news

News February 28, 2025

AUSvsAFG: ఆసీస్ టార్గెట్ 274 రన్స్

image

ఛాంపియన్స్ ట్రోఫీలో కీలకమైన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన అఫ్గాన్ 273 పరుగులకు ఆలౌటైంది. సెదిఖుల్లా అటల్ 85, అజ్మతుల్లా 67, ఇబ్రహీం 22, హష్మతుల్లా 20, రషీద్ 19 రన్స్ చేశారు. బెన్ 3, స్పెన్సర్, జంపా చెరో రెండు, ఎల్లిస్, మ్యాక్సీ చెరో వికెట్ పడగొట్టారు. విజయం కోసం కంగారూలు 274 రన్స్ చేయాల్సి ఉంది. ఈ వన్డేలో గెలిచిన జట్టు నేరుగా సెమీస్‌కు వెళ్తుంది.

News February 28, 2025

రాజ్యసభ సీటు ఆఫర్ చేసినా తిరస్కరించా: నటి

image

తనకు గతంలో కొన్ని రాజకీయ పార్టీలు రాజ్యసభ సీటు ఆఫర్ చేశాయని, వాటిని సున్నితంగా తిరస్కరించానని నటి ప్రీతి జింటా తెలిపారు. సోషల్ మీడియాలో తాను ఏం కామెంట్ చేసినా రాజకీయాలతో ముడిపెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు రాజకీయాల్లో చేరే ఉద్దేశమేమీ లేదని, వాటిపై ఆసక్తి కూడా లేదని స్పష్టం చేశారు. కాగా ఈ సీనియర్ హీరోయిన్ IPLలో పంజాబ్ జట్టుకు సహ యజమానిగా ఉన్నారు.

News February 28, 2025

రంజీల్లో చరిత్ర సృష్టించాడు

image

విదర్భ స్పిన్నర్ హర్ష్ దూబే రంజీల్లో సరికొత్త చరిత్ర సృష్టించారు. ఒకే సీజన్‌లో అత్యధిక వికెట్లు(69) తీసిన ప్లేయర్‌గా నిలిచారు. ఆ తర్వాతి స్థానాల్లో అశుతోష్ అమన్(68W-2018/19), జయదేవ్ ఉనద్కత్(67W-2019/20), బిషన్ బేడీ(64W-1974/75), గణేశ్(62W-1998/99) ఉన్నారు. కాగా కేరళతో జరుగుతున్న రంజీ ఫైనల్లో తొలి ఇన్నింగ్సులో దూబే 3 వికెట్లు తీశారు. విదర్భ తొలి ఇన్నింగ్సులో 37 పరుగుల ఆధిక్యంలో ఉంది.

News February 28, 2025

సీఎం చంద్రబాబు కీలక ప్రకటన

image

AP: వచ్చే నెలాఖరులోగా నామినేటెడ్ పదవులన్నింటినీ భర్తీ చేస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. మార్కెట్ యార్డులు, దేవస్థానాల కమిటీలకు పేర్లు ఇవ్వాలని టీడీఎల్పీ సమావేశంలో పార్టీ నేతలను ఆదేశించారు. సాధికార కమిటీ సభ్యులకే పదవులు దక్కుతాయని, మహానాడు లోపు ప్రక్రియ పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. ఎమ్మెల్యేలు నోరు అదుపులో పెట్టుకోవాలని, అనవసర విషయాలు మాట్లాడొద్దని హెచ్చరించారు.

News February 28, 2025

రేపు SLBCకి బీజేపీ ఎమ్మెల్యేల బృందం

image

TG: శ్రీశైలం SLBC టన్నెల్ వద్దకు రేపు బీజేపీ ఎమ్మెల్యేల బృందం వెళ్లనుంది. ప్రమాద స్థలాన్ని నేతలు పరిశీలించనున్నారు. రెస్క్యూ వివరాలను అడిగి తెలుసుకోనున్నారు. మరోవైపు నిన్న బీఆర్ఎస్ నేతలను ప్రమాదస్థలికి అనుమతించని సంగతి తెలిసిందే. ఈ క్రమంలో వీరిని అనుమతిస్తారా అనేది ఆసక్తికరంగా మారింది. కాగా రెస్క్యూ సిబ్బంది బురద, శకలాలను బయటకు పంపిస్తున్నారు.

News February 28, 2025

ప్రతి నియోజకవర్గంలో ఇండస్ట్రియల్ పార్క్: శ్రీధర్‌బాబు

image

తెలంగాణలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో మినీ ఇండస్ట్రియల్ పార్కులను మహిళల కోసం ఏర్పాటు చేస్తామని మంత్రి శ్రీధర్‌బాబు వెల్లడించారు. ఈ పార్కుల్లో ఎస్సీ, ఎస్టీ మహిళా పారిశ్రామికవేత్తలకు 10శాతం ప్రత్యేకంగా కేటాయిస్తామన్నారు. ఎస్సీ, ఎస్టీలు ఎదిగితేనే సమాజం అభివృద్ధి చెందుతుందని ఫిక్కీలో తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ ఎస్సీ, ఎస్టీ ఎంటర్‌ప్రైజెస్ సదస్సులో వెల్లడించారు.

News February 28, 2025

జగన్ కుట్రలతో జాగ్రత్త: సీఎం చంద్రబాబు

image

AP: YS జగన్ కుట్రల పట్ల పూర్తి అప్రమత్తంగా ఉండాలని పార్టీ నేతలను CM చంద్రబాబు హెచ్చరించారు. గతంలో వివేకా హత్య, కోడికత్తి డ్రామాల నెపం TDPపైన వేశారని వివరించారు. అప్పుడు అప్రమత్తంగా లేకపోవడంతో ఎన్నికల్లో నష్టపోయామని, ఇంటెలిజెన్స్ వ్యవస్థ కూడా ఈ కుట్రలను పసిగట్టలేకపోయిందని పేర్కొన్నారు. ఇటీవల తాడేపల్లి ప్యాలెస్ వద్ద జరిగిన అగ్నిప్రమాదంలోనూ కుట్ర ఉందని, పోలీసులు CC ఫుటేజ్ అడిగినా ఇవ్వలేదని చెప్పారు.

News February 28, 2025

మెరుగుపడిన Q3 GDP.. 6.2%గా నమోదు

image

FY2024-25 మూడో త్రైమాసికంలో భారత ఎకానమీ 6.2% వృద్ధిరేటు నమోదు చేసింది. రెండో త్రైమాసికంలోని 5.6%తో పోలిస్తే కొంత మెరుగైంది. గ్రామీణ ఆదాయం పెరగడం, ఖరీఫ్ దిగుబడులు మెరుగ్గా ఉండటం ఇందుకు దోహదపడింది. గత ఏడాది క్యూ3 వృద్ధిరేటైన 9.5%తో పోలిస్తే మాత్రం బాగా తక్కువే. తయారీ, మైనింగ్ రంగాల ప్రదర్శన మెరుగ్గా లేకపోవడమే ఇందుకు కారణం. మొత్తంగా ఈ ఆర్థిక ఏడాదిలో GDP 6.5%గా ఉంటుందని NSO అంచనా వేసింది.

News February 28, 2025

ఏఐ ఎఫెక్ట్.. 1350 మంది ఉద్యోగుల తొలగింపు

image

సాంకేతికంగా అద్భుతాలు సృష్టిస్తున్న’AI’ ఉద్యోగులకు శాపంగా మారుతోంది. అమెరికాలో ఆటోడెస్క్ అనే సాప్ట్‌వేర్ కంపెనీ 1350మందిని తొలగించింది. దీని ద్వారా మిగిలిన డబ్బును ‘ఏఐ’ టెక్నాలజీపై ఇన్వెస్ట్ చేయనున్నట్లు తెలిపింది. ఇప్పటికే 41శాతం కంపెనీలు ‘ఏఐ’తో ఉద్యోగులను తగ్గించుకుంటామని ప్రకటించాయి. జాబ్‌స్కిల్స్ రిక్వైర్‌మెంట్ తరచుగా మారుతుండటంతో కొత్తవి నేర్చుకోవటం ఎంప్లాయ్స్‌కి ఇబ్బందిగా మారుతోంది.

News February 28, 2025

32,438 ఉద్యోగాలు.. దరఖాస్తులకు రేపే లాస్ట్

image

రైల్వేలో 32,438 గ్రూప్-డీ ఉద్యోగాలకు దరఖాస్తు గడువు రేపటితో ముగియనుంది. వాస్తవానికి ఈనెల 22నే గడువు ముగియాల్సి ఉండగా RRB మరో 7 రోజులు పొడిగించింది. మార్చి 4-13 వరకు ఎడిట్ చేసుకునే అవకాశం కల్పించింది. టెన్త్ లేదా ITI పాసైన వారు అర్హులు. రిజర్వేషన్‌ను బట్టి వయో పరిమితిలో సడలింపు ఉంది. CBT, PET, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ద్వారా ఎంపిక ఉంటుంది.
సైట్: https://www.rrbapply.gov.in/