news

News October 16, 2024

ఉచితంగా ఇసుక తీసుకెళ్లొచ్చు.. అడ్డుకోవద్దు: చంద్రబాబు

image

AP: ఉచిత ఇసుక విషయంలో కూటమి MLAలు జోక్యం చేసుకుంటే ఎవర్నీ వదలబోమని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ‘ఇందులో తన, మన అనేవి ఉండవు. ఇసుక ఉచితంగానే తీసుకెళ్లాలి. ఎవరైనా ఎడ్ల బండి తీసుకొచ్చి ఇసుక తీసుకెళ్లవచ్చు. వారిపై కేసులు పెడితే అధికారులను సస్పెండ్ చేస్తాం. దీనిలో ఎవరి పెత్తనాన్నీ సహించం. ఎవరి ఊరిలో వాళ్లకు ఇసుక తీసుకెళ్లే స్వేచ్ఛ ఉంటుంది. ఇందులో ఎవరి పెత్తనం వద్దు’ అని ఆయన స్పష్టం చేశారు.

News October 16, 2024

ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారు: గడికోట శ్రీకాంత్

image

AP: ప్రతిపక్ష నేతలపై చంద్రబాబు సర్కార్ తప్పుడు కేసులు బనాయిస్తోందని వైసీపీ నేత గడికోట శ్రీకాంత్ రెడ్డి మండిపడ్డారు. ‘కూటమి ప్రభుత్వంలో మహిళలు, చిన్నారులకు రక్షణ లేదు. మద్యం షాపుల కోసం టీడీపీ MLAలు దౌర్జన్యాలు చేస్తున్నారు. కేరళ మాల్ట్ బ్రాండ్ కర్ణాటకలో రూ.90కి ఇస్తుంటే ఇక్కడ రూ.99కి పెంచారు. పథకాలేవీ అమలు చేయడం లేదు. ఈవీఎంల ట్యాంపరింగ్‌పై ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారు’ అని ఫైర్ అయ్యారు.

News October 16, 2024

‘మీకు ఓటేశా.. నాకు పెళ్లి చేయండి’.. MLAను కోరిన వ్యక్తి

image

UPలో చర్ఖారీ MLA బ్రిజ్‌భూషణ్‌కు ఊహించని అనుభవం ఎదురైంది. పెట్రోల్ బంక్‌లో పని చేసే అఖిలేంద్ర అనే వ్యక్తి తనకు పెళ్లి చేయాలని MLAను కోరాడు. తననే ఎందుకు అడుగుతున్నావని MLA ప్రశ్నించగా.. ‘నేను మీకు ఓటేశాను’ అని ఆన్సర్ ఇచ్చాడు. తన వయసు 43 అని చెప్పాడు. కాసేపు మాట్లాడిన MLA ‘నాకు ఓటేశావు కదా. నా వంతు ప్రయత్నిస్తా. నీ జీతం ఎంత?’ అని అడిగారు. అతను రూ.6వేలు వస్తుందని, 13బిగాల భూమి ఉందని చెప్పారు.

News October 16, 2024

మహారాష్ట్రపై BRS మౌనమేనా?

image

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. దీంతో అక్కడ BRS పోటీ చేస్తుందా? లేదా? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. తెలంగాణలో BRS అధికారం కోల్పోవడం, లోక్‌సభ ఎన్నికల్లో ఒక్క సీటూ రాకపోవడంతో ఇప్పుడు గులాబీ దళపతి ఫోకస్ మొత్తం తెలంగాణపైనే పెట్టారట. ఈ పరిస్థితుల్లో మహాబరిలో షి’కారు’ చేయకపోవచ్చని రాజకీయ విశ్లేషకుల అంచనా. మహా ఎన్నికల్లో పోటీపై KCR ఆలోచన ఏంటో తెలియాలంటే కొద్దిరోజులు ఆగాల్సిందే.

News October 16, 2024

భారత్ నుంచి కనిపిస్తున్న తోక చుక్క!

image

అరుదుగా భూమి సమీపానికి వచ్చే సుచిన్‌షాన్ తోకచుక్క ప్రస్తుతం భారత్ నుంచి కూడా కనిపిస్తోంది. దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల నుంచి పలువురు తీసిన చిత్రాలు సోషల్ మీడియాలో కనువిందు చేస్తున్నాయి. గత నెల 28న సూర్యుడికి అత్యంత సమీపానికి వచ్చిన సుచిన్‌షాన్, ఇప్పుడు సౌర కుటుంబం నుంచి బయటికి వెళ్లే ప్రయాణంలో ఉంది. భూవాసులకు తిరిగి ఇలా కనిపించేది 80వేల ఏళ్ల తర్వాతే!

News October 16, 2024

నాని సినిమాకు అనిరుధ్ బీట్స్

image

నేచురల్ స్టార్ నాని, డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కాంబోలో రాబోతున్న రెండో సినిమాకు అనిరుధ్ సంగీతం అందించనున్నారు. ఈ విషయాన్ని ఇవాళ అనిరుధ్ బర్త్‌డే సందర్భంగా మేకర్స్ ప్రకటించారు. గతంలో నాని నటించిన గ్యాంగ్ లీడర్, జెర్సీ సినిమాలకు ఈ తమిళ మ్యూజిక్ డైరెక్టర్ పనిచేశారు. ఇటీవల ‘దేవర’ మూవీకి అనిరుధ్‌ ఇచ్చిన మ్యూజిక్‌కు ప్రేక్షకుల నుంచి ప్రశంసలు దక్కాయి.

News October 16, 2024

డెన్మార్క్ ఓపెన్‌లో ముగిసిన మిక్స్‌డ్, మహిళల డబుల్స్ పోరాటం

image

‘డెన్మార్క్ ఒపెన్ సూపర్ 750’ టోర్నీలో భారత మిక్స్‌డ్ డబుల్స్, మహిళల డబుల్స్‌ విభాగాల కథ ముగిసింది. మహిళల డబుల్స్‌లో ట్రీసా జాలీ, గాయత్రి గోపీచంద్ జోడీ, మిక్స్‌డ్ డబుల్స్‌లో సుమీత్ రెడ్డి, సిక్కిరెడ్డి జోడీ తొలి రౌండ్‌లోనే ఓటమిపాలయ్యారు. ఇక సింగిల్స్‌లో తెలుగు తేజం పీవీ సింధు తొలి రౌండ్‌లో ప్రత్యర్థి అస్వస్థతకు గురవ్వడంతో ఆమె రెండో రౌండ్‌కు చేరుకున్నారు.

News October 16, 2024

శ్రీవారి మెట్టు నడక మార్గం మూసివేత

image

AP: భారీ వర్షాల నేపథ్యంలో టీటీడీ ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టింది. తిరుమల శ్రీవారి మెట్ల మార్గాన్ని మూసివేసింది. అయితే అలిపిరి నడక మార్గం కొనసాగనుంది. పాపవినాశనం, శ్రీవారి పాదాల వద్దకు భక్తుల అనుమతిని అధికారులు రద్దు చేశారు. ఇటు తిరుపతిలో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. దీంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.

News October 16, 2024

HATSOFF: రామ్ చరణ్ మంచి మనసు!

image

చిరంజీవి పుట్టినరోజైన AUG 22న జన్మించిన ఓ పాప పాలిట ప్రాణదాతలా నిలిచారు రామ్‌చరణ్. ‘పల్మనరీ హైపర్‌టెన్షన్’ ఉండటంతో ఆమె బతకదని వైద్యులు చెప్పారు. తల్లిదండ్రులు బిడ్డను ‘అపోలో’కు తీసుకెళ్లారు. రూ.లక్షలు వెచ్చించే స్తోమత వారికి లేదు. విషయం తెలుసుకున్న చెర్రీ ఖర్చంతా భరించి పాపకు వైద్య సాయం అందించారు. ఈరోజు ఆ పసిపాప డిశ్చార్జి అయింది. దీంతో సేవలో తండ్రికి తగ్గ తనయుడని చరణ్‌పై ప్రశంసలు వస్తున్నాయి.

News October 16, 2024

GHMC కమిషనర్‌గా ఇలంబర్తి

image

TG: ఏపీకి అలాట్ చేసిన ఐఏఎస్‌లను <<14375321>>రిలీవ్<<>> చేసిన ప్రభుత్వం వారి స్థానాల్లో సీనియర్లకు అదనపు బాధ్యతలు అప్పగించింది. GHMC కమిషనర్‌గా ఇలంబర్తి, ఎనర్జీ సెక్రటరీగా సందీప్ కుమార్ సుల్తానియా, ఉమెన్స్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ సెక్రటరీగా శ్రీదేవి, టూరిజం అండ్ కల్చర్ ప్రిన్సిపల్ సెక్రటరీగా శ్రీధర్, ఆరోగ్య శ్రీ సీఈవోగా ఆర్వీ కర్ణన్‌కు అదనపు బాధ్యతలు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

error: Content is protected !!