news

News October 25, 2024

ఎన్నికలకు కమిటీలను ప్రకటించిన బీజేపీ

image

TG: ఎమ్మెల్సీ, స్థానిక సంస్థల ఎన్నికలు, ఆందోళన కార్యక్రమాలపై బీజేపీ కమిటీలను ఏర్పాటు చేసింది. ఈ కమిటీల్లో ఎంపీ అరవింద్, పాల్వాయి హరీశ్, ఏవీఎన్ రెడ్డి, మహేశ్వర్ రెడ్డి, డీకే అరుణ, జి.నగేశ్, ఈటెల రాజేందర్, ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, కాటిపల్లి వెంకట రమణారెడ్డి, రాకేశ్ రెడ్డి, బూర నర్సయ్య గౌడ్ తదితరులకు చోటు లభించింది. రెండు, మూడు రోజుల్లో ఎమ్మెల్సీ అభ్యర్థుల్ని పార్టీ ప్రకటించనుంది.

News October 25, 2024

పుస్తకాల బరువుతో పిల్లల్లో ఆ సమస్యలు!

image

పుస్తకాల బ్యాగుల రూపంలో పిల్లల నడుముపై భారాన్ని వేయడం దీర్ఘకాలంలో ప్రమాదకరమని ముంబై లీలావతి ఆస్పత్రి వైద్యుడు సమీర్ రూపారెల్ పేర్కొన్నారు. ‘బ్యాగుల బరువు వల్ల ప్రతి 10మందిలో 8మంది చిన్నారులకి వెన్ను సమస్యలు వస్తున్నాయి. బ్యాగుల బరువు వారి శరీర బరువులో 15శాతాన్ని మించకూడదు. అధిక బరువు వల్ల మెడ, భుజాల నొప్పులు, వెన్ను వంగిపోయే స్కోలియోసిస్ వంటి పరిస్థితులూ తలెత్తవచ్చు’ అని హెచ్చరించారు.

News October 25, 2024

మరో 1,000 పాయింట్లు నష్టపోయే ప్రమాదం!

image

టెక్నిక‌ల్ అనాల‌సిస్ ప్రకారం నిఫ్టీ-50 మ‌రో 1,000 పాయింట్లు న‌ష్ట‌పోయే ప్ర‌మాదం ఉంద‌ని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఆల్ టైం హై 26,277 నుంచి నెల కంటే త‌క్కువ వ్య‌వ‌ధిలోనే 7% (1,899 పాయింట్లు) న‌ష్ట‌పోయిన సూచీ 100 డే మూవింగ్ యావ‌రేజ్(DMA- 24,565) కింద ట్రేడ్ అవుతోంది. ప్రస్తుతం ఉన్న 24,399 స్థాయి నుంచి మార్కెట్ పుంజుకోలేక‌పోతే 23,365 (200 DMA)కి పడిపోయే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు.

News October 25, 2024

ఇళ్లు కూల్చడం దేనికి? ఆ పనులు చేయండి చాలు: ఈటల

image

TG: మూసీ ప్రక్షాళన విషయంలో ప్రభుత్వం ఇష్టానుసారం వ్యవహరిస్తోందని బీజేపీ నేత ఈటల రాజేందర్ మండిపడ్డారు. ‘అసలు DPR లేకుండా మార్కింగ్ ఎలా చేస్తారు. చెరువులు శుభ్రం చేసి, డ్రైనేజీ నీరు మూసీలో కలవకుండా చూడండి. అంతేకానీ పేదల ఇళ్లు కూల్చడం దేనికి? గత ప్రభుత్వం సచివాలయాన్ని బఫర్ జోన్‌లో కట్టలేదా? పేదల ఉసురు మంచిదికాదు. కూల్చివేతలకు ఉపక్రమిస్తే బుల్డోజర్లకు అడ్డంగా పడుకుంటాం’ అని హెచ్చరించారు.

News October 25, 2024

ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలపై కేబినెట్ సబ్ కమిటీ

image

TG: ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం సీఎం రేవంత్ కేబినెట్ సబ్ కమిటీని నియమించారు. దీనికి మంత్రి భట్టి విక్రమార్క ఛైర్మన్‌గా వ్యవహరిస్తారు. మంత్రులు పొన్నం, శ్రీధర్ బాబు సభ్యులుగా ఉండనుండగా ప్రత్యేక ఆహ్వానితుడిగా కే.కేశవరావుని నియమించారు. శాఖల వారీగా ఉద్యోగ సంఘాల ప్రతినిధుల్లో సబ్ కమిటీ భేటీ కానుంది. కాగా ఇవాళ సాయంత్రంలోపు పెండింగ్ డీఏలపై నిర్ణయం తీసుకుంటామని సీఎం రేవంత్ హామీనిచ్చారు.

News October 25, 2024

ఇక బ్లింకిట్‌లోనూ EMI సౌకర్యం

image

వినియోగదారుల కోసం వాయిదాల సౌకర్యాన్ని తీసుకొస్తున్నట్లు డెలివరీ పోర్టల్ బ్లింకిట్ ప్రకటించింది. రూ.2999, అంతకంటే విలువైన ఆర్డర్లపై ఇది వర్తిస్తుందని తెలిపింది. కస్టమర్స్‌ ఫైనాన్షియల్ ప్లానింగ్‌ చేసుకునేందుకు వీలుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ వ్యవస్థాపకుడు అల్బీందర్ ధిండ్సా ట్విటర్‌లో వివరించారు. చెక్‌ ఔట్ సమయంలో ఈఎంఐ ఆప్షన్ ఎంచుకోవచ్చు. వినియోగదారుడి బ్యాంకును బట్టి వడ్డీ రేటు ఉంటుంది.

News October 25, 2024

అందుకు జగన్ అరాచక పాలనే కారణం: మంత్రి

image

AP: కూటమి ప్రభుత్వంపై విషం చిమ్మాలని జగన్ ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని మంత్రి అనగాని సత్యప్రసాద్ మండిపడ్డారు. ‘YCP హయాంలో మహిళలపై దాడులను అరికట్టేందుకు చర్యలు తీసుకోలేదు. తాడేపల్లి ప్యాలెస్ సమీపంలో అత్యాచారం జరిగితే నిందితుడ్ని అరెస్ట్ చేయలేదు. గత ఐదేళ్లలో యువతను గంజాయికి, డ్రగ్స్‌కి బానిసలు చేశారు. ఆ ప్రభావంతోనే సైకోలుగా మారిన కొందరు మహిళలపై దాడులకు పాల్పడుతున్నారు’ అని దుయ్యబట్టారు.

News October 25, 2024

అక్టోబర్ 25: చరిత్రలో ఈరోజు

image

1921: సంగీత దర్శకుడు టి.వి.రాజు జననం
1962: గేయ రచయిత కలేకూరు ప్రసాద్ జననం
1987: భారత క్రికెటర్ ఉమేశ్ యాదవ్ జననం
1999: సంగీత దర్శకుడు సాలూరు రాజేశ్వరరావు మరణం
1951: దేశంలో మొట్టమొదటి సార్వత్రిక ఎన్నికలు ప్రారంభం
అంతర్జాతీయ కళాకారుల దినోత్సవం

News October 25, 2024

ఈరోజు నమాజ్ వేళలు

image

తేది: అక్టోబర్ 25, శుక్రవారం
ఫజర్: తెల్లవారుజామున 4:59 గంటలకు
సూర్యోదయం: ఉదయం 6:12 గంటలకు
జొహర్: మధ్యాహ్నం 12:00 గంటలకు
అసర్: సాయంత్రం 4:11 గంటలకు
మఘ్రిబ్: సాయంత్రం 5:48 గంటలకు
ఇష: రాత్రి 7.01 గంటలకు
నోట్: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

News October 25, 2024

IPL: అత్యధిక జట్లకు ఆడిన ప్లేయర్ ఇతడే

image

ఐపీఎల్‌లో ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు ఆరోన్ ఫించ్ ఏకంగా 9 జట్లకు ప్రాతినిధ్యం వహించారు. RR, DC, PWI, SRH, MI, GL, PBKS, RCB, KKR జట్లకు ఆయన ఆడారు. ఆయన తర్వాత జయదేవ్ ఉనద్కత్ (8) ఉన్నారు. ఉనద్కత్ KKR, RCB, DC, RPS, RR, MI, LSG, SRH జట్లకు ప్రాతినిధ్యం వహించారు. ఆ తర్వాత మనీశ్ పాండే, యువరాజ్ సింగ్, ఇర్ఫాన్ పఠాన్, దినేశ్ కార్తీక్, రాబిన్ ఉతప్ప, తిసారా పెరీరా, ఇషాంత్ శర్మ, పార్థివ్ పటేల్ 6 జట్లకు ఆడారు.

error: Content is protected !!