India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
‘మేడిన్ ఇండియా’ తొలి బుల్లెట్ ట్రైన్లను రూపొందించే అవకాశం బెంగళూరులోని BEMLకు దక్కింది. డిజైనింగ్, తయారీ, 2 హైస్పీడ్ ట్రైన్ సెట్స్ కోసం కంపెనీకి ICF రూ.867 కోట్ల ఆర్డర్ ఇచ్చింది. ఒక్కో కోచ్ ధర రూ.27.86 కోట్లు. ‘భారత హైస్పీడ్ రైల్ జర్నీలో ఈ ప్రాజెక్ట్ కీలక మైలురాయి. 280 KMPH స్పీడ్‌తో ట్రైన్ సెట్లను దేశీయంగా డిజైన్ చేయబోతున్నాం’ అని BEML తెలిపింది. 2026 ఆఖర్లో వీటిని డెలివరీ చేస్తుందని సమాచారం.
నవంబర్‌లో ఆస్ట్రేలియాతో జరిగే తొలి టెస్టుకు రోహిత్ శర్మ దూరమయ్యే ఛాన్స్ ఉన్న నేపథ్యంలో టీమ్‌ఇండియా మేనేజ్‌మెంట్‌కు అనిల్ కుంబ్లే కీలక సూచన చేశారు. రోహిత్ స్థానంలో గిల్‌తో ఓపెనింగ్ చేయించవద్దని, అతడిని మూడో స్థానంలోనే కొనసాగించాలని అన్నారు. జైస్వాల్‌కు ఓపెనింగ్ జోడీగా KL రాహుల్‌ను పంపిస్తే మంచిదని అభిప్రాయపడ్డారు. రాహుల్ పరిస్థితులకు తగ్గట్లుగా ఆడగలరని, గిల్ పొజిషన్‌ను ఛేంజ్ చేయడం అవసరం లేదన్నారు.
తనకు చిన్నతనం నుంచి రేసింగ్ అంటే చాలా ఇష్టమని హీరో నాగచైతన్య చెప్పారు. కొత్త రకం బైక్, కారు ఏది కనిపించినా వెంటనే డ్రైవ్ చేసేవాడినని తెలిపారు. సినిమాలతో బిజీగా మారడంతో ఆ అలవాటును తగ్గించుకోవాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. వేగంగా వెళ్లొద్దని సన్నిహితులు సూచించడంతో రేసింగ్‌కు దూరమైనట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం ఆయన చందు మొండేటి దర్శకత్వంలో ‘తండేల్’ చిత్రంలో నటిస్తున్నారు.
జమ్మూకశ్మీర్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన ఒమర్ అబ్దుల్లాకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని ఆకాంక్షించారు. జమ్మూకశ్మీర్ అభివృద్ధికి కేంద్రం ఎప్పుడూ కట్టుబడి ఉంటుందని, అందుకు ఒమర్‌తో కలిసి పనిచేస్తామని పేర్కొన్నారు. కాగా ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో NC, కాంగ్రెస్ కూటమి మెజార్టీ స్థానాలు గెలిచి అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే.
AP: జగన్ అధికారంలో ఉన్న సమయంలో సొంత అవసరాలకు ప్రజా ధనాన్ని ఉపయోగించారని మంత్రి లోకేశ్ ట్వీట్ చేశారు. రాష్ట్ర ఖజానా నుంచి తాడేపల్లి ప్యాలెస్ చుట్టూ ఇనుప కంచె వేసేందుకు రూ.12.85 కోట్లు వినియోగించారని పేర్కొన్నారు. పేదల ఇళ్ల కోసం ఉపయోగించాల్సిన డబ్బును అత్యవసర భద్రతా కారణాలు చెప్పి వాడుకున్నారని దుయ్యబట్టారు. తన ఆనందాల కోసం ప్రజాధనాన్ని వినియోగించిన జగన్ సమాధానం ఇవ్వాల్సిన సమయం వచ్చిందన్నారు.
కలలు కనండి.. వాటిని సాకారం చేసుకోండని అబ్దుల్ కలాం చెప్పిన మాటలను నిజం చేసుకున్నాడో 64 ఏళ్ల వృద్ధుడు. ఒడిశాకు చెందిన జే కిషోర్ కొన్నేళ్ల క్రితం SBIలో డిప్యూటీ మేనేజర్‌గా రిటైర్ అయ్యారు. వైద్యుడవ్వాలనే తన చిరకాల వాంఛను ఎలాగైనా నెరవేర్చుకోవాలని నిర్ణయించుకున్నారు. ఎన్ని సవాళ్లు ఎదురైనా కష్టపడి చదివి NEET UG-2020లో ప్రవేశం పొందారు. ప్రస్తుతం బుర్లాలో ఉన్న VIMSARలో వైద్య విద్యను అభ్యసిస్తున్నారు.
ముడా స్కామ్ కేసుపై వేగంగా దర్యాప్తు జరుగుతున్న వేళ అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. ఆ సంస్థ చీఫ్ మారిగౌడ అనారోగ్య కారణాలతో పదవికి రిజైన్ చేశారు. ముడాలో భూముల సేకరణ, పంపిణీలో ఆయనే కీలకంగా వ్యవహరించారు. మైసూరులో అక్రమంగా 14 ప్లాట్లు పొందారన్న ఆరోపణలతో కర్ణాటక సీఎం సిద్దరామయ్య, అతడి భార్య పార్వతి, బావమరిదిపై కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఈ స్కామ్‌పై లోకాయుక్త, ED వేర్వేరుగా దర్యాప్తు చేస్తున్నాయి.
TG: మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ మధ్య <<14367710>>వివాదం<<>> ఢిల్లీకి చేరింది. సురేఖపై ఇప్పటికే దీపాదాస్ మున్షీ, టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్‌కు వరంగల్ కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేశారు. తాజాగా ఆమెపై ఢిల్లీలోని అధిష్ఠానానికి కంప్లైంట్ చేయనున్నారు. సురేఖపై చర్యలు తీసుకోవాలని కోరే అవకాశం ఉంది.
AP: కొత్త MSME పాలసీకి క్యాబినెట్ ఆమోదం తెలిపింది. 2030 నాటికి ఇంటింటికీ పారిశ్రామిక వేత్త అంశంతో ఈ పాలసీని రూపొందించింది. 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా పారిశ్రామిక పాలసీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనితో పాటు క్లీన్ ఎనర్జీ, ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీలకు ఆమోదం తెలిపింది. మల్లవెల్లి పారిశ్రామిక పార్కులో 349 మందికి భూ కేటాయింపులపై నిర్ణయం తీసుకుంది.
ఉగ్రవాదం, అతివాదమే సరిహద్దుల్లో యాక్టివిటీస్‌ను నిర్దేశిస్తాయని EAM జైశంకర్ అన్నారు. వాటితో వాణిజ్యం, ఇంధన సరఫరా, కనెక్టివిటీ జరగదని స్పష్టం చేశారు. ఇక UNSCలో విస్తృత ప్రాతినిధ్యం, సమ్మిళితత్వం, పారదర్శకత కోసం SCO చొరవ తీసుకోవాలని సూచించారు. సంస్కరణల వేగవంతానికి కృషి చేయాలన్నారు. ఇండస్ట్రియల్ కోఆపరేషన్ వల్లే పోటీతత్వం, లేబర్ మార్కెట్లు విస్తరిస్తాయన్నారు. MSME కొలాబరేషన్, కనెక్టివిటీ అవసరమన్నారు.
Sorry, no posts matched your criteria.