India's largestHyperlocal short
news App
            Get daily news updates that are tailored for you based on your preferred language & location.

AP: సీఐడీ మాజీ చీఫ్ సునీల్ కుమార్‌ను సస్పెండ్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అఖిల భారత సర్వీస్ ఉద్యోగుల కోడ్ ఆఫ్ కండక్ట్‌కు వ్యతిరేకంగా వ్యవహరించినందుకు చర్యలు తీసుకుంది. అనుమతి లేకుండా విదేశాలకు వెళ్లారని ఆయనపై ఆరోపణలు రావడంతో వాటిని విచారించేందుకు కమిటీని నియమించింది.

TG: గద్దర్ అవార్డులను ఉగాది రోజున ఇవ్వాలని నిర్ణయించినట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా నాటక పోటీలు నిర్వహించి, నాటకాలను ప్రదర్శించే కళాకారులకు కూడా అవార్డులను ఇస్తామన్నారు. గత పదేళ్లలో రాష్ట్రంలో నంది అవార్డులు ఇవ్వలేదని గుర్తు చేశారు. సినిమా రంగంలో విశేష ప్రతిభ కనబర్చిన వారికి గద్దర్ అవార్డులు ఇస్తామని సీఎం రేవంత్ ఇదివరకే ప్రకటించిన సంగతి తెలిసిందే.

‘మ్యాడ్ స్క్వేర్’ సినిమాను ఈనెల 28న రిలీజ్ చేస్తామని నిర్మాత నాగవంశీ ప్రకటించారు. 29న రిలీజ్ చేయాల్సి ఉండగా, ఆరోజు అమావాస్య ఉండడంతో డిస్ట్రిబ్యూటర్లు ఒక రోజు ముందుగా రిలీజ్ చేయమని కోరారని వెల్లడించారు. అంతే తప్ప వేరే కారణం లేదని, అదే రోజు రిలీజ్ అవుతున్న నితిన్ ‘రాబిన్‌హుడ్’ మూవీ కూడా పెద్ద హిట్ అవ్వాలని ఆకాంక్షించారు. ‘మ్యాడ్’ సినిమాకు సీక్వెల్‌గా ‘మ్యాడ్ స్క్వేర్’ రూపొందిన సంగతి తెలిసిందే.

21,413 పోస్టుల భర్తీ కోసం భారత ప్రభుత్వ పోస్టల్ శాఖ గత నెల 10 నుంచి దరఖాస్తులు స్వీకరిస్తోంది. బ్రాంచ్ పోస్ట్‌మాస్టర్, అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్‌మాస్టర్ పోస్టులకు ఈ నెల 3లోగా దరఖాస్తు చేసుకోవాలి. APలో 1,215, TGలో 519 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 18 నుంచి 40 ఏళ్ల వారు అర్హులు. రాత పరీక్ష లేకుండా టెన్త్ క్లాస్ మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు. https://indiapostgdsonline.gov.in/ సైట్‌లో అప్లై చేసుకోవచ్చు.

AP: వైసీపీ శ్రేణులను నమ్మి ఎలాంటి సాయం చేయొద్దన్న సీఎం చంద్రబాబు <<15625389>>వ్యాఖ్యలపై<<>> వైసీపీ ఘాటుగా స్పందించింది. నాయకుడికి మోసగాడికి ఉన్న తేడా ఇదేనంటూ X వేదికగా విమర్శలు గుప్పించింది. పథకాలు, పనులు, ప్రాజెక్టుల విషయంలో జగన్ ఘంటాపథంగా ఉండేవారని తెలిపింది. మోసపూరిత చంద్రబాబు తన పార్టీ వాళ్లకే పనులు చేయాలని చెబుతున్నారని, వైసీపీ వారికి చేయొద్దని తన మంత్రులు, ఎమ్మెల్యేలకు చెబుతున్నారని మండిపడింది.

టీమ్ ఇండియా బాగా ఆడేది నిజమైతే పాకిస్థాన్‌తో 10 టెస్టులు, 10 వన్డేలు, 10 T20లు ఆడాలని ఆ జట్టు మాజీ ప్లేయర్ సక్లైన్ ముస్తాక్ సవాల్ విసిరారు. అప్పుడే ఏది బెస్ట్ టీమ్ అనేది తెలుస్తుందని చెప్పారు. ఇదే జరిగితే ఇండియాకు, ప్రపంచ క్రికెట్‌కు తాము తగిన సమాధానం చెప్పిన వాళ్లమవుతామన్నారు. కాగా భారత్, పాక్ మధ్య దౌత్య సంబంధాలు దెబ్బతినడంతో గత కొన్నేళ్లుగా ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లు నిర్వహించట్లేదు.

రంజాన్ వేళ ఇజ్రాయెల్-హమాస్ మధ్య మరో ఒప్పందం కుదిరింది. తొలిదశ కాల్పుల విరమణ ఒప్పందం నిన్నటితో ముగియగా దాన్ని పొడిగిస్తున్నట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. రంజాన్ మాసం కావడంతో గాజాలో సీజ్‌ఫైర్ కొనసాగించాలని US కోరడంతో ఓకే చెప్పింది. ఇందులో భాగంగా తమ అధీనంలోని బందీల మృతదేహాలను హమాస్ రెడ్‌క్రాస్‌కు అప్పగించనుంది.

AP: రాష్ట్ర వ్యాప్తంగా 28.62 లక్షల కుటుంబాలకు శాశ్వత కుల ధ్రువీకరణ పత్రాలను రెవెన్యూ శాఖ అందజేసినట్లు మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. 34.37 లక్షల కుటుంబాల డేటాను క్షేత్రస్థాయిలో పరిశీలించినట్లు పేర్కొన్నారు. స్కూళ్లు, కాలేజీల్లో ప్రవేశాలు, ఉద్యోగ రిజర్వేషన్లు, ప్రభుత్వ పథకాలకు ఇవి ఉపయోగపడుతాయని తెలిపారు. అర్హులు గ్రామ, వార్డు సచివాలయాలు, AP సేవా కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు.

హరియాణాలో కాంగ్రెస్ నాయకురాలు దారుణ హత్యకు గురయ్యారు. హిమానీ నర్వల్ (22) అనే యువతి మృతదేహం సూట్‌కేస్‌లో లభించింది. గుర్తుతెలియని వ్యక్తులు చున్నీతో గొంతు నులిమి హతమార్చారు. ఈ ఘటనను మాజీ ముఖ్యమంత్రి భూపిందర్ హూడా తీవ్రంగా ఖండించారు. ఉన్నతస్థాయి దర్యాప్తు జరపాలని కోరారు. హిమానీ రాహుల్‌తో కలిసి జోడో యాత్రలో పాల్గొన్నారు. ఈ రోజు హరియాణాలో మున్సిపల్ ఎన్నికలు జరగనుండగా ఈమె హత్య కలకలం రేపింది.

హీరో నాని, శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో తెరకెక్కుతోన్న చిత్రం ‘ది ప్యారడైజ్’. దసరా మూవీ తర్వాత వీరి కాంబినేషన్లో వస్తోన్న సినిమా కావడంతో దీనిపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ క్రమంలో రేపు మూవీ నుంచి ‘రా స్టేట్‌మెంట్’ రానున్నట్లు దర్శకుడు శ్రీకాంత్ ట్వీట్ చేశారు. రేపు ఉ.11.17 గంటలకు అప్డేట్ ఉంటుందని పేర్కొన్నారు.
Sorry, no posts matched your criteria.