India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

హైదరాబాద్-శ్రీశైలం రహదారికి మహర్దశ పట్టనుంది. ఈ రహదారిలో ఎలివేటెడ్ కారిడార్‌కు కేంద్రం అనుమతిచ్చింది. 62 కి.మీ మేర 30 అడుగుల ఎత్తులో ఫ్లైఓవర్ నిర్మించనున్నారు. ఇందుకు రూ.7,700 కోట్లు ఖర్చవుతుందని అంచనా. బ్రాహ్మణపల్లి నుంచి మన్ననూర్ మీదుగా దోమలపెంట వరకు ఈ కారిడార్ నిర్మిస్తారు. ఈ దూరాన్ని గంటలోపే చేరుకోవచ్చు. అలాగే శ్రీశైలం ప్రాజెక్టు సమీపంలో ఐకానిక్ వంతెన కూడా నిర్మించనున్నారు.

అసర్-2024 నివేదిక ఆధారంగా దేశంలోనే అత్యధిక టీవీలు ఉన్న రాష్ట్రంగా AP నిలిచింది. ఈ రాష్ట్రంలో 95.1% ఇళ్లలో టీవీలు ఉన్నాయి. ఆ తర్వాత TNలో 94.5%, పంజాబ్‌లో 93.7% ఇళ్లలో ఉన్నాయి. యూపీ, బిహార్, పశ్చిమబెంగాల్ వంటి పెద్ద రాష్ట్రాల్లో 50%లోపు ఇళ్లలోనే టీవీలు ఉన్నాయి. కర్ణాటక (89.9), కేరళ (89.3), తెలంగాణ (87), మహారాష్ట్ర (79.6), గుజరాత్ (69.5), పశ్చిమ బెంగాల్ (48.4), ఉత్తరప్రదేశ్(43%)లో ఉన్నట్లు తేలింది.

TG: సీఎం రేవంత్ ఇవాళ ఢిల్లీ పర్యటనకు వెళ్తున్నారు. కేంద్ర మంత్రులు సీఆర్ పాటిల్, మనోహర్ లాల్ ఖట్టర్‌తో ఆయన సమావేశం కానున్నారు. సాగునీటి ప్రాజెక్టులు, నిధులపై వారితో చర్చించనున్నట్లు తెలుస్తోంది. సీఎం వెంట మంత్రి ఉత్తమ్ కూడా హస్తినకు వెళ్లనున్నారు. మరోవైపు డిప్యూటీ సీఎం భట్టి రాజస్థాన్ పర్యటనకు వెళ్తున్నారు. ఆ రాష్ట్ర సీఎం భజన్‌లాల్ శర్మతో సింగరేణికి సంబంధించిన ఓ ఒప్పందాన్ని కుదుర్చుకోనున్నారు.

ప్రస్తుతం కిడ్నీలో రాళ్ల సమస్యతో చాలామంది బాధపడుతున్నారు. మూత్రంలోని కొన్ని కెమికల్స్ బయటకు వెళ్లకుండా లోపలే పేరుకుపోవడం వల్ల కొన్ని స్ఫటికాలు ఏర్పడి రాళ్లుగా మారతాయి. నాన్‌వెజ్ ఎక్కువగా తిన్నా, నీళ్లు తక్కువగా తాగినా కిడ్నీలో రాళ్లు వస్తాయి. నిద్రలేమి, ఆలస్యంగా భోజనం చేయడం, విటమిన్ బీ6, సీ, డీ లోపం వల్ల కూడా ఈ సమస్య వస్తుంది. షుగర్, ఒబేసిటీతో బాధపడుతున్నవారిలో ఈ సమస్య అధికం.

AP: రాష్ట్రంలో ఇవాళ్టి నుంచి ఇంటర్మీడియట్ రెండో సంవత్సరం పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు కొనసాగుతాయి. దాదాపు 4.71 లక్షల మంది విద్యార్థులు ఎగ్జామ్స్ రాస్తున్నారు. ఈ పరీక్షలకు ఒక నిమిషం నిబంధన ఉంది. కాగా ఈ నెల 1న ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు ప్రారంభమైన విషయం తెలిసిందే. ఆ పరీక్షలకు దాదాపు 5 లక్షల మంది హాజరైనట్లు సమాచారం.

TG: నిరంతరంగా వస్తున్న నీటి ఊటలతో ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోంది. కాగా ఈ నీరు ఎక్కడి నుంచి వస్తుందో జియోలాజికల్ టీమ్ కనుగొంది. టన్నెల్ ప్రమాద స్థలం పైభాగంలో ఉన్న మల్లెలతీర్ధం వాటర్ ఫాల్స్ అంతర ప్రవాహం పారుతున్నట్లు గుర్తించారు. అలాగే ఉర్సు వాగు, మల్లె వాగులు కూడా ప్రవహిస్తుండటంతో నీటి ధారలు వస్తున్నట్లు అంచనా వేశారు. ప్రమాద స్థలానికి 450 మీ పైభాగాన ఉన్నట్లు కనుగొన్నారు.

CTలో ఘోరంగా ఓడినా పాకిస్థాన్ ఆటగాళ్ల బుద్ధి మారడం లేదు. తాజాగా టీమ్ ఇండియా ప్లేయర్ విరాట్ కోహ్లీపై ఆ దేశ మాజీ క్రికెటర్ మొహ్సిన్ ఖాన్ నోరు పారేసుకున్నారు. ‘బాబర్ ఆజమ్‌తో పోలిస్తే కోహ్లీ జీరో. బాబర్ గణాంకాలతో కోహ్లీకి పోలికా? ఇలాంటి విషయాల గురించి చర్చించడం దండగ. ప్రస్తుతం పాక్ క్రికెట్ గురించి చర్చించాలి. మన జట్టుకు ప్రణాళికలు, వ్యూహాలు, జవాబుదారీతనం లేవు. తిరిగి గాడిన పడాలి’ అని పేర్కొన్నారు.

డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ కర్ణాటక సీఎం కావడం 100 శాతం ఖాయమని మాజీ సీఎం వీరప్ప మొయిలీ అన్నారు. ఇది త్వరలోనే జరిగి తీరుతుందని చెప్పారు. ‘డీకే సీఎం కావడాన్ని ఎవరూ అడ్డుకోలేరు. కానీ దానికి కొన్ని రోజులు వేచిచూడాలి. సీఎం పోస్టు ఎవరో బహుమతిగా ఇస్తే వచ్చేది కాదు.. ఎవరికి వారు కష్టపడి సంపాదించుకునేది’ అని ఆయన అభిప్రాయపడ్డారు. కాగా ఈ ఏడాది చివర్లో కర్ణాటక సీఎం మార్పు ఉండొచ్చని ప్రచారం జరుగుతోంది.

ఛాంపియన్స్ ట్రోఫీలో న్యూజిలాండ్‌పై గెలిచి సెమీస్‌లో ఆస్ట్రేలియాతో అమీతుమీకి సిద్ధమైంది. కాగా వన్డే వరల్డ్ కప్ ఫైనల్ పరాభవానికి ఆసీస్‌పై ప్రతీకారం తీర్చుకునే సమయం వచ్చింది. ఈ నెల 4న దుబాయ్ వేదికగా సెమీస్ జరగనుంది. ఆ మ్యాచులో ఆస్ట్రేలియాను చిత్తుగా ఓడించి ఇంటికి పంపాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఆ బాధ వారికి కూడా రుచి చూపించాలని కామెంట్లు చేస్తున్నారు.

ఇవాళ రెండు తెలుగు రాష్ట్రాల్లో MLC ఎన్నికల కౌంటింగ్ నిర్వహించనున్నారు. గత నెల 27న జరిగిన ఎన్నికల ఫలితాలను ఇవాళ వెల్లడించనున్నారు. ఓట్ల లెక్కింపు ఉదయం 8 గంటలకు ప్రారంభం కానుంది. తొలుత ఒక్కో అభ్యర్థికి లభించిన మొదటి ప్రాధాన్యత ఓట్లను లెక్కించనున్నారు. 50 శాతం ఓట్లు వచ్చిన వారిని విజేతగా ప్రకటిస్తారు. ఇలా జరగకపోతే ద్వితీయ ప్రాధాన్యత ఓట్లను లెక్కిస్తారు. ఇందుకు సంబంధించి అధికారులు ఏర్పాట్లు చేశారు.
Sorry, no posts matched your criteria.