news

News March 1, 2025

నేను వైసీపీలోనే ఉంటాను: తోట త్రిమూర్తులు

image

AP: తాను జనసేన పార్టీలో చేరుతున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని YCP MLC తోట త్రిమూర్తులు ఖండించారు. ఇటీవల జనసేన నేత సామినేని ఉదయభాను, త్రిమూర్తులు ఓ ఆలయంలో కలుసుకోవడంతో ఆయన పార్టీ మారుతారనే ప్రచారం ఊపందుకుంది. దీంతో తాను ఇప్పుడు వైసీపీలోనే ఉన్నానని, ఎప్పటికీ వైసీపీలోనే ఉంటానని స్పష్టం చేశారు. జగన్ నాయకత్వంలోనే కొనసాగుతానని వెల్లడించారు.

News March 1, 2025

మిరాకిల్ జరిగితేనే..

image

వర్షం కారణంగా ఆస్ట్రేలియాతో మ్యాచ్ రద్దవ్వడంతో అఫ్గానిస్థాన్ సెమీస్ ఆశలు దాదాపు గల్లంతైనట్లే. పాయింట్ల పరంగా దక్షిణాఫ్రికా(3P)తో సమానంగా ఉండగా రేపటి మ్యాచులో ఇంగ్లండ్ చేతిలో SA భారీ తేడాతో ఓడితేనే అఫ్గాన్‌కు అవకాశాలు ఉంటాయి. సుమారు 200 పరుగుల తేడాతో ENG గెలవాల్సి ఉంది. ఒకవేళ మ్యాచ్ వర్షం కారణంగా రద్దైనా SA నేరుగా సెమీస్ వెళ్లనుంది.

News February 28, 2025

రోహిత్, షమీ సహా అందరూ ఫిట్: కేఎల్

image

ఫిట్‌నెస్ సమస్యలతో మార్చి 2న కివీస్‌తో మ్యాచ్‌కు <<15595049>>రోహిత్,<<>> షమీ దూరమవుతారన్న వార్తలపై కేఎల్ రాహుల్ స్పందించారు. ‘నాకు తెలిసినంత వరకు ఆటగాళ్లంతా ఫిట్‌గా ఉన్నారు. ఎవరూ మ్యాచ్ మిస్సయ్యే ఛాన్స్ లేదు. అందరూ జిమ్, ప్రాక్టీస్ చేస్తున్నారు. పైగా సెమీస్‌కు ముందు ఒక మ్యాచే ఉన్నందున జట్టులో మార్పులు ఉండకపోవచ్చు’ అని తెలిపారు. కాగా ఇవాళ రోహిత్ గంట పాటు మైదానంలో చెమటోడ్చారు.

News February 28, 2025

రేపటి నుంచే ఇంటర్ పరీక్షలు.. ఏర్పాట్లు పూర్తి

image

AP: రాష్ట్రంలో రేపటి నుంచి ఇంటర్ ఫస్టియర్, 3వ తేదీ నుంచి సెకండియర్ పరీక్షలు మొదలుకానున్నాయి. 10.58 లక్షల మంది విద్యార్థులు హాజరుకానున్నారు. ఉ.9 నుంచి మ.12 వరకు ఎగ్జామ్స్ జరగనున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 1,535 పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలను అధికారులు ఏర్పాటుచేశారు. అన్ని సెంటర్ల పరిధిలో 144 సెక్షన్ అమల్లో ఉంటుంది. స్టూడెంట్స్ గంట ముందే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలి.

News February 28, 2025

ప్రజలందరికీ ఉపయోగపడే ఆరోగ్యపాలసీ: రేవంత్

image

TG: రాష్ట్రంలోని ప్రజలందరికీ ఉపయోగపడే ఆరోగ్యపాలసీని తీసుకురావడానికి కృషి చేస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. పద్మ విభూషణ్ డాక్టర్ నాగేశ్వర్ రెడ్డికి సన్మాన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. హెల్త్, బల్క్ డ్రగ్ విషయంలో హైదరాబాద్‌కు ప్రపంచ వ్యాప్త గుర్తింపు ఉందని చెప్పారు. కొవిడ్ సమయంలో చాలా దేశాలకు హైదరాబాద్ నుంచి వ్యాక్సిన్లు ఎగుమతి అయ్యాయని పేర్కొన్నారు.

News February 28, 2025

అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్

image

త్రివిక్రమ్-అల్లు అర్జున్ మూవీ షూటింగ్ ఈ నెలలో ప్రారంభమవుతుందన్న వార్తలను నిర్మాత నాగవంశీ ఖండించారు. ‘మ్యాడ్ స్క్వేర్’ మూవీ ప్రమోషన్లలో ఆయన మాట్లాడారు. ఆ ప్రాజెక్టు ఈ ఏడాది సెకండాఫ్‌లోనే స్టార్ట్ అవుతుందని తెలిపారు. దీంతో ఐకాన్ స్టార్ అభిమానులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు. పుష్ప-2 తర్వాత బన్నీ సినిమా ఏదీ ఇంకా మొదలవని విషయం తెలిసిందే.

News February 28, 2025

మూడు మ్యాచ్‌ల్లో వరుణుడిదే గెలుపు

image

ఛాంపియన్స్ ట్రోఫీలో 3 మ్యాచ్‌లు వర్షంతో రద్దయ్యాయి. ఈ నెల 25న ఆస్ట్రేలియా-సౌతాఫ్రికా మ్యాచ్, నిన్న పాకిస్థాన్-బంగ్లాదేశ్ మ్యాచ్‌లు వర్షం కారణంగా ఒక్క బంతి పడకుండానే రద్దవగా, ఇవాళ మధ్యలో వర్షం కురవడంతో అఫ్గానిస్థాన్-ఆసీస్ మ్యాచ్ కూడా రద్దైపోయింది. దీంతో పాకిస్థాన్‌లో జరిగిన 3 మ్యాచ్‌ల్లో వరుణుడే విజయం సాధించాడని నెటిజన్లు ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు.

News February 28, 2025

రోజంతా కూర్చొని పనిచేస్తున్నారా?

image

ప్రస్తుతం చాలా మంది ఒకేచోట 9-12 గంటలు కూర్చొని పనిచేయాల్సి వస్తోంది. అయితే, ఇలా ఎక్కువసేపు కూర్చోవడం ప్రమాదకరమని అమెరికన్ అకాడమీ ఆఫ్ న్యూరాలజీ అధ్యయనంలో వెల్లడైంది. వీరిలో చిత్తవైకల్యం, స్ట్రోక్, ఆందోళన, నిరాశతో పాటు నిద్రలేమి సమస్యలొస్తాయని పేర్కొంది. ఇలాంటి జాబ్స్ చేసేవారు శారీరక వ్యాయామం చేయడం వల్ల ఈ ప్రమాదాల నుంచి బయటపడొచ్చని సూచించింది. ఈ అధ్యయనంలో 73,411 మంది పాల్గొన్నారు.

News February 28, 2025

శివరాత్రి వేళ రూ.కోటి దాటిన రాజన్న ఆలయ ఆదాయం

image

మహాశివరాత్రి రోజున వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి రూ.1.31 కోట్ల ఆదాయం వచ్చినట్లు ఆలయ అధికారులు తెలిపారు. ప్రసాదాల ద్వారా రూ.57.12లక్షల ఆదాయంరాగా కోడె మెుక్కుల ద్వారా రూ.45.83లక్షలు వచ్చిందని పేర్కొన్నారు. స్వామివారిని 2లక్షల 60 వేల మంది భక్తులు దర్శించుకున్నట్లు వెల్లడించారు. తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ నుంచి భక్తులు ఆలయానికి తరలివచ్చారు.

News February 28, 2025

ALERT.. రేపటి నుంచి జాగ్రత్త

image

AP: విజయవాడ కమిషనరేట్ పరిధిలో రేపటి నుంచి కొత్త వాహన రూల్స్ అమల్లోకి రానున్నాయి. హెల్మెట్ లేకుండా బైక్ నడిపే వారికి, వెనుక కూర్చొని పెట్టుకోని వారికి, ట్రిపుల్ రైడింగ్, ఓవర్ స్పీడింగ్‌కు ₹1000, ఇన్సూరెన్స్ లేకపోతే ₹2000(తొలిసారి), రెండోసారి ₹4000, లైసెన్స్ లేకుండా బండి నడిపితే ₹5000, పొల్యూషన్ సర్టిఫికెట్ లేని వారికి ₹1500, ఫోన్ మాట్లాడుతూ బండి నడిపితే ₹1500 ఫైన్ వేస్తామని పోలీసులు హెచ్చరించారు.