India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
TG: ఆసుపత్రుల్లో రోగులకు ఇబ్బంది కలిగిస్తే వైద్య సిబ్బందిపై చర్యలుంటాయని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ హెచ్చరించారు. HYDలోని ఆరోగ్యశ్రీ ట్రస్టు ఆఫీసులో ఆయన ఉన్నతాధికారులతో సమావేశమై బోధనాసుపత్రుల పనితీరుపై సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆసుపత్రుల్లో ఏవైనా సమస్యలుంటే వెంటనే ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలన్నారు. జర్నలిస్టుల ఆరోగ్య పథకం పటిష్ఠంగా అమలు చేస్తామన్నారు.
ఏపీలో సాగునీటి సంఘాలకు ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది. 28.22 లక్షల ఆయకట్టును పర్యవేక్షించేందుకు గాను 6,149 సాగునీటి సంఘాలకు, 245 డిస్ట్రిబ్యూటరీ కమిటీలకు, 53 ప్రాజెక్టు కమిటీలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ సంఘాల్లో సభ్యులుగా ఉన్న రైతులు ఆయా ప్రాదేశిక నియోజకవర్గ సభ్యులను ఎన్నుకుంటారు. వారు సంఘాల అధ్యక్షులు, ఉపాధ్యక్షులను ఎన్నుకుంటారు. NOV 20న నోటిఫికేషన్ జారీ చేసి 27 నాటికి ప్రక్రియ ముగిస్తారు.
TG: గతంలో CM కాన్వాయ్ వచ్చే మార్గంలో ఇతర వాహనాలను అనుమతించేవారు కాదు. అయితే CM రేవంత్ ఉన్న జూబ్లీహిల్స్ ప్రాంతంలో వాహనాల రద్దీ ఎక్కువగా ఉండటంతో ట్రాఫిక్ జామ్ అవుతోంది. దీంతో ఆయన పలు మార్పులను పోలీసులకు సూచించారు. తన కాన్వాయ్ వెళ్లే సమయంలో ఇతర వాహనాలను ఆపొద్దని చెప్పారు. దీంతో ఆయన కాన్వాయ్ వెళ్లే మార్గంలో వీలైనంతవరకు వాహనాలను అనుమతిస్తున్నారు. డివైడర్‌కు అవతలివైపున్న వాహనాలనూ పంపిస్తున్నారు.
జల్, జంగల్, జమీన్ నినాదంతో నిజాం సర్కారుపై భీకరంగా పోరాడిన గోండు బెబ్బులి కొమురం భీం జయంతి నేడు. ఆసిఫాబాద్(D)లోని ఆదివాసీలను పీడిస్తున్న నిజాం సర్కార్‌కు ఎదురొడ్డి నిలబడ్డాడు. గెరిల్లా తరహా పోరాటాలకు ఆదివాసీలను సిద్ధం చేసి నిజాంకు కంటి మీద కునుకు లేకుండా చేశాడు. అయితే సైన్యం తూటాలకు భీం నేలకొరిగాడు. కానీ ఆయన రగిల్చిన పోరాటం ప్రభుత్వంలో కదలిక తెచ్చింది. అడవి బిడ్డలకు ప్రత్యేక హక్కులు కల్పించింది.
పీఎం ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్‌కు దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. ఏదైనా డిగ్రీ, పీజీ, డిప్లమా చేసిన అభ్యర్థులు ఈ నెల 25వ తేదీలోపు pminternship.mca.gov.in వెబ్‌సైట్‌లో అప్లై చేసుకోవచ్చు. ఎంపికైన వారికి దేశంలోని టాప్ 500 కంపెనీల్లో 12 నెలలపాటు ఇంటర్న్‌షిప్‌కు అవకాశాలు కల్పిస్తారు. వన్ టైమ్ గ్రాంట్ కింద రూ.6వేలు, ప్రతి నెల రూ.5వేలు స్టైఫండ్ చెల్లిస్తారు. DEC 2 నుంచి ఇంటర్న్‌షిప్ ప్రారంభిస్తారు.
ఫోన్ పే కస్టమర్ సపోర్ట్ స్టాఫ్‌పై AI తీవ్ర ప్రభావం చూపింది. గత ఐదేళ్లలో 1,100 మంది(60 శాతం)ని ఫోన్ పే తొలగించింది. ఏఐ ఆధారిత చాట్ బోట్ల ద్వారా ఆటోమేటెడ్ కస్టమర్ సర్వీసులతో సమర్థత పెరిగిందని ఫోన్ పే తన నివేదికలో పేర్కొంది. మరోవైపు కంపెనీ ఆదాయం పెంచుకుని నష్టాలనూ తగ్గించుకుంటోంది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో రూ.3,085 కోట్లుగా ఉన్న ఆదాయం 2023-24లో రూ.5725 కోట్లకు చేరుకుంది.
AP: దీపావళి నుంచి ఉచిత గ్యాస్ <<14417031>>సిలిండర్ల <<>>పథకాన్ని ప్రభుత్వం ప్రారంభించనుంది. ప్రతి 4 నెలల్లో లబ్ధిదారులు ఒక సిలిండర్(ఏడాదికి 3) ఉచితంగా పొందవచ్చు. ప్రస్తుతం సిలిండర్ ధర ₹876గా ఉండగా, ఇందులో రాయితీ ₹25 జమ అవుతోంది. మిగతా ₹851ను సిలిండర్ బుక్ చేసుకున్న లబ్ధిదారుల ఖాతాల్లో ప్రభుత్వం జమ చేయనుంది. ఈ నెల 24 నుంచే ఉచిత గ్యాస్ బుకింగ్‌కు శ్రీకారం చుట్టేలా, దీపావళి నుంచి సరఫరాచేసేలా సమాలోచనలు చేస్తోంది.
TG: కరీంనగర్‌లో ESI ఆస్పత్రి నిర్మించాలని కేంద్రమంత్రి మన్‌సుఖ్ మాండవీయను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కోరారు. జిల్లా మెడికల్ హబ్‌గా మారిందని, ఉత్తర తెలంగాణ జిల్లాల నుంచి అత్యధిక మంది ప్రజలు వైద్యం కోసం కరీంనగర్‌కు వస్తున్నారని తెలియజేశారు. బీడీ, నేత కార్మికులు సహా వివిధ రంగాల్లో పనిచేస్తున్న వారి సంఖ్య అధికంగా ఉందంటూ ESI ఆస్పత్రి ఏర్పాటు ఆవశ్యకతను సంజయ్ వివరించారు.
AP: దసరా ఉత్సవాలకు ఇంద్రకీలాద్రిపై శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానానికి భారీ ఆదాయం లభించింది. ఆలయంలోని మహా మండపంలోని మూడు విడతల్లో భక్తులు సమర్పించిన కానుకలను లెక్కించారు. మొత్తంగా రూ.9,26,97047 నగదు లభించినట్లు ఈవో కేఎస్ రామారావు తెలిపారు. 733 గ్రాముల బంగారం, 25.705 కిలోల వెండి లభ్యమైందన్నారు.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఇవాళ వాయుగుండంగా మారనుంది. రేపు తుఫాన్‌గా బలపడనుంది. దీని ప్రభావంతో అక్టోబర్ 24, 25 తేదీల్లో ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మిగతా చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడనున్నాయి. OCT 23, 24న పశ్చిమ మధ్య బంగాళాఖాతం తీరం వెంబడి గంటకు 45-65కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. మత్స్యకారులు ఈ నెల 25 వరకు వేటకు వెళ్లవద్దని అధికారులు హెచ్చరించారు.
Sorry, no posts matched your criteria.