India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

AP: సినీనటుడు పోసాని కృష్ణమురళిని పోలీసులు రాజంపేట సబ్ జైలుకు తరలించారు. అక్కడ ఆయనకు జైలు అధికారులు 2261 నంబర్ కేటాయించారు. పోసాని కోసం జైలులో ఓ గది ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. కాగా పోసానికి కేటాయించిన నంబర్లను కలిపితే 11 వస్తోందంటూ టీడీపీ కార్యకర్తలు సోషల్ మీడియాలో సెటైర్లు వేస్తున్నారు. వైసీపీకి ఆ నంబర్ కలిసొచ్చిందంటూ జోకులు వేసుకుంటున్నారు.

దేశీయ స్టాక్‌మార్కెట్లు భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. మెక్సికో, కెనడా, చైనాపై టారిఫ్స్ మార్చి 4 నుంచి అమల్లోకి వస్తాయని ట్రంప్ ప్రకటించడం నెగటివ్ సెంటిమెంటుకు దారితీసింది. నిఫ్టీ 22,265 (-280), సెన్సెక్స్ 73,690 (-930) వద్ద ట్రేడవుతున్నాయి. ఆటో, ఐటీ, మీడియా, మెటల్, ఫార్మా, హెల్త్‌కేర్, బ్యాంక్స్, O&G షేర్లు విలవిల్లాడుతున్నాయి. కోల్ ఇండియా, శ్రీరామ్ ఫైనాన్స్, రిలయన్స్, గ్రాసిమ్ టాప్ గెయినర్స్.

పాకిస్థాన్ క్రికెట్ టీమ్ పాతాళానికి పడిపోయింది. ఐసీసీ ఈవెంట్లలో ఆ జట్టు ఆటతీరు దారుణంగా తయారైంది. చివరి మూడు ఐసీసీ ఈవెంట్లలో (2023 వన్డే ప్రపంచకప్ నుంచి) ఎక్కువ విజయాలు సాధించిన ఆసియా జట్లలో భారత్ (20) టాప్‌లో ఉంది. ఆ తర్వాత అఫ్గానిస్థాన్ (10), పాకిస్థాన్ (6), బంగ్లాదేశ్ (5), శ్రీలంక (3) ఉన్నాయి. దీంతో ఇక నుంచి ఆసియాలో సెకండ్ బెస్ట్ జట్టు అఫ్గాన్ అని నెటిజన్లు అభినందిస్తున్నారు.

అమెజాన్ ఫౌండర్ జెఫ్ బెజోస్ ప్రియురాలు లారెన్ సాంచెజ్ అంతరిక్ష యాత్రకు సిద్ధమయ్యారు. బ్లూ ఆరిజిన్ చేపట్టనున్న స్పేస్ ట్రిప్‌కు మరికొందరు మహిళలతో కలిసి ఆమె వెళ్లనున్నారు. ఐషా బో, కరియాన్నే ఫిన్, గాలే కింగ్, అమాండా గుయేన్, కేటీ పెర్రీలతో కలిసి ఆమె అంతరిక్షంలో విహరించనున్నారు. కాగా జెఫ్ బెజోస్‌కే చెందిన బ్లూ ఆరిజన్ సంస్థ 2021 నుంచి సంపన్న పర్యాటకులను స్పేస్ ట్రిప్‌కు తీసుకెళ్తున్న విషయం తెలిసిందే.

AP: ఎన్టీఆర్ భరోసా పథకం కింద అందిస్తున్న పెన్షన్ల పంపిణీ సమయానికి సంబంధించి ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. అధికారుల ఒత్తిడితో చాలా మంది తెల్లవారుజామున 4 నుంచే పంపిణీ చేస్తుండగా ఉద్యోగులతో పాటు ప్రజలూ ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఉదయం 7 గంటల నుంచి పెన్షన్ల పంపిణీ ప్రారంభించాలని ప్రభుత్వం జిల్లా అధికారులను ఆదేశించింది. ఆ సమయానికే యాప్ పని చేసేలా మార్పులు చేసింది.

AP: రూ.3.24లక్షల కోట్ల రాష్ట్ర బడ్జెట్‌కు సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలోని క్యాబినెట్ ఆమోదం తెలిపింది. కాసేపట్లో మంత్రి పయ్యావుల కేశవ్ అసెంబ్లీలో వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. అంతకుముందు ఆయన వెంకటాయపాలెంలోని వేంకటేశ్వరస్వామి ఆలయానికి వెళ్లి దర్శనం చేసుకున్నారు. బడ్జెట్ ప్రతులను స్వామివారి పాదాల వద్ద ఉంచి పూజలు చేశారు. అనంతరం వాటిని సీఎం, డిప్యూటీ సీఎంకు అందజేశారు.

తెలంగాణ జనాభా లెక్కల్లో మీ భాగస్వామ్యం ఉండాలంటే కులగణన సర్వేలో పాల్గొనాలని మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు. రీసర్వే గడువు నేటితో ముగుస్తుందని చెప్పారు. టోల్ ఫ్రీ నంబర్ 040-21111111కు కాల్ చేస్తే ఎన్యుమరేటర్లు ఇంటికి వచ్చి వివరాలు నమోదు చేస్తారని తెలిపారు. ఎంపీడీవో, వార్డు ఆఫీసులతో పాటు seeepcsurvey.cgg.gov.in ద్వారా కూడా సమాచారాన్ని ఇవ్వొచ్చని వివరించారు.

టీమ్ ఇండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ దుబాయ్‌లో ఎంజాయ్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఓ దివ్యాంగుడితో ఆయన సెల్ఫీ దిగారు. ఇందుకు సంబంధించిన పిక్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన ఆయన ఫ్యాన్స్ డౌన్ టు ఎర్త్ స్వభావాన్ని మెచ్చుకుంటున్నారు. కాగా పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచులో విరాట్ అద్భుత సెంచరీతో చెలరేగిన విషయం తెలిసిందే.

క్రిప్టో కరెన్సీ మోసం కేసులో హీరోయిన్లు కాజల్ అగర్వాల్, తమన్నాను విచారించేందుకు పుదుచ్చేరి పోలీసులు సిద్ధమయ్యారు. ఈ కేసులో ఇప్పటికే నితీశ్ జైన్, అరవింద్ కుమార్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. క్రిప్టో కరెన్సీలో అధిక లాభం వస్తుందని ఆశ చూపి రూ.2.40 కోట్లు మోసం చేసినట్లు పుదుచ్చేరికి చెందిన అశోకన్ అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. దీంతో ఆ కంపెనీకి ప్రచారం చేసిన తమన్నా, కాజల్‌ను పోలీసులు విచారించనున్నారు.

AP: తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ శుభవార్త చెప్పింది. రానున్న వేసవిలో భక్తుల సౌకర్యార్థం చలువ పెయింటింగ్ వేయాలని టీటీడీ నిర్ణయించింది. భక్తులకు ఎండ, వేడి నుంచి ఉపశమనం కలిగించేందుకే ఈ ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపింది. అలాగే నిరంతర విద్యుత్ సరఫరా ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొంది. లడ్డూల బఫర్ స్టాక్, తాగు నీరు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు తగినన్ని అందుబాటులో ఉంచుతున్నట్లు వెల్లడించింది.
Sorry, no posts matched your criteria.