news

News February 28, 2025

బీఆర్ఎస్ SLBCని ఎందుకు పూర్తిచేయలేదు: జూపల్లి

image

రాజకీయ దురుద్దేశంతోనే హరీశ్ రావు SLBC ప్రమాదంపై కుట్రపూరిత విమర్శలు చేస్తున్నారని మంత్రి జూపల్లికృష్ణారావు విమర్శించారు. బీఆర్ఎస్ పాలనలో SLBC టన్నెల్‌ని 100మీటర్లు తవ్వి ఎందుకు వదిలేశారని సూటి ప్రశ్నవేశారు. ఎకరాకు రూ.లక్ష ఖర్చయ్యే టన్నెల్‌ను పూర్తి చేయకుండా రూ.3లక్షలయ్యే కాళేశ్వరం పనులు ఎందుకు చేపట్టారన్నారు. ప్రాజెక్ట్ పూర్తయితే కాంగ్రెస్‌కు పేరు వస్తుందని BRS అక్కసు వెల్లగక్కుతోందన్నారు.

News February 28, 2025

అఫ్గాన్‌కు మ్యాక్స్‌వెల్ గండం?

image

ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా మరికాసేపట్లో ఆస్ట్రేలియా, అఫ్గానిస్థాన్ తలపడనున్నాయి. ICC మెగా టోర్నీల్లో మ్యాక్సీ వీరవిహారం చేస్తూ అఫ్గాన్‌కు పీడకల మిగిలిస్తున్నారు. అఫ్గాన్‌పై CWC 2015లో 88, T20 WC 2022లో 54*, CWC 2023లో 201*, టీ20 WC 2022లో 59 రన్స్ బాదారు. దీంతో మరోసారి అతడి బారిన పడకుండా అఫ్గాన్ వ్యూహాలు రచిస్తోంది. ఎలాగైనా ఆయనను తక్కువ స్కోరుకే కట్టడి చేయాలని భావిస్తోంది.

News February 28, 2025

EPFO వడ్డీరేటు ఫిక్స్.. ఎంతంటే!

image

FY2024-25కి గాను EPFO వడ్డీరేటును 8.25% ఇవ్వాలని బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ నిర్ణయించినట్టు తెలిసింది. స్టాక్‌మార్కెట్ల పతనం, బాండు యీల్డులు తగ్గడంతో వడ్డీ తగ్గిస్తారని వార్తలు వచ్చినప్పటికీ బోర్డు యథాతథంగానే ఉంచినట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి.

News February 28, 2025

కిషన్ రెడ్డికి CM రేవంత్ బహిరంగ లేఖ

image

TG: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి CM రేవంత్ 9 పేజీల బహిరంగ <>లేఖ<<>> రాశారు. ప్రభుత్వ వినతులను పట్టించుకోవడం లేదని తేదీలతో సహా ఆయన ప్రస్తావించారు. హైదరాబాద్ మెట్రో ఫేజ్-2పై 2024, నవంబర్ 4న కేంద్ర ప్రభుత్వానికి డీపీఆర్ సమర్పించినా స్పందన లేదని మండిపడ్డారు. మూసీ పునరుజ్జీవంపైనా అదే తీరని పేర్కొన్నారు. ఇకనైనా TGకు సంబంధించి రూ.1,63,559.31కోట్ల ప్రాజెక్టుల అనుమతులు, నిధుల మంజూరుకు శ్రద్ధ వహించాలని లేఖలో రేవంత్ కోరారు.

News February 28, 2025

NEP వైపే యువత మెుగ్గు: తమిళనాడు గవర్నర్

image

హిందీపై వ్యతిరేకత పేరుతో ఇతర దక్షిణ భారత భాషల్లోనూ విద్యార్థులను చదువుకోనివ్వడం లేదని తమిళనాడు గవర్నర్ RN రవి అన్నారు. దీని వల్ల ఇతర ప్రాంతాలతో పోలిస్తే ఇక్కడి యువత అధికంగా ఉద్యోగావకాశాలను కోల్పోతోందన్నారు. రాష్ట్రంలో మెజార్టీ యువత NEPని అమలు చేయాలని కోరుతోందని తెలిపారు. కాగా తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ NEPతో పాటు డీలిమిటేషన్‌కు వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే.

News February 28, 2025

నితీశ్‌కుమార్ ఫిట్‌గా లేడు : ప్రశాంత్ కిషోర్ ‌

image

బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ శారీరకంగా అలసిపోగా, మానసికంగా రిటైర్డ్ అయ్యారని జన్‌సూరజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిషోర్ అన్నారు. సరైన సంఖ్యాబలం లేకున్నా పొత్తులతోనే సీఎంగా కొనసాగుతున్నారని విమర్శించారు. రాబోయే ఎన్నికల్లో జేడీయూ ఒక్కసీటూ గెలవదని జోస్యం చెప్పారు. ఏప్రిల్‌లో జన్‌సూరజ్ పార్టీ పెద్దఎత్తున ర్యాలీ చేపట్టనుందని తెలిపారు. ఈఎన్నికల్లో తమ పార్టీ సంచలనం సృష్టించటం ఖాయమని పేర్కొన్నారు.

News February 28, 2025

మార్చి 30న ఉగాది అవార్డులు

image

AP: ఉగాది వేడుకల సందర్భంగా మార్చి 30న రాష్ట్ర సృజనాత్మక, సాంస్కృతిక సమితి ఆధ్వర్యంలో పురస్కారాలు అందజేయనున్నారు. వివిధ కళారంగాల్లో నిష్ణాతులు, కవులను కళారత్న, ఉగాది పురస్కారాలతో సత్కరించనున్నట్లు ఆ సమితి CEO మల్లికార్జునరావు తెలిపారు. దరఖాస్తులను MAR 15వ తేదీ లోపు విజయవాడలోని ఘంటసాల వెంకటేశ్వరరావు ప్రభుత్వ సంగీత డాన్స్ కాలేజీలో నేరుగా లేదా apculture.ugadi2025@gmail.comకు పంపొచ్చు.

News February 28, 2025

ఏపీ వ్యవసాయ బడ్జెట్ ఎంతంటే?

image

AP: రూ.48,340కోట్లతో మంత్రి అచ్చెన్నాయుడు అసెంబ్లీలో వ్యవసాయ బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘వ్యవసాయం లాభదాయకంగా ఉంటేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. వ్యవసాయ రంగంలో 15శాతం వృద్ధి మా టార్గెట్. కొత్త కౌలు చట్టం తీసుకొస్తాం. రైతులకు ప్రత్యేక గుర్తింపు సంఖ్యలు కేటాయించి పథకాలు అమలు చేస్తాం’ అని మంత్రి అన్నారు. ఇక్కడ <>క్లిక్<<>> చేసి పూర్తిస్థాయి వ్యవసాయ బడ్జెట్ గురించి తెలుసుకోండి.

News February 28, 2025

నేషనల్ సైన్స్ డే!

image

నేడు నేషనల్ సైన్స్ డే. 1928 FEB 28న శాస్త్రవేత్త సీవీ రామన్ భౌతిక శాస్త్ర పరిశోధనలను మలుపు తిప్పిన ‘రామన్​ ఎఫెక్ట్​’ను కనుగొన్నారు. ఈ పరిశోధనతో CVRను నోబెల్ అవార్డూ వరించింది. ఆయన సేవలను గుర్తించిన భారత ప్రభుత్వం.. 1987 నుంచి ఏటా సైన్స్ డేను నిర్వహిస్తోంది. ఈ ఏడాది ‘ఎంపవరింగ్ ఇండియన్ యూత్ ఫర్ గ్లోబల్ లీడర్​షిప్ ఇన్ సైన్స్ అండ్ ఇన్నోవేషన్ ఫర్ ఏ డెవలప్డ్ ఇండియా’ థీమ్‌తో సైన్స్ డే జరుపుకుంటున్నాం.

News February 28, 2025

3 నెలల్లో 17వేల కి.మీ. రోడ్లకు మరమ్మతులు: పయ్యావుల

image

AP: గత ప్రభుత్వ నిర్లక్ష్యం, నిర్వహణ లోపంతో రాష్ట్ర రహదారులు అధ్వానంగా తయారయ్యాయని పయ్యావుల కేశవ్ ఆరోపించారు. కూటమి ప్రభుత్వం ఆ రహదారుల పునరుద్ధరణ చేపట్టిందన్నారు. ‘మిషన్-గుంతలు లేని రహదారుల ఆంధ్ర’ కింద 3 నెలల్లోనే 17,605కి.మీ. రోడ్లకు మరమ్మతులు చేసిందని చెప్పారు. అలాగే జిల్లా కేంద్రాల నుంచి వాటికి ఆనుకొని ఉన్న మండల కేంద్రాలకు 2 వరుసల రహదారి అనుసంధాన పనులు చేపడుతున్నట్లు వివరించారు.