news

News October 4, 2024

ఆ మ్యాప్‌ను తొలగించిన ఇజ్రాయెల్

image

జమ్మూకశ్మీర్‌లోని కొంత భాగాన్ని పాకిస్థాన్ భూభాగంగా తప్పుగా చిత్రీకరించిన భారత మ్యాప్‌ను ఇజ్రాయెల్ తొలగించింది. దీనిపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వ్య‌తిరేక‌త రావ‌డంతో ఇజ్రాయెల్ త‌న అధికార వెబ్‌సైట్ నుంచి దాన్ని తొలగించింది. దీనిపై భారత్‌లో ఇజ్రాయెల్ రాయబారి రూవెన్ అజార్ మాట్లాడుతూ ‘ఇది వెబ్‌సైట్ ఎడిటర్ పొరపాటు. దీన్ని గుర్తించినందుకు ధన్యవాదాలు. మ్యాప్‌ను తొల‌గించాం’ అని తెలిపారు.

News October 4, 2024

పవన్ కళ్యాణ్‌పై ప్రకాశ్ రాజ్ పరోక్ష ట్వీట్

image

నటుడు ప్రకాశ్ రాజ్ మరోసారి పవన్ కళ్యాణ్‌ను ఉద్దేశిస్తూ పరోక్షంగా ట్వీట్ చేశారు. ‘స‌నాత‌న ధ‌ర్మ ర‌క్ష‌ణ‌లో మీరుండండి. స‌మాజ ర‌క్ష‌ణ‌లో మేముంటాం. జ‌స్ట్ ఆస్కింగ్‌’ అని ట్వీట్‌లో పేర్కొన్నారు. నిన్న వారాహి డిక్లరేషన్‌ సందర్భంగా సనాతన ధర్మం గురించి AP డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడిన విషయం తెలిసిందే. ఆ సందర్భంగా ‘నేనో పెద్ద సనాతన హిందువుని’ అని పవన్ ప్రకటించారు.

News October 4, 2024

వారం రోజులకు ‘దేవర’ కలెక్షన్లు ఎంతంటే?

image

ఎన్టీఆర్, జాన్వీ కపూర్ జంటగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘దేవర’. గత నెల 27న థియేటర్లలో విడుదలైన ఈ మూవీ 7 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.405 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టినట్లు చిత్ర యూనిట్ ట్వీట్ చేసింది. ఇందులో ఎన్టీఆర్ డ్యుయల్ రోల్ చేయగా ప్రకాశ్ రాజ్, సైఫ్ అలీ ఖాన్, మురళీ శర్మ వంటి నటులు కీలక పాత్రలు పోషించారు.

News October 4, 2024

అత్యుత్తమ వైద్య సదుపాయాలున్న దేశాలు!

image

CEO వరల్డ్ మ్యాగజైన్ విడుదల చేసిన హెల్త్ కేర్ ఇండెక్స్-2024 ప్రకారం 100కి 78.72 స్కోరుతో తైవాన్ దేశం అత్యుత్తమ వైద్య సదుపాయాలను కలిగి ఉంది. ఆరోగ్య సంరక్షణ, మౌలిక సదుపాయాలు, వైద్య సిబ్బంది అందుబాటుపై సర్వే చేసి ప్రతి దేశానికి స్కోరునిచ్చారు. దక్షిణ కొరియా(77.7), ఆస్ట్రేలియా(74.11), కెనడా(71.32), స్వీడన్(70.73) టాప్-5లో ఉన్నాయి. కాగా, ఇండియాకు 45.84 స్కోర్ లభించింది.

News October 4, 2024

విజయ్ ‘దళపతి 69’ షురూ

image

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ ఆఖరి చిత్రం ‘దళపతి69’ పూజా కార్యక్రమం చెన్నైలో గ్రాండ్‌గా జరిగింది. త్వరలోనే ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లనున్నట్లు తెలుస్తోంది. 2025లో ఈ మూవీని విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నట్లు సమాచారం. హెచ్ వినోద్ తెరకెక్కించనున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తారు. బాబీ డియోల్, గౌతమ్ మీనన్, ప్రియమణి, ప్రకాశ్ రాజ్ కీలక పాత్రలు పోషిస్తారు. అనిరుధ్ సంగీతం అందిస్తారు.

News October 4, 2024

ఎవరు పెద్ద హీరో?.. సురేశ్ బాబు సమాధానమిదే

image

టాలీవుడ్‌లో బిగ్ స్టార్ ఎవరు? అనే ప్రశ్నకు ఓ ఇంటర్వ్యూలో నిర్మాత సురేశ్ బాబు ఆసక్తికర సమాధానమిచ్చారు. ‘కలెక్షన్ల ఆధారంగా హీరోల స్థాయిని నిర్ణయించలేం. పవన్ కళ్యాణ్, ప్రభాస్, అల్లు అర్జున్ తదితర హీరోల సినిమాలకు భారీ ఓపెనింగ్స్ వస్తాయి. కానీ ఏంతీసినా ప్రేక్షకులు చూస్తారని అనుకోకూడదు. వారి సినిమాలు కొన్ని అంచనాలను అందుకోలేదు. తెలుగులో రూ.100 కోట్లు సాధించే హీరోలు చాలామంది ఉన్నారు’ అని పేర్కొన్నారు.

News October 4, 2024

రేవంత్ మొనగాడు కాదు.. మోసగాడు: హరీశ్

image

TG: దేవుళ్లపై ఒట్లు వేసి మాట తప్పిన సీఎం రేవంత్ మొనగాడు కాదు, మోసగాడని BRS మాజీ మంత్రి, MLA హరీశ్‌రావు విమర్శించారు. కుంటిసాకుతో రుణమాఫీ ఎగ్గొట్టి, ఆరు గ్యారంటీల పేరుతో ప్రజలను మోసం చేశారని దుయ్యబట్టారు. దసరాలోపు రైతుబంధు పడకపోతే వదిలే ప్రసక్తే లేదని హెచ్చరించారు. హైడ్రా పేరుతో పేదల ఇళ్లు కూల్చే హక్కు ఎవరిచ్చారని ప్రశ్నించారు. దసరా తర్వాత రాహుల్ గాంధీ ఇంటిని ముట్టడిస్తామని అన్నారు.

News October 4, 2024

జగన్‌తో దీక్ష చేయించగలరా?: భూమనకు బీజేపీ నేత సవాల్

image

AP: పవన్ కళ్యాణ్ దీక్షపై విమర్శలు చేయడం సరికాదని బీజేపీ నేత భాను ప్రకాశ్ ఫైర్ అయ్యారు. పవన్‌ను స్వామి అని సంభోధించిన భూమన కరుణాకర్ రెడ్డి వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తన పార్టీ అధినేతతో భూమన దీక్ష చేయించగలరా? అని సవాల్ విసిరారు. హిందూ సంప్రదాయాల ప్రకారం జగన్‌తో ఇంట్లో పూజలు చేయించగలిగే సత్తా భూమనకు ఉందా అని ప్రశ్నించారు. హిందూ మత విశ్వాసాలను గౌరవించని వ్యక్తి జగన్ అని విమర్శించారు.

News October 4, 2024

అక్రమమైతే నా ఫామ్‌హౌస్‌ను నేనే కూలుస్తా: కేవీపీ

image

TG: సీఎం రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ సీనియర్ నేత కేవీపీ రామచంద్రరావు లేఖ రాశారు. తన ఫామ్ హౌస్‌కు అధికారులను పంపించాలని, FTL, బఫర్ జోన్‌లో నిర్మాణం ఉంటే మార్క్ చేయాలని కోరారు. అది అక్రమ నిర్మాణమైతే సొంత ఖర్చులతో కూల్చేస్తానన్నారు. తనకు చట్టం నుంచి ఎలాంటి మినహాయింపులు వద్దని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎలాంటి చెడ్డపేరు రాకూడదని, అలా వస్తే తన కాంగ్రెస్ రక్తం సహించదు అని అన్నారు.

News October 4, 2024

జాబులు పోవాలంటే చంద్రబాబే కదా రావాలి: VSR

image

AP: జాబులు పోవాలంటే ఎవరు రావాలి? చంద్రబాబే కదా? అని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు. స్టీల్ ప్లాంట్‌లో తొలి విడతగా 4వేల మంది కాంట్రాక్ట్ ఉద్యోగులను తొలగించారని అన్నారు. సంపద సృష్టి? బాబు వస్తే జాబు? అంటే ఇదేనా తెలుగు తమ్ముళ్లూ అంటూ Xలో పోస్ట్ చేశారు. ఇది ప్రైవేటీకరణకు మొదటి మెట్టు కాదా చంద్రబాబు? అని ప్రశ్నించారు.

error: Content is protected !!