news

News October 15, 2024

DOPT ఉత్తర్వులు పాటించాల్సిందే.. క్యాట్ తీర్పు

image

తమను APకి వెళ్లాలంటూ DOPT జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేయాలని తెలంగాణలో పనిచేస్తున్న IASలు వేసిన పిటిషన్‌పై CAT కీలక తీర్పునిచ్చింది. వారు ఏపీకి వెళ్లాల్సిందేనని స్పష్టం చేసింది. ఐఏఎస్‌ల విజ్ఞప్తిని తిరస్కరించింది. రేపు యథావిధిగా ఏపీలో రిపోర్టు చేయాలని ఆదేశించింది. దీంతో వాకాటి అరుణ, ఆమ్రపాలి, వాణీప్రసాద్, రొనాల్డ్ రోస్ ఏపీకి వెళ్లాల్సి ఉంటుంది.

News October 15, 2024

స్నేహితుడి హత్య.. సల్మాన్‌కు భద్రత పెంపు

image

రాజకీయ నేత బాబా సిద్ధిఖీ <<14343654>>హత్య నేపథ్యంలో<<>> బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్‌ భద్రతను Y+ కేటగిరీకి ప్రభుత్వం పెంచింది. ఆయన భద్రతపై ఆందోళనలు నెలకొనడంతో ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో ఆయన బయటకు వెళ్లిన సమయంలో పోలీస్ ఎస్కార్ట్‌ వెంట ఉండనుంది. బీజేపీ ఎంపీ, హీరోయిన్ కంగనా రనౌత్ కూడా Y+ సెక్యూరిటీ కలిగి ఉన్నారు. ఈ కేటగిరీలో ఇద్దరు PSOలతో పాటు 11 మంది సిబ్బందిని భద్రతగా కేటాయిస్తారు.

News October 15, 2024

ప్రజలకు సేవ చేయాలని లేదా?: IASలకు CAT ప్రశ్న

image

తమను APకి వెళ్లాలంటూ DOPT జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేయాలని తెలంగాణలో పనిచేస్తున్న IASలు CATలో కోరారు. తాము తెలంగాణలోనే ఉంటామని IASలు ఆమ్రపాలి, కరుణ, వాణిప్రసాద్ CATలో వాదించారు. దీంతో ఏపీలో ప్రజలు వరదలతో అల్లాడుతున్నారని, అలాంటి చోటకు వెళ్లి సేవ చేయాలని లేదా అని IASలను క్యాట్ ప్రశ్నించింది. ప్రస్తుతం DOPT వాదనలను క్యాట్ వింటోంది.

News October 15, 2024

రేపటి నుంచి నూతన లిక్కర్ పాలసీ.. షాపుల టైమింగ్స్ ఇవే

image

AP: లాటరీలో 3,396 మద్యం షాపుల కేటాయింపు పూర్తవడంతో రేపటి నుంచి నూతన లిక్కర్ పాలసీ అమల్లోకి రానుంది. ఉదయం 10 నుంచి రాత్రి 10 వరకు అమ్మకాలు జరగనున్నాయి. ఇకపై డిజిటల్ పేమెంట్స్ విధానాన్ని ప్రభుత్వం అమల్లోకి తీసుకురానుంది. నిబంధనలను కచ్చితంగా పాటించాలని, లేదంటే కఠిన చర్యలు తప్పవని షాపుల యజమానులకు ప్రభుత్వం స్పష్టం చేసింది.

News October 15, 2024

నొప్పితో చంపేసే TECH NECK

image

ఫోన్లు, టాబ్లెట్లు, కంప్యూటర్లను గ్యాప్ లేకుండా వాడుతుంటే మెడ కండరాలపై ఒత్తిడిపడి నొప్పి పుట్టడాన్నే Tech/Text Neck అంటారు. సుదీర్ఘకాలం ఇలాగే ఉంటే మెడ కండరాలు దెబ్బతింటాయి. వెన్నెముక వంగుతుంది. కూర్చొనే తీరు మారిపోయి కీళ్లు, నరాల్లో ఇన్‌ఫ్లమేషన్ వస్తుంది. డిస్కులు పక్కకు తొలుగుతాయి. డిస్క్ బల్జ్ వస్తుంది. వెన్ను వంగడంతో వీపు మొద్దుబారడం, తిమ్మిర్లు, లోయర్ బ్యాక్ పెయిన్, తలనొప్పి కలుగుతాయి. >Share

News October 15, 2024

TECH NECK రాకూడదంటే..

image

* రెగ్యులర్‌గా ఎక్సర్‌సైజ్ చేయాలి * కూర్చునే పోస్చర్‌ సరిచేసుకోవాలి * ఫోన్లు, టాబ్లెట్లు, కంప్యూటర్ల వాడకం తగ్గించాలి * ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్ల స్క్రీన్లను తలను వంచకుండా స్ట్రెయిట్‌గా చూడాలి * వాటిని కళ్లకు 20-30 ఇంచుల దూరంలో ఉంచుకోవాలి * తల, వెన్నెముక, హిప్స్ నిటారుగా ఉండేలా కూర్చోవాలి * కూర్చున్నప్పుడు మోచేతులు 90 డిగ్రీల కోణంలో ఉంచాలి * కుర్చీలో కూర్చుంటే మీ పాదాలు నేలకు సమాంతరంగా తాకాలి

News October 15, 2024

CSIR-NET ఫలితాలు విడుదల

image

జాయింట్ CSIR-UGC NET: జులై- 2024 ఫలితాలను NTA విడుదల చేసింది. 2.25 లక్షల మంది అభ్యర్థులు హాజరైన ఈ పరీక్షలో నిర్ణీత ఉత్తీర్ణత సాధిస్తే సైన్స్ సబ్జెక్టుల్లో రీసెర్చ్, టీచింగ్‌కు అర్హత లభిస్తుంది.
ఏ ఇబ్బంది లేకుండా సులువుగా ఈ ఫలితాలు తెలుసుకునేందుకు <>క్లిక్ చేయండి<<>>

News October 15, 2024

ఎగ్జిట్ పోల్స్‌కు శాస్త్రీయత లేదు: రాజీవ్ కుమార్

image

ఎగ్జిట్ పోల్స్‌పై సీఈసీ రాజీవ్ కుమార్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎగ్జిట్ పోల్స్‌కు శాస్త్రీయత లేదని, వాటి ఆధారంగా తమపై నిందలు వేయడం అర్థరహితమని అన్నారు. కౌంటింగ్ రోజున ఉదయం 9.30 గంటలకంటే ముందు ఇచ్చే ఫలితాలు బోగస్ అని చెప్పారు. ఎగ్జిట్ పోల్స్ అంచనా మాత్రమేనని, వీటిలో ఈసీ ప్రమేయం ఉండదని స్పష్టం చేశారు. కాగా ఇటీవల వెలువడిన ఫలితాల్లో హరియాణా ఎగ్జిట్ పోల్స్ తారుమారైన సంగతి తెలిసిందే.

News October 15, 2024

RED ALERT: రేపు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

image

AP: బంగాళాఖాతంలో అల్పపీడనం మరింత బలపడి 24 గంటల్లో వాయుగుండంగా మారనుందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీనిప్రభావంతో రాయలసీమ, దక్షిణ కోస్తాలో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. రేపు YSR, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి, ప్రకాశం జిల్లాలకు <>రెడ్ అలర్ట్,<<>> బాపట్ల, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, గుంటూరు, కృష్ణ, పశ్చిమగోదావరి, కోనసీమ, కాకినాడ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

News October 15, 2024

కృష్ణ జింకల కోసం ప్రాణాలను సైతం పణంగా..!

image

బిష్ణోయ్ తెగ ప్రజలు కృష్ణ జింక‌ల్ని వారి ఆధ్యాత్మిక గురువు జంభేశ్వరుని పునర్జన్మగా భావిస్తుంటారు. 15వ శతాబ్దంలో 29 సూత్రాలతో గురు జంభేశ్వర్ (జంబాజీ) బిష్ణోయ్ సంఘాన్ని స్థాపించారు. ఇందులో వన్యప్రాణులు, వృక్షసంపదను రక్షించాలని ఉంది. బిష్ణోయ్ తెగ వారు జింకలుగా పునర్జన్మ పొందుతారని నమ్ముతారు. ఈ జంతువులను రక్షించడానికి బిష్ణోయిలు తమ ప్రాణాలను సైతం పణంగా పెడతారని చరిత్రకారుడు వినయ్ పరిశోధనలో తేలింది.

error: Content is protected !!