news

News October 7, 2024

టెన్త్ అర్హతతో 39,481 ఉద్యోగాలు.. అప్లై చేసుకోండి

image

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ) పోస్టులకు దరఖాస్తు గడువు సమీపిస్తోంది. మొత్తం 39,481 పోస్టులకు అక్టోబర్ 14 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. వయసు 18-23 ఏళ్ల మధ్య ఉండాలి. విద్యార్హత: టెన్త్ పాస్ అయి ఉండాలి. పురుషులకు 35612, మహిళలకు 3869 పోస్టులు ఉన్నాయి. BSF, CISF, CRPF, SSB, ITBP, SSF, ARలో ఉద్యోగాలు భర్తీ చేస్తారు. దరఖాస్తు చేసుకోవాల్సిన సైట్: https://ssc.nic.in/

News October 7, 2024

Work From Home పని వేళలపై చట్టాల్లో అస్పష్టత: CM పినరయి

image

ప్ర‌స్తుతం అమ‌ల్లో ఉన్న కార్మిక చ‌ట్టాలు వ‌ర్క్‌ఫ్రం హోం విధానాల్లో ‘ప‌ని వేళ‌ల్ని’ స్ప‌ష్టంగా నిర్దేశించ‌లేక‌పోతున్నాయ‌ని CM పిన‌ర‌యి విజ‌య‌న్ వ్యాఖ్యానించారు. కేర‌ళ‌కు చెందిన EY సంస్థ ఉద్యోగిని మృతిపై ఆయన అసెంబ్లీలో ప్ర‌క‌ట‌న చేశారు. IT పార్కుల్లో లీజుకు ఉండే కంపెనీలు కార్మిక చ‌ట్టాల‌ను ఉల్లంఘిస్తే ఉద్యోగులు న్యాయ‌ప‌రంగా ఎదుర్కోవ‌చ్చ‌న్నారు. ఉద్యోగుల ఆందోళనలను కేంద్రం దృష్టికి తీసుకెళ్తామన్నారు.

News October 7, 2024

ఐపీఎస్ సునీల్ కుమార్‌పై కేసు నమోదు

image

AP: సీఐడీ మాజీ డీజీ, ఐపీఎస్ అధికారి పీవీ సునీల్ కుమార్‌పై గుంటూరు నగరంపాలెం పీఎస్‌లో కేసు నమోదైంది. ఈ ఏడాది జులై 12న రాష్ట్ర ప్రభుత్వంపై ఆయన సోషల్ మీడియాలో అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని ఎమ్మెల్యే రఘురామ కృష్ణరాజు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సునీల్ వ్యాఖ్యలు ప్రవర్తనా నియమావళికి విరుద్ధంగా ఉన్నాయని ప్రభుత్వం అభియోగ పత్రంలో పేర్కొంది. 15 రోజుల్లోగా సమాధానం ఇవ్వాలని ఆయనను ఆదేశించింది.

News October 7, 2024

హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ పడిపోయింది: KTR

image

హైడ్రా భయంతో హైదరాబాద్‌లో రెండు నెలల్లో రియల్ ఎస్టేట్ పడిపోయి రిజిస్ట్రేషన్ల ఆదాయం తగ్గిందని కేటీఆర్ విమర్శించారు. ‘ప‌నిమంతుడని పందిరేపిస్తే పిల్లి తోక త‌గిలి కూలింద‌ట‌. గ‌ట్ల‌నే ఉంది చీప్ మినిస్ట‌ర్ రేవంత్ రెడ్డి తీరు. HYDని కాపాడుకోవ‌టం చేత‌కాక‌ బుల్డోజ‌ర్స్ పంపి భ‌యాన్ని సృష్టించాడు. దీంతో రాష్ట్రానికి వ‌చ్చే ఆదాయం ప‌డిపోయింది. ఆదాయం సృష్టించకుండా ఉన్నది ఊడగొడుతున్నవ్’ అని ట్వీట్ చేశారు.

News October 7, 2024

చెరువులపై సమగ్ర అధ్యయనం.. 3 నెలల్లో సర్వే పూర్తికి ఆదేశం

image

TG: HMDA పరిధిలోని చెరువులపై సమగ్ర అధ్యయనం చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. 3 నెలల్లో సర్వే పూర్తి చేసి చెరువుల విస్తీర్ణం, FTL, బఫర్ జోన్లను గుర్తించాలని అధికారులను ఆదేశించింది. సర్వే పూర్తయ్యాక ఆ వివరాలన్నింటినీ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

News October 7, 2024

అద్భుతమైన ఫొటోలు

image

చెన్నై మెరీనా బీచ్‌లో జరిగిన ఎయిర్ షోకు లక్షలాదిగా జనం తరలివచ్చిన విషయం తెలిసిందే. ఎయిర్ షోలో ఆకాశం మీద నుంచి జెట్ విమానాలను తీసిన ఫొటోలు తాజాగా వైరలవుతున్నాయి. సముద్రం, పక్కనే చెపాక్ క్రికెట్ స్టేడియం, పొగలు కక్కుతూ దూసుకెళ్తోన్న జెట్స్ ఆకట్టుకుంటున్నాయి. ఈ ఫొటోల్లో చెన్నై అందాలు కనిపిస్తున్నాయని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. అయితే, ఈ ఎయిర్ షోకు భారీగా జనం పోటెత్తడంతో ఐదుగురు మరణించారు.

News October 7, 2024

నాలుగు నెలల్లో స్టార్ హీరో సినిమా పూర్తి!

image

తమిళ స్టార్ హీరో సూర్య, కార్తీక్ సుబ్బరాజు కాంబోలో రాబోతున్న ‘SURIYA44’ షూటింగ్ పూర్తయింది. కేవలం నాలుగు నెలల్లోనే ఈ చిత్రాన్ని పూర్తి చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఈ ఏడాది మార్చి 28న ఈ సినిమాను అనౌన్స్ చేయగా జూన్ 2న షూటింగ్ ప్రారంభించారు. నిన్న షూటింగ్ కంప్లీట్ చేశారు. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోని చాలా మంది డైరెక్టర్లు కార్తీక్‌ను చూసి నేర్చుకోవాలని నెటిజన్లు సూచిస్తున్నారు.

News October 7, 2024

అంతకు మించి ఏర్పాట్లు చేశాం: స‌్టాలిన్‌

image

చెన్నై మెరీనా బీచ్‌లో ఎయిర్ షో నిర్వ‌హ‌ణ‌కు సంబంధించి ఎయిర్ ఫోర్స్ కోరిన ఏర్పాట్ల‌కు మించి వ‌స‌తులు క‌ల్పించిన‌ట్టు CM స్టాలిన్ తెలిపారు. షో సంద‌ర్భంగా వేడి సంబంధిత కార‌ణాల వల్ల ఐదుగురు మ‌ర‌ణించిన విషయం తెలిసిందే. ఊహించిన దాని కంటే పెద్ద‌సంఖ్య‌లో ప్ర‌జ‌లు రావ‌డంతో తిరుగు ప్రయాణంలో వారు ఇబ్బందులుప‌డిన‌ట్టు తెలిసింద‌న్నారు. భ‌విష్య‌త్తులో ఇలాంటి భారీ ఈవెంట్లకు మరిన్ని జాగ్ర‌త్త‌లు తీసుకుంటామ‌న్నారు.

News October 7, 2024

చెరువుల ఆక్రమణలను గుర్తిస్తున్నాం: భట్టి విక్రమార్క

image

TG: హైడ్రాను సాకుగా చూపి రాష్ట్ర ప్రభుత్వంపై ప్రతిపక్ష నేతలు విమర్శలు చేస్తున్నారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మండిపడ్డారు. ‘ప్రజా సంక్షేమమే మా ధ్యేయం. మాకు ఎలాంటి వ్యక్తిగత అజెండా లేదు. కొందరు తప్పుడు ఆరోపణలతో ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారు. HYD అంటేనే రాక్స్, లేక్స్, పార్క్స్. శాటిలైట్ మ్యాప్‌ల ద్వారా చెరువుల ఆక్రమణలను గుర్తిస్తున్నాం’ అని ప్రెస్‌మీట్‌లో తెలిపారు.

News October 7, 2024

Stock Market: మళ్లీ నష్టాలు

image

FIIల అమ్మకాలు, మిడిల్ ఈస్ట్‌లో యుద్ధ భయాలతో బెంచ్‌మార్క్ ఈక్విటీ సూచీలు సోమ‌వారం కూడా భారీ న‌ష్టాలు చ‌విచూశాయి. సెన్సెక్స్ 638 పాయింట్ల న‌ష్టంతో 81,050 వ‌ద్ద‌, నిఫ్టీ 218 పాయింట్ల న‌ష్టంతో 24,795 వ‌ద్ద స్థిర‌ప‌డ్డాయి. ఉద‌యం గ్యాప్ అప్‌తో ప్రారంభ‌మైన సూచీలు ఏ ద‌శ‌లోనూ కోలుకోలేదు. 24,800 వ‌ద్ద నిఫ్టీకి మ‌ద్ద‌తు దొరికినా 25,000 వ‌ద్ద ఉన్న బ‌ల‌మైన రెసిస్టెన్స్ సూచీని మ‌ళ్లీ న‌ష్టాల్లోకి నెట్టింది.

error: Content is protected !!