news

News October 9, 2024

పాకిస్థాన్‌కు కొరకరాని కొయ్యగా హ్యారీ బ్రూక్

image

పాకిస్థాన్‌తో జరుగుతున్న తొలి టెస్టులో ఇంగ్లండ్ ఆటగాడు హ్యారీ బ్రూక్ (109*) సెంచరీ చేశారు. 9 ఫోర్లు, ఓ సిక్సర్‌ సాయంతో శతకం బాదారు. పాక్‌పై ఆడిన నాలుగు టెస్టుల్లోనూ బ్రూక్ 4 సెంచరీలు చేశారు. ఈ క్రమంలో ఆయన అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నారు. పాక్ గడ్డపై అత్యధిక సెంచరీలు చేసిన మూడో బ్యాటర్‌గా మరో ఇద్దరితో కలిసి రికార్డు నెలకొల్పారు. గతంలో అమర్‌నాథ్, అరవింద డిసిల్వా నాలుగేసి సెంచరీలు బాదారు.

News October 9, 2024

కాంగ్రెస్ ‘రిజెక్ట్’ స్టేట్‌మెంట్లపై ECI సీరియస్: ఖర్గేకు ఘాటు లేఖ

image

EVMలపై నిందలేస్తూ, హరియాణా ఫలితాలను అంగీకరించడం లేదన్న కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలపై ECI ఘాటుగా స్పందించింది. ఘనమైన ప్రజాస్వామ్య వారసత్వం కలిగిన ఈ దేశంలో ఇలాంటి జనరలైజ్ స్టేట్‌మెంట్లను ఎప్పుడూ చూడలేదని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గేకు లేఖరాసింది. ఇది ప్రజాతీర్పును అప్రజాస్వామికంగా తిరస్కరించడమేనని స్పష్టం చేసింది. INC 12 మంది సభ్యుల బృందాన్ని 6PMకు కలిసేందుకు సిద్ధంగా ఉన్నామని వెల్లడించింది.

News October 9, 2024

BRS ఇక అధికారంలోకి రాదు: రేవంత్

image

TG: బీఆర్ఎస్ ఇక అధికారంలోకి రాబోదని సీఎం రేవంత్ అన్నారు. ‘పదేళ్లుగా ఉద్యోగాలు లేవు, బదిలీలు లేవు. మేం వచ్చిన 60 రోజుల్లోనే 30 వేల ఉద్యోగాలు ఇచ్చాం. 21 వేల మంది టీచర్లకు ప్రమోషన్లు కల్పించాం. విద్యారంగానికి రూ.21 వేల కోట్లు కేటాయించి ప్రభుత్వ స్కూళ్లను పటిష్ఠం చేస్తున్నాం. డీఎస్సీని ఆపాలని గుంట నక్కలు, కొరివి దెయ్యాలు ప్రయత్నించాయి. తెలంగాణ సమాజం మీద కేసీఆర్‌కు ఎందుకంత కోపం’ అని ఆయన ఫైర్ అయ్యారు.

News October 9, 2024

‘RC16’లో రామ్ చరణ్ లుక్ ఇదేనా?

image

బుచ్చిబాబు సానా డైరెక్షన్లో ‘RC16’లో రామ్ చరణ్ నటించనున్న సంగతి తెలిసిందే. క్రీడాప్రధానంగా సాగే ఈ కథలో చెర్రీ ఎలా కనిపిస్తారన్న ఆసక్తి ఆయన ఫ్యాన్స్‌లో ఉంది. ఈరోజు VV వినాయక్ బర్త్ డే సందర్భంగా చరణ్ ఆయన్ను కలిసి విష్ చేశారు. గడ్డంతో పాటు బాడీ కూడా బిల్డ్ చేసిన లుక్‌లో కనిపిస్తున్నారు. ఆ ఫొటోలు వైరల్ అవుతున్నాయి. ‘రంగస్థలం’ లుక్‌లో చరణ్ మరో హిట్ కొడతారంటూ ఫ్యాన్స్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

News October 9, 2024

PAK vs ENG.. ఇలాంటి పిచ్‌తో టెస్టు క్రికెట్‌ నాశనం: పీటర్సన్

image

పాకిస్థాన్‌, ఇంగ్లండ్ టెస్టు ఆడుతున్న ముల్తాన్‌లో పిచ్ బౌలర్లకు ఏమాత్రం సహకరించని విధంగా ఉండటంతో సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బౌలర్లకు అది శ్మశానం వంటిదంటూ ఇంగ్లండ్ మాజీ ఆటగాడు కెవిన్ పీటర్సన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చివరి రెండు రోజుల్లోనైనా ఫలితాన్నివ్వకపోతే ఈ పిచ్ టెస్టు క్రికెట్‌ని నాశనం చేసినట్లేనని మండిపడ్డారు. ఆ పిచ్‌పై వికెట్ తీసేందుకు బౌలర్లు చెమటోడుస్తుండటం గమనార్హం.

News October 9, 2024

గత ముఖ్యమంత్రి నిరుద్యోగులను పట్టించుకోలేదు: సీఎం రేవంత్

image

TG: తమ ప్రభుత్వం 90 రోజుల్లోనే 30,000 ఉద్యోగాలు భర్తీ చేసి నియామకపత్రాలు అందజేసిందని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ప్రత్యేక తెలంగాణ కోసం నిరుద్యోగులు ఆత్మబలిదానాలు చేసుకున్నారని, కానీ గత ముఖ్యమంత్రి వారిని పట్టించుకోలేదని విమర్శించారు. ఉద్యోగాలు రావాలంటే కేసీఆర్, కేటీఆర్, కవిత, హరీశ్ రావు ఉద్యోగాలు ఊడగొట్టాలని ఆనాడే చెప్పానని గుర్తు చేశారు. తాము 65 రోజుల్లోనే డీఎస్సీ నియామకాలను పూర్తి చేశామన్నారు.

News October 9, 2024

హరియాణా, ఏపీ ఎన్నికల ఫలితాలు ఒకటే: జగన్

image

AP: హరియాణా ఎన్నికలు కూడా AP తరహాలోనే జరిగాయని మాజీ సీఎం వైఎస్ జగన్ అన్నారు. ఈ ఎన్నికల ఫలితాలు ప్రజలను గందరగోళానికి గురి చేస్తున్నాయని పేర్కొన్నారు. ‘అభివృద్ధి చెందిన US, UK, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఫ్రాన్స్, జర్మనీ వంటి దేశాల్లోనే బ్యాలెట్ పద్ధతి ఉపయోగిస్తున్నారు. మనం కూడా అదే విధానానికి వెళ్లడం మంచిది. ఓటర్లలో విశ్వాసం నింపేందుకు న్యాయనిపుణులు ముందుకు రావాలి’ అని ఆయన ట్వీట్ చేశారు.

News October 9, 2024

జానీ మాస్టర్ బెయిల్ పిటిషన్‌పై తీర్పు రిజర్వ్

image

జానీ మాస్టర్ బెయిల్ పిటిషన్‌పై రంగారెడ్డి జిల్లా కోర్టులో వాదనలు పూర్తయ్యాయి. ఈ పిటిషన్‌పై తీర్పును కోర్టు రిజర్వ్ చేసింది. ఈనెల 14న తీర్పును వెల్లడిస్తామని తెలిపింది. అత్యాచారం కేసులో అరెస్టయిన జానీ మాస్టర్ ప్రస్తుతం చంచల్‌గూడ జైలులో ఉన్న సంగతి తెలిసిందే.

News October 9, 2024

‘అన్‌స్టాపబుల్’ షోలో బాలయ్యతో అల్లు అర్జున్!

image

నటసింహం నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా చేస్తోన్న ‘అన్‌స్టాపబుల్’ షోలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పాల్గొన్నట్లు సినీవర్గాలు తెలిపాయి. వీరిద్దరి కాంబోలో ‘పుష్ప’ రిలీజ్ సమయంలో ఓ ఎపిసోడ్ వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా మరోసారి ఆయన పాల్గొని ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇది ‘పుష్ప-2’ రిలీజ్‌కు ముందు విడుదలయ్యే అవకాశం ఉంది. దీనిపై త్వరలోనే ప్రకటన రానున్నట్లు సమాచారం.

News October 9, 2024

GOOD NEWS: ఫోర్టిఫైడ్ రైస్ సప్లై గడువు పెంపు

image

విటమిన్లు కలిపిన ఉచిత ఫోర్టిఫైడ్ రైస్‌ను 2028 వరకు ఇవ్వాలని మోదీ నేతృత్వంలోని క్యాబినెట్ కమిటీ నిర్ణయించింది. PMGKAY, ఇతర వెల్ఫేర్ స్కీంల కింద వీటిని సరఫరా చేసేందుకు ఆమోదించింది. ఇందుకయ్యే పూర్తి ఖర్చు రూ.17,082 కోట్లకు కేంద్రమే భరించనుంది. 2019-21 మధ్య చేసిన హెల్త్ సర్వేలో దేశవ్యాప్తంగా మహిళలు, పిల్లలో రక్తహీనత, విటమిన్ల లోపం ఎక్కువగా ఉందని తేలింది. ఈ బియ్యాన్ని ఫ్రీగా ఇస్తున్న సంగతి తెలిసిందే.

error: Content is protected !!