India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
తెలంగాణలోని 8 జిల్లాల్లో రానున్న 2 గంటల్లో వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. వికారాబాద్, వరంగల్, హన్మకొండ, కొత్తగూడెం, భూపాలపల్లి, ఖమ్మం, మహబూబాబాద్, ములుగు జిల్లాల్లో మోస్తరు వర్షం కురవనుందని పేర్కొంది. మరోవైపు హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో ఇప్పటికే వాన పడింది.
తెలంగాణలో పంట రుణమాఫీ పూర్తిగా కాలేదని ప్రధాని మోదీ నిన్న చేసిన వ్యాఖ్యలపై సీఎం రేవంత్ స్పందించారు. రూ.2లక్షల లోపు పంట రుణాలన్నీ మాఫీ చేశామన్నారు. 22,22,067 మంది రైతులకు రూ.17,869.22కోట్లు మాఫీ జరిగిందని, అందుకు సంబంధించిన పత్రాలను ట్వీట్ చేశారు. ‘కాంగ్రెస్ గ్యారంటీ అంటే గోల్డెన్ గ్యారంటీ’ అని రైతులు విశ్వసించారని రేవంత్ అన్నారు. తెలంగాణ రైతుల సంక్షేమం కోసం కేంద్రం నుంచి సహకారం కావాలన్నారు.
TG: ‘మూసీ కూల్చివేతల’పై CM రేవంత్‌కు BJP MP ఈటల లేఖ రాశారు. ‘మూసీ సుందరీకరణ పేరిట మాల్స్ కట్టి పెద్దలకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తావా? మూసీ ప్రక్షాళనకు మీ యాక్షన్ ప్లాన్ ఏంటి? DPR ఉందా? ఇళ్లు కోల్పోతున్న వారికి ప్రత్యామ్నాయం ఏంటి? రూ.కోట్ల విలువ చేసే ఇళ్లు కూల్చేసి డబుల్ బెడ్రూం ఇస్తా అంటే ఎలా? అంతపెద్ద గంగా ప్రక్షాళనకే రూ.22వేల కోట్లు ఖర్చు. మూసీకి రూ.1.50లక్షల కోట్లెందుకు?’ అని ప్రశ్నించారు.
గ్లామర్ పేరుతో శరీరాన్ని చూపించడం తనకు ఇష్టం లేదని హీరోయిన్ ప్రియా భవానీ శంకర్ అన్నారు. తన శరీరాన్ని ఒక వస్తువుగా భావించనని చెప్పారు. ‘కెరీర్ పరంగా ఎప్పుడైనా వెనుదిరిగి చూసుకుంటే నేను ఏ విషయంలోనూ బాధపడకూడదు. అందుకు అనుగుణంగా ఇప్పుడే నిర్ణయాలు తీసుకుంటా. అలాగే ఫ్యాషన్ పేరుతో కొన్నింటిని ప్రమోట్ చేయను’ అని ఆమె తెగేసి చెప్పారు. కాగా ప్రియా భవానీ ‘కళ్యాణం కమనీయం’, ‘రత్నం’ తదితర చిత్రాల్లో నటించారు.
విమానయాన సంస్థల సిబ్బంది ప్రయాణికుల లగేజీపై ఎంత నిర్లక్ష్యం ప్రదర్శిస్తారన్నది సామాన్యులకు తెలిసిందే. ఈ అనుభవం ఇప్పుడు స్టార్ హాకీ క్రీడాకారిణి రాణీ రాంపాల్‌కు ఎదురైంది. ఇటీవల అమె Air India విమానంలో కెనాడా నుంచి ఢిల్లీ వచ్చారు. అయితే, ఆమె లగేజీ ధ్వంసమవ్వడంపై మండిపడ్డారు. ‘మీ అద్భుతమైన బహుమానానికి ధన్యవాదాలు. మీ సిబ్బంది మా బ్యాగ్‌లను ఇలా చూస్తారు?’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
AP: మాజీ సీఎం, బీజేపీ నేత కిరణ్ కుమార్ రెడ్డి సీఎం చంద్రబాబును కలిశారు. హైదరాబాద్‌లో చంద్రబాబు నివాసంలో వీరిద్దరూ భేటీ అయ్యారు. దాదాపు అరగంటపాటు ఇరువురూ చర్చించారు. ఇటీవల కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కూడా కిరణ్ కలిశారు. ఈ నేపథ్యంలో చంద్రబాబును కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది.
ఓ యానిమేషన్ సినిమా వసూళ్ల పరంగా చరిత్ర సృష్టించింది. నవ్వులు, జీవిత పాఠాలు, జీవితాంశాల ఆధారంగా తెరకెక్కిన Inside Out-2 ప్రపంచ వ్యాప్తంగా ₹14,002 కోట్ల వసూళ్లతో అత్యధిక వసూళ్లు రాబట్టిన యానిమేషన్ చిత్రంగా నిలిచింది. పిక్సర్ యానిమేషన్స్ నిర్మించిన ఈ చిత్రానికి కెల్సీ మన్ దర్శకుడు. హాట్ స్టార్‌లో స్ట్రీమ్ అవుతున్న ఈ చిత్రానికి హిందీ వెర్షన్‌లో రిలే పాత్రకు బాలీవుడ్ నటి అనన్య పాండే డబ్బింగ్ చెప్పారు.
మానవాళి ఉజ్వల భవిష్యత్తు కోసం ప్రపంచ శాంతి అత్యవసరమని ప్రధాని మోదీ పునరుద్ఘాటించారు. దేశాల మధ్య ఐక్యత, భాగస్వామ్యం ద్వారానే సామూహిక ప్రయత్నాల విజయం ఆధారపడి ఉందన్నారు. ICJ-ICWకు రాసిన లేఖలో ప్రధాన న్యాయమూర్తులు, మంత్రులు, న్యాయమూర్తులు, పార్లమెంటు సభ్యులు, రచయితలు, సంపాదకులు, న్యాయ విద్యావేత్తల భాగస్వామ్యం ప్రపంచ శాంతికి విధానాల రూపకల్పనలో కీలకమని పేర్కొన్నారు.
ఖైరతాబాద్ గణేశ్ విగ్రహం మాదిరిగా ప్రపంచంలోనే అతిపెద్ద దుర్గామాత విగ్రహాన్ని హైదరాబాద్‌లో నెలకొల్పారు. కోఠిలోని సాయిబాబా ఆలయం సమీపంలో ఉన్న విక్టరీ ప్లే గ్రౌండ్‌లో ఏకంగా 65 అడుగుల ఎకో ఫ్రెండ్లీ దుర్గామాత విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. అమ్మవారు సింహ వాహనంపై మహాశక్తి అవతారంలో కనిపిస్తున్నారు. ఖైరతాబాద్ గణేశ్ లానే దుర్గామాత విగ్రహాన్ని కూడా ఉన్నచోటే తయారు చేయించారు.
TGలో పలు జిల్లాల గ్రంథాలయ సంస్థలకు ఛైర్మన్లను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. గద్వాల – N.శ్రీనివాసులు, MBNR – మల్లు నర్సింహారెడ్డి, వికారాబాద్ – శేరి రాజేశ్‌రెడ్డి, నారాయణపేట్ – వరాల విజయ్, కామారెడ్డి – మద్ది చంద్రకాంత్‌రెడ్డి, సంగారెడ్డి – G.అంజయ్య, వనపర్తి – G.గోవర్ధన్, RR – ఎలుగంటి మధుసూదన్‌రెడ్డి, కరీంనగర్ – సత్తు మల్లయ్య, నిర్మల్ – సయ్యద్ అర్జుమాండ్ అలీ, సిరిసిల్ల – నాగుల సత్యనారాయణ.
Sorry, no posts matched your criteria.