమాండ్ విధించింది. ఈ కేసులో వంశీ A71గా ఉన్న విషయం తెలిసిందే. సత్యవర్థన్‌ కిడ్నాప్, బెదిరింపుల కేసులో వంశీ ఇప్పటికే విజయవాడ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు.

News March 3, 2025

BREAKING: కెప్టెన్‌‌ను ప్రకటించిన KKR

image

ఈ ఏడాది ఐపీఎల్‌లో అజింక్య రహానే తమ కెప్టెన్‌గా వ్యవహరిస్తారని కోల్‌కతా నైట్‌రైడర్స్ ప్రకటించింది. వైస్ కెప్టెన్‌గా వెంకటేశ్ అయ్యర్‌ను నియమించింది. ఈ విషయాన్ని ట్విటర్లో అనౌన్స్ చేసింది. గత ఏడాది శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో ఆ జట్టు కప్ కొట్టిన సంగతి తెలిసిందే. అయితే, అతడిని కోల్‌కతా రిటెయిన్ చేసుకోలేదు. ఇక.. రహానే గతంలో రాజస్థాన్ రాయల్స్, రైజింగ్ పుణే సూపర్‌జెయింట్స్‌కు కెప్టెన్‌గా చేశారు.

News March 3, 2025

యాప్‌లతో ప్రెగ్నెన్సీ తప్పించుకుంటున్నారు

image

అవాంఛిత గర్భం తప్పించుకోవడానికి ఇప్పుడు కొందరు యాప్‌లను ఆశ్రయిస్తున్నట్లు BBC కథనం పేర్కొంది. నెలసరి డేట్స్, శరీర ఉష్ణోగ్రతలు వంటి వివరాలతో కొన్ని యాప్స్ ఏ తేదీల్లో భాగస్వామితో కలిస్తే ప్రెగ్నెన్సీ రాదో సూచిస్తున్నాయని వెల్లడించింది. ఇవి కొందరికి ఉపకరిస్తుండగా, వీటిని నమ్మి కోరుకోని గర్భం దాల్చిన మహిళలూ ఉన్నారంది. రెగ్యులర్ పీరియడ్స్, వాటి మధ్య గ్యాప్ సహా పలు అంశాల ఆధారంగా కచ్చితత్వ శాతం ఉంటుంది.

News March 3, 2025

CPIకి ఒక MLC సీటు ఇవ్వాలి: కూనంనేని

image

TG: కాంగ్రెస్ స్నేహ ధర్మాన్ని పాటించి ఒక MLC సీటు సీపీఐకి ఇవ్వాలని MLA కూనంనేని సాంబశివరావు కోరారు. 2 ఎమ్మెల్సీలు ఇచ్చేలా సీపీఐ-కాంగ్రెస్ గతంలో ఒప్పందం చేసుకున్నాయని గుర్తు చేశారు. PCC చీఫ్‌ను కలిసి ఈ మేరకు MLC ఇవ్వాలని కోరినట్లు చెప్పారు. CM రేవంత్, ఇన్‌ఛార్జ్ మీనాక్షిని కూడా కలిసి దీనిపై అడుగుతామన్నారు. ఒప్పందం ప్రకారం ప్రస్తుతం ఒక MLC సీటు ఇస్తారని ఆశిస్తున్నట్లు కూనంనేని వివరించారు.

News March 3, 2025

రాజస్థాన్ విద్యుత్ శాఖతో సింగరేణి ఒప్పందం

image

TG: సింగరేణి వ్యాపార విస్తరణలో మరో ముందడుగు పడింది. రాజస్థాన్ విద్యుత్ శాఖతో 3,100 మెగావాట్ల ప్రాజెక్టులపై సింగరేణి ఒప్పందం చేసుకుంది. ఈ మేరకు 1,600 మె.వా. థర్మల్, 1,500 మె.వా. సోలార్ విద్యుదుత్పత్తికి రాజస్థాన్‌ వెళ్లిన Dy.CM భట్టి విక్రమార్క, ఆ రాష్ట్ర CM భజన్‌లాల్ శర్మ సమక్షంలో MOU జరిగింది. ఈ జాయింట్ వెంచర్‌లో సింగరేణి 74%, రాజస్థాన్ 26% చొప్పున ఖర్చులు, లాభాలు పంచుకోనున్నాయి.

News March 3, 2025

బీచ్‌లకు బ్లూఫ్లాగ్ గుర్తింపు ఎలా ఇస్తారంటే?

image

బీచ్‌లో నీటి నాణ్యత, పర్యావరణ విధానాలు, భద్రతలో మంచి ప్రమాణాలు పాటిస్తేనే బ్లూఫ్లాగ్ గుర్తింపు వస్తుంది. మలినాలు, రసాయనాలు బీచ్‌లో కలవకూడదు. PH ప్రమాణాలు బాగుండాలి. CC కెమెరాలు, డ్రైనేజ్, వ్యర్థాల నిర్వహణ, టాయిలెట్స్, సెక్యూరిటీ వంటి 33రకాల సౌకర్యాలు ఉండాలి. INDలో 12 బీచ్‌లకే ఈ గుర్తింపు ఉండగా, <<15632535>>రుషికొండ <<>>ఒకటి. డెన్మార్క్‌లోని ద ఫౌండేషన్ ఫర్ ఎన్విరాన్‌మెంటల్ ఎడ్యుకేషన్ అనే సంస్థ ఈ ట్యాగ్ ఇస్తుంది.