news

News October 16, 2024

త్వరలోనే వారికి రూ.7,500: మంత్రి తుమ్మల

image

TG: రైతు భరోసాపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గుడ్ న్యూస్ చెప్పారు. త్వరలోనే రైతు భరోసా రూ.7,500(ఏడాదికి ఎకరాకు రూ.15వేలు) ఇస్తామన్నారు. ఈ నెలాఖరులోగా రూ.2 లక్షల లోపు ఉన్న రైతులకు రుణమాఫీ పూర్తి చేస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. వచ్చే నెల నుంచి రూ.2లక్షల పైబడి ఉన్నవారికి మాఫీ చేస్తామని పేర్కొన్నారు. మరోవైపు బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పులకుప్పగా మార్చిందని దుయ్యబట్టారు.

News October 16, 2024

ఇందిరమ్మ ఇళ్లపై గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి

image

TG: హైడ్రాపై ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మహానగర భవిష్యత్తు కోసమే దీనిని తీసుకొచ్చినట్లు చెప్పారు. ఇప్పటికే రూ.18 వేల కోట్ల రైతు రుణమాఫీ చేశామని, త్వరలోనే రూ.13 వేల కోట్లు చేస్తామన్నారు. ఈ నెలాఖరు నాటికి ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని మంత్రి తెలిపారు.

News October 16, 2024

ఒక్క సినిమాకు రూ.125 కోట్లు తీసుకున్న స్టార్ హీరో!

image

సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన ‘వేట్టయన్’ సినిమాకు ఇప్పటికే రూ.264.31 కోట్ల కలెక్షన్స్ వచ్చినట్లు సినీవర్గాలు పేర్కొన్నాయి. అయితే, ఈ చిత్రం కోసం రజినీ భారీగా రెమ్యునరేషన్ తీసుకున్నారని తెలిపాయి. ఆయన ఏకంగా రూ.125 కోట్లు ఛార్జ్ చేశారట. జడ్జిగా నటించిన అమితాబ్ రూ.7 కోట్లు, రజినీ భార్యగా నటించిన మంజూ వారియర్ రూ.2-3 కోట్లు, ఫహాద్ ఫాజిల్ రూ.2-4 కోట్లు, రానా రూ.5 కోట్లు ఛార్జ్ చేశారని తెలిపాయి.

News October 16, 2024

BREAKING: సజ్జలకు పోలీసుల నోటీసులు

image

AP: వైసీపీ కీలక నేత సజ్జల రామకృష్ణారెడ్డికి మంగళగిరి గ్రామీణ పోలీసులు నోటీసులు జారీ చేశారు. టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో రేపు విచారణకు రావాలని అందులో పేర్కొన్నారు.

News October 16, 2024

J&K మంత్రివర్గంలో చేరట్లేదు: కాంగ్రెస్

image

జమ్మూకశ్మీర్ సీఎంగా ఎన్సీ నేత ఒమర్ అబ్దుల్లా ప్రమాణ స్వీకారం చేసిన నేపథ్యంలో JKPCC చీఫ్ తారిక్ హమీద్ కర్రా కీలక వ్యాఖ్యలు చేశారు. తాము ప్రస్తుతానికి J&K ప్రభుత్వ మంత్రివర్గంలో చేరట్లేదని చెప్పారు. రాష్ట్ర హోదా పునరుద్ధరించాలనే డిమాండ్‌కు తాము కట్టుబడి ఉన్నట్లు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ దీని కోసం పోరాడుతుందని స్పష్టం చేశారు. ఎన్నికల ప్రసంగంలో ప్రధాని ఇదే హామీని ఇచ్చారని గుర్తు చేశారు.

News October 16, 2024

ఓ వైపు వర్షం.. గ్రౌండ్‌లోనే కోహ్లీ

image

తొలి టెస్టులో సత్తాచాటేందుకు నెట్స్‌లో ప్రాక్టీస్ చేసిన రన్ మెషీన్ విరాట్ కోహ్లీ వర్షం పడుతుండటంతో నిరాశ వ్యక్తం చేస్తున్నారు. వరుణుడు కరుణిస్తే న్యూజిలాండ్ బౌలర్లకు చుక్కలు చూపిస్తానన్నట్లు ఆయన ఎదురుచూస్తున్న ఫొటో వైరలవుతోంది. వర్షంలోనూ తన కిట్‌తో గ్రౌండ్‌లో తిరుగుతూ కనిపించారు. ఉదయం 9.30 గంటలకు మ్యాచ్ మొదలుకావాల్సి ఉండగా వర్షం కారణంగా ఇంకా టాస్ కూడా పడలేదు.

News October 16, 2024

మగ బిడ్డకు జన్మనిచ్చిన రేణుకాస్వామి భార్య

image

కన్నడ హీరో దర్శన్ అభిమాని రేణుకాస్వామి హత్య కేసు సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. తాజాగా రేణుకాస్వామి భార్య సహన మగబిడ్డకు జన్మనిచ్చారు. ప్రస్తుతం శిశువు ఆరోగ్యంగానే ఉందని స్థానిక కథనాలు పేర్కొన్నాయి. హీరోయిన్ పవిత్రకు అసభ్యకర సందేశాలు పంపారని రేణుకాస్వామిని దర్శన్ అనుచరులు చిత్రహింసలకు గురిచేసి చంపారనే ఆరోపణలు దక్షిణాదిలో సంచలనం సృష్టించాయి. కాగా రేణుకా స్వామి మరణించిన సమయంలో సహన 5 నెలల గర్భిణి.

News October 16, 2024

ఏ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు?

image

దాదాపు రెండేళ్లుగా ఇద్దరు స్టార్లు బిగ్ స్క్రీన్‌పై కనిపించలేదు. ఎట్టకేలకు వీరి సినిమాలు రిలీజ్ కానుండటంతో అభిమానుల్లో ఆత్రుత నెలకొంది. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్-శంకర్ కాంబోలో ‘గేమ్ ఛేంజర్’ (JAN 10), ఐకాన్ స్టార్ అల్లు అర్జున్- సుకుమార్ కాంబోలో ‘పుష్ప-2’ (DEC 6) సినిమా రిలీజ్ కానుంది. ఇప్పటికే ఈ సినిమాల నుంచి సాంగ్స్, టీజర్స్ విడుదలయ్యాయి. మీరు దేనికోసం ఎదురుచూస్తున్నారో కామెంట్ చేయండి.

News October 16, 2024

సింగిల్ టేక్‌లో 11 నిమిషాల సీన్: వరుణ్ ధవన్

image

వరుణ్ ధవన్, సమంత ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన సిరీస్ ‘సిటాడెల్’. ఇందులో ఓ యాక్షన్ సన్నివేశాన్ని 11 నిమిషాల పాటు సింగిల్ టేక్‌లో చేసినట్లు వరుణ్ వెల్లడించారు. ఇది సిరీస్ క్లైమాక్స్‌లో రానున్నట్లు పేర్కొన్నారు. కాగా ఇది నవంబర్ 7న అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానుంది. హిందీ, తెలుగుతో పాటు ఇతర ప్రధాన భాషల్లో అందుబాటులో ఉండనుంది.

News October 16, 2024

ఐఏఎస్‌ల పిటిషన్‌పై మధ్యాహ్నం హైకోర్టులో విచారణ

image

TG: క్యాట్ తీర్పును సవాల్ చేస్తూ ఐఏఎస్‌లు హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ వేశారు. పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన ధర్మాసనం మధ్యాహ్నం 2.30గంటలకు వాదనలు విననుంది. ఏపీకి వెళ్లాలంటూ ఐఏఎస్‌లు ఆమ్రపాలి, వాకాటి కరుణ, వాణీప్రసాద్, రొనాల్డ్ రోస్‌ను క్యాట్‌ ఆదేశించిన విషయం తెలిసిందే.

error: Content is protected !!