news

News October 9, 2024

డీఎస్సీ: ఎంత మంది ఎంపికయ్యారంటే?

image

TG: డీఎస్సీ పోస్టుల తుది ఫలితాలను విద్యాశాఖ రిలీజ్ చేసింది. మొత్తం 11 వేల 62 పోస్టులకు గానూ 10,006 మంది అభ్యర్థులను ఎంపిక చేసినట్లు విద్యాశాఖ తెలిపింది. జిల్లాల వారీగా పోస్టుల వివరాలను వెల్లడించింది. మిగిలిన అభ్యర్థుల ఎంపిక పెండింగ్‌లో ఉన్నట్లు పేర్కొంది. ఆ పోస్టుల్లో ఎంపికైన క్యాండిడేట్లు కోర్టు కేసులు, ఇతర కారణాలు ఉండటంతో పెండింగ్‌లో ఉన్నట్లు తెలిపింది.

News October 9, 2024

గత నెల చరిత్రలో రెండో అత్యంత వేడైన సెప్టెంబర్‌: కోపర్నికస్

image

ఈ ఏడాది సెప్టెంబర్ చరిత్రలో రెండో అత్యంత వేడైన సెప్టెంబర్ అని EU వాతావరణ పర్యవేక్షణ సంస్థ కోపర్నికస్(C3S) తెలిపింది. అత్యంత వేడైన సెప్టెంబరు గత ఏడాది నమోదైందని గుర్తుచేసింది. గత నెలలో తీవ్ర వర్షపాతం, అమెరికాలో హెలీన్, తైవాన్‌లో క్రాతన్, యూరప్‌లో బోరిస్ తుఫాన్లు విధ్వంసాన్ని సృష్టించాయని వివరించింది. పర్యావరణ మార్పు కారణంగా పరిస్థితులు వేగంగా దిగజారుతున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది.

News October 9, 2024

ఓలాకు అండగా నిలిచిన హర్ష్ గోయెంకా

image

వివాదంలో చిక్కుకున్న ఓలా ఎలక్ట్రిక్ సంస్థకు వ్యాపారవేత్త హర్ష్ గోయెంకా అండగా నిలిచారు. తాను చిన్న దూరాలు ప్రయాణించేందుకు ఓలా స్కూటర్‌నే వినియోగిస్తానంటూ ట్వీట్ చేశారు. స్టాండప్ కమెడియన్ కునాల్ కమ్రాకు, ఓలా సీఈఓ భవీష్ అగర్వాల్‌కు మధ్య నెట్టింట వాగ్వాదం అనంతరం కేంద్ర వినియోగదారుల రక్షణ సంస్థ(CCPA) ఓలా ఎలక్ట్రిక్‌కు షోకాజ్ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. అటు సంస్థ షేర్లు సైతం 9శాతం పడిపోయాయి.

News October 9, 2024

ఆస్ట్రేలియా సిరీస్‌ ప్రదర్శనలో అతడే టాప్‌లో ఉంటాడు: లారా

image

భారత్-ఆస్ట్రేలియా మధ్య జరగనున్న బోర్డర్-గవాస్కర్ టెస్టు సిరీస్‌లో టీమ్ ఇండియా ఓపెనర్ యశస్వీ జైస్వాల్ అద్భుత ప్రదర్శన చేస్తారని వెస్టిండీస్ క్రికెట్ దిగ్గజం బ్రియాన్ లారా అంచనా వేశారు. ‘ఈసారి BGTలో అందరికంటే యశస్వీ బాగా ఆడతారు. కరీబియన్ దీవుల్లో ఆడినప్పుడు తన ఆటతీరు చూశాను. ఏ పరిస్థితుల్లోనైనా మంచి క్రికెట్ ఆడగల ప్లేయర్. టీమ్ ఇండియానే సిరీస్ గెలుచుకుంటుంది’ అని లారా జోస్యం చెప్పారు.

News October 9, 2024

అక్టోబర్ 9: చరిత్రలో ఈ రోజు

image

1945: భారతీయ సరోద్ విద్వాంసుడు అంజద్ అలీఖాన్ జననం
1962: గాయని ఎస్పీ శైలజ జననం
1967: గెరిల్లా నాయకుడు, క్యూబా విప్లవకారుడు చే గువేరా మరణం
1974: దర్శకుడు వివి వినాయక్ పుట్టినరోజు
2013: నటుడు శ్రీహరి మరణం
✦ ప్రపంచ తపాలా దినోత్సవం

News October 9, 2024

కేంద్ర మంత్రులతో సీఎం చంద్రబాబు భేటీ

image

AP సీఎం చంద్రబాబు నాయుడు కేంద్ర మంత్రులు అమిత్ షా, నిర్మలా సీతారామన్, కుమార స్వామి, నితిన్ గడ్కరీ, హర్దీప్ సింగ్ పూరీతో వేర్వేరుగా సమావేశమయ్యారు. హోం మంత్రి అమిత్ షాతో దాదాపు 40 నిమిషాల పాటు చర్చించారు. విశాఖ ప్లాంట్ పరిరక్షణ కోసం ఉన్న అవకాశాలపై కుమారస్వామితో చర్చించినట్లు తెలిపారు. YCP పాలనలో నాశనమైన వ్యవస్థలను గాడిలో పెడుతూ స్వర్ణాంధ్రప్రదేశ్-2047 డాక్యుమెంట్ తయారుచేస్తున్నామని చెప్పారు.

News October 9, 2024

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

News October 9, 2024

ఒక్క ఫ‌లితంతో అన్ని విమ‌ర్శ‌ల‌కు చెక్ పెట్టిన బీజేపీ!

image

హ‌రియాణా ఎన్నికల ఫలితాలతో ఎన్నో విమ‌ర్శ‌ల‌కు చెక్ పెట్ట‌గ‌లిగామ‌ని BJP భావిస్తోంది. రైతు ఉద్య‌మాలు, నిరుద్యోగంపై యువతలో ఉన్న అసంతృప్తి, అగ్నివీర్‌, కులగణన అంశాల్లో తమ వైఖరిపై ఉన్న విమర్శలను తిప్పికొట్ట‌గ‌లిగామ‌ని రాజకీయ ప్రత్యర్థులకు సందేశం పంపింది. కాంగ్రెస్ రెచ్చగొట్టడం వల్లే ఈ ఆందోళనలు జరిగాయన్నట్టుగా విజయోత్సవ సభలో మోదీ వ్యాఖ్యానించారు. అయితే, ప్రజలు సుపరిపాలనకే ఓటేశారని వాదిస్తోంది.

News October 9, 2024

ఈరోజు నమాజ్ వేళలు

image

తేది: అక్టోబర్ 9, బుధవారం
ఫజర్: తెల్లవారుజామున 4:56 గంటలకు
సూర్యోదయం: ఉదయం 6:08 గంటలకు
జొహర్: మధ్యాహ్నం 12:03 గంటలకు
అసర్: సాయంత్రం 4:20 గంటలకు
మఘ్రిబ్: సాయంత్రం 5:58 గంటలకు
ఇష: రాత్రి 7.11 గంటలకు
నోట్: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

News October 9, 2024

10 గంటల పాటు అజారుద్దీన్‌ను విచారించిన ఈడీ

image

TG: హెచ్‌సీఏలో అక్రమాలు జరిగాయనే ఆరోపణలపై మాజీ అధ్యక్షుడు అజారుద్దీన్‌ను ఈడీ 10 గంటల పాటు విచారించింది. తాను విచారణకు పూర్తిగా సహకరించినట్లు ఆయన తెలిపారు. తనపై పెట్టిన కేసులన్నీ అక్రమమేనని అన్నారు. కుట్రతోనే తనపై కేసులు పెట్టారని దుయ్యబట్టారు.

error: Content is protected !!