news

News March 1, 2025

BREAKING: జైలులో పోసానికి అస్వస్థత

image

AP: అన్నమయ్య జిల్లా రాజంపేట సబ్ జైలులో ఉన్న పోసాని కృష్ణమురళి అస్వస్థతకు గురయ్యారు. దీంతో అధికారులు అతడిని జైలు నుంచి రాజంపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కాగా, ఆయనకు కోర్టు నిన్న 14 రోజుల రిమాండ్ విధించిన విషయం తెలిసిందే.

News March 1, 2025

విరుష్కను ఫాలో అయిన ఆలియా.. ఫొటోలు డిలీట్!

image

తన కుమార్తె రాహా ముఖాన్ని సోషల్ మీడియాలో చూపించకూడదని నటి ఆలియాభట్ నిర్ణయించుకున్నారు. అందుకే ఇన్‌స్టాగ్రామ్ సహా అన్ని హ్యాండిల్స్ నుంచి ఆమె ఫొటోలను డిలీట్ చేశారు. జామ్‌నగర్, పారిస్‌లో తీసుకున్న వాటినీ ఉంచలేదు. రాహా ముఖం కనిపించని ఒకే ఒక్క చిత్రాన్ని మాత్రం అలాగే ఉంచారు. ఆమె తీసుకున్నది సరైన నిర్ణయమేనని నెటిజన్లు అంటున్నారు. విరుష్క జోడీ తమ పిల్లలను ఎప్పట్నుంచో SMకు దూరంగా ఉంచడం తెలిసిందే.

News March 1, 2025

కొవ్వెక్కిన పంది, నీతిమాలిన జెలెన్‌స్కీ: రష్యా ఫైర్

image

డొనాల్డ్ ట్రంప్, జెలెన్‌స్కీ వాగ్వాదంపై రష్యా ఘాటుగా స్పందించింది. ఎవరి మద్దతూ లేకుండా ఒంటరిగా యుద్ధం చేశానన్న జెలెన్‌స్కీ ఓ నీతిమాలిన వాడంటూ రష్యా ఫారిన్ మినిస్ట్రీ ప్రతినిధి మరియా జఖారోవా విమర్శించారు. వైట్‌హౌస్‌లో అతడికి తగిన శాస్తి జరిగిందన్నారు. మాజీ ప్రెసిడెంట్, సెక్యూరిటీ కౌన్సిల్ డిప్యూటీ హెడ్ దిమిత్రి మెద్వెదేవ్ అయితే ఏకంగా ‘కొవ్వెక్కిన పంది’ అని తిట్టారు.

News March 1, 2025

సెమీఫైనల్.. ఆస్ట్రేలియాకు బిగ్ షాక్!

image

ఛాంపియన్స్ ట్రోఫీలో సెమీ ఫైనల్‌కు ముందు ఆస్ట్రేలియా జట్టుకు మరో షాక్ తగిలింది. ఆ జట్టు ఓపెనర్ మాథ్యూ షార్ట్ సెమీస్‌లో ఆడేది అనుమానమేనని కెప్టెన్ స్టీవ్ స్మిత్ చెప్పారు. షార్ట్ గాయంతో బాధపడుతున్నారని పేర్కొన్నారు. అతని స్థానంలో మెక్ గుర్క్, అరోన్, కూపర్‌లలో ఒకరిని తీసుకుంటామని చెప్పారు. నిన్న వర్షం కారణంగా రద్దైన మ్యాచులో షార్ట్ 15 బంతుల్లో 20 పరుగులు చేసి ఔటయ్యారు.

News March 1, 2025

100 రోజుల్లోపే శిక్ష పడేలా పనిచేయాలి: హోంమంత్రి అనిత

image

AP: నేరం చేసిన వంద రోజుల్లోపే శిక్షలు పడేలా పనిచేయాలని ట్రైనింగ్ పూర్తి చేసుకున్న SIలకు హోంమంత్రి అనిత సూచించారు. నిజాయితీగా ప్రజల రక్షణకు ముందుకెళ్లాలన్నారు. శిక్షణ పూర్తి చేసుకున్న ఎస్సైల పాసింగ్ పరేడ్‌లో ఆమె పాల్గొన్నారు. మొత్తం 395 మంది ఎస్సైలుగా శిక్షణ పూర్తి చేసుకోగా వీరిలో 97 మంది మహిళలు ఉన్నారు. మహిళలు ఇంత సంఖ్యలో ఉండటం గర్వకారణమని అన్నారు. ఈ పరేడ్‌కు డీజీపీ హరీశ్ గుప్తా హాజరయ్యారు.

News March 1, 2025

జెలెన్‌స్కీ కోసం ట్రంప్‌ను ఎదిరించే సీన్ EUకు ఉందా?

image

పీస్‌డీల్ తిరస్కరించిన జెలెన్‌స్కీకి EU మద్దతు ప్రకటించింది. దానికి ట్రంప్‌ను ధిక్కరించే సీనుందా? అంటే కష్టమే అంటున్నారు విశ్లేషకులు. కూటమిలో సగం దేశాలకు యుద్ధమే ఇష్టం లేదు. గ్యాస్, ఆయిల్ కొరతతో ఇబ్బంది పడుతున్నాయి. జర్మనీలో కల్లోలం, ఫ్రాన్స్‌లో రాజకీయ సంక్షోభం నెలకొన్నాయి. UK పరిస్థితి దారుణం. NATO, UN నుంచి వైదొలగుతానన్న ట్రంప్ వేసే టారిఫ్స్‌ను వారు తట్టుకొనే స్థితిలో లేనే లేరన్నది అసలు నిజం.

News March 1, 2025

ఒక కేసులో బెయిల్ వస్తే మరో కేసులో అరెస్టు!

image

AP: పోసాని కృష్ణమురళికి మరో షాక్ ఇచ్చేందుకు పోలీసులు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆయన ఒక కేసులో అరెస్టై, 14 రోజుల రిమాండ్‌లో ఉన్నారు. దీనిపై ఆయన దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై సోమవారం కోర్టులో విచారణ జరగనుంది. అయితే పోసానిపై రాష్ట్రవ్యాప్తంగా 14 కేసులు నమోదయ్యాయి. ఒక కేసులో బెయిల్ దొరికితే మరో కేసులో అరెస్టు చేయడానికి పోలీసులు రెడీ అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

News March 1, 2025

మరోసారి తండ్రైన మస్క్.. మొత్తం 14 మంది పిల్లలు

image

అపరకుబేరుడు ఎలాన్ మస్క్ మరోసారి తండ్రయ్యారు. తన ప్రేయసి, న్యూరాలింక్ ఎగ్జిక్యూటివ్ శివోన్ జిలిస్‌ నాల్గో బిడ్డకు జన్మనిచ్చింది. ఈ 14వ సంతానానికి సెల్డన్ లైకుర్గస్ అనే పేరు పెట్టినట్లు అంతర్జాతీయ మీడియా పేర్కొంది. కాగా, మొదటి భార్య జస్టిన్ విల్సన్‌తో ఆరుగురు, మాజీ లవర్ గ్రిమ్స్‌తో ముగ్గురు, రచయిత ఆష్లే సెయింట్‌తో ఒక్కరు, శివోన్ జిలిస్‌తో నలుగురు పిల్లలు ఉన్నారు.

News March 1, 2025

కాంగ్రెస్ నుంచి తీన్మార్ మల్లన్న సస్పెండ్

image

TG: ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు కాంగ్రెస్ ప్రకటించింది. ఇటీవల బీసీ సభలో ఓ వర్గంపై మల్లన్న వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు హైకమాండ్ గుర్తించింది. ఆ వ్యాఖ్యలపై ఫిబ్రవరి 12 లోపు వివరణ ఇవ్వాలని FEB 5న షోకాజ్ నోటీసులు ఇచ్చింది. మల్లన్న స్పందించకపోవడంతో పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు తాజాగా ప్రకటించింది.

News March 1, 2025

డిప్యూటీ సీఎంగా విజయ్? ప్రశాంత్ కిశోర్ స్ట్రాటజీ

image

టీవీకే అధినేత విజయ్‌తో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌కిశోర్ కీలక చర్చలు జరిపారు. రానున్న ఎన్నికల్లో AIDMKతో పొత్తు ఉంటే బాగుంటుందని తెలిపారు. సీఎంగా పళనిస్వామి, డిప్యూటీగా విజయ్ ఉండాలన్నారు. ఈ ఫార్ములాతోనే APలో ఎన్డీయే కూటమి విజయం సాధించిందన్నారు. ఏఐడీఎంకేకు 25శాతం ఓటుబ్యాంకు ఉందని, టీవీకేకు 20 శాతం రావచ్చని అంచనా వేశారు. ఈ రెండు పార్టీలు కలిసి పోటీచేస్తే ప్రభుత్వ ఏర్పాటు సులభమన్నారు.