India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
TG: పంచాయతీ ఓటర్ల తుది జాబితాను రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. మొత్తం 12,867 పంచాయతీల్లో 1,67,33,584 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో 82,04,518 మంది పురుషులు, 85,28,573 మంది మహిళలు, 493 మంది ఇతర ఓటర్లున్నారు. జిల్లాల వారీగా చూస్తే అత్యధికంగా నల్గొండ జిల్లాలో 10,42,545 మంది, అత్యల్పంగా మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో 64,397 మంది ఓటర్లున్నారు.
నైజీరియాలో జరిగిన పడవ ప్రమాదంలో మృతుల సంఖ్య 60కి చేరింది. దాదాపు 300 మంది ప్రయాణికులతో వెళ్తున్న పడవ నైజీర్ నదిలో మునిగిపోయింది. ఇప్పటి వరకు ఈ ఘటనలో 160 మందిని రక్షించారు. మరో 83 మంది గల్లంతైనట్లు అధికారులు ప్రకటించారు. పడవ పాతదని, ఎక్కువ మందిని ఎక్కించడంతోనే ప్రమాదం జరిగినట్లు తెలిపారు. కాగా నైజర్ నది ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో సహాయక చర్యలకు అంతరాయం ఏర్పడుతోందని, మృతులు పెరిగే అవకాశం ఉందన్నారు.
Gemini Live AI టూల్‌తో మరికొన్ని రోజుల్లో తెలుగులో కూడా సంభాషించవచ్చు. దేశంలో వాయిస్ అసిస్టెంట్ ఏఐ టూల్ వాడకం పెరుగుతుండడంతో Google దీన్ని మరిన్ని ప్రాంతీయ భాషలకు విస్తరించింది. ప్రస్తుతం ఇంగ్లిష్‌తోపాటు హిందీని కూడా ప్రవేశపెట్టింది. అలాగే మరికొన్ని రోజుల్లో తెలుగు, తమిళం, మలయాళం, బెంగాలీ, మరాఠీ, ఉర్దూ భాషల్లో తీసుకురానుంది. ఈ ఏడాదితో దేశంలో Google 20 ఏళ్ల ప్రయాణాన్ని పూర్తి చేసుకుంది.
నటి సమంత విడాకులు తీసుకోవడంలో తన ప్రమేయం ఉందంటూ మంత్రి కొండా సురేఖ చేసిన కామెంట్స్‌పై నాగార్జున కోర్టుకు వెళ్లారు. నాంపల్లి కోర్టులో పరువు నష్టం దావా వేశారు. మంత్రి తన కుటుంబసభ్యుల పరువుకు భంగం కలిగించారని, ఆమెపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని దావాలో పేర్కొన్నారు.
యూపీలోని గజ్రౌలాకు చెందిన రామ్ సింగ్ 1,257 యూనిక్ రేడియోలను కలిగి ఉండి గిన్నిస్ వరల్డ్ రికార్డుకెక్కారు. ఇవి 1920 నుంచి 2010 మధ్య కాలంలోనివని ఆయన తెలిపారు. రామ్ సింగ్ వద్ద మొత్తం 1,400 రేడియోలు ఉండగా వీటిలో 1,257 ప్రత్యేకమైనవని గుర్తించారు. వీటిని ఢిల్లీ, మీరట్‌లో కొనుగోలు చేసినట్లు ఆయన తెలిపారు. భవిష్యత్తు తరాలకు రేడియో గురించి తెలియజేసేందుకు వీటిని సేకరించినట్లు రామ్ సింగ్ పేర్కొన్నారు.
TG: రాష్ట్రంలో మరో రెండు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రేపు ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జనగాం, యాదాద్రి భువనగిరి, హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి, మహబూబ్ నగర్, మెదక్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఎల్లుండి ఉమ్మడి రంగారెడ్డి, మహబూబ్ నగర్, మెదక్, నిజామాబాద్, జనగాం, యాదాద్రి భువనగిరి, హైదరాబాద్‌లో వర్షాలు కురుస్తాయని పేర్కొంది.
సద్గురు జగ్గీ వాసుదేవ్ పాదాల ఫొటో ఒక్కోటి ₹3,200కి ఈషా ఫౌండేషన్ వెబ్‌సైట్‌లో విక్రయానికి ఉంచడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సద్గురు పాదాల ఫొటో కోసం రూ.3,200 చెల్లించడానికి మీ జీవితంలో ఏం తప్పు జరగాల్సి ఉందంటూ ఒకరూ, మోడ్రన్ బాబాలు ధర్మాన్ని మార్కెట్‌లో వస్తువులా మార్చేశారని మరొకరు విమర్శిస్తున్నారు. ఇదొక మోడ్రన్ చర్య అని, ఫొటోపై రివ్యూలు కూడా ఇస్తున్నారంటూ సెటైర్లు వేస్తున్నారు.
AP: తిరుమలలో సాలకట్ల బ్రహ్మోత్సవాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. వాహన సేవలు ఉ. 8గంటలకు, రాత్రి 7గంటలకు నిర్వహిస్తామని TTD ఈవో శ్యామలరావు తెలిపారు. 8వ తేదీ రాత్రి గరుడ వాహన సేవ జరుగుతుందని పేర్కొన్నారు. 3.5 లక్షల మంది వస్తారని అంచనా వేసినట్లు చెప్పారు. 7లక్షల లడ్డూలు సిద్ధం చేశామన్నారు. బ్రహ్మోత్సవాల నేపథ్యంలో 4 నుంచి 12వ తేదీ వరకు ఆర్జిత సేవలు, ప్రత్యేక దర్శనాలను రద్దు చేసినట్లు చెప్పారు.
సమంత విడాకులపై మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలను హీరో విజయ్ దేవరకొండ ఖండించారు. ‘నేటి రాజకీయ నాయకుల ప్రవర్తనపై మంచి భాషలో మాట్లాడేందుకు కష్టపడుతున్నా. రాష్ట్రంలో మౌలిక సదుపాయాలు, పెట్టుబడులు, ఉద్యోగాలు, ప్రజా శ్రేయస్సు, విద్యను మెరుగుపరచడానికే మేము మీకు ఓట్లు వేస్తామని రాజకీయ నాయకులకు గుర్తుచేస్తున్నా. కానీ ఇప్పుడు జరిగిన దాన్ని అస్సలు అంగీకరించలేం. రాజకీయాలు దిగజారకూడదు’ అని ట్వీట్ చేశారు.
తమిళ స్టార్ హీరో దళపతి విజయ్, డైరెక్టర్ హెచ్.వినోద్ కాంబోలో తెరకెక్కనున్న ‘దళపతి 69’ సినిమాలో నటీనటులను మేకర్స్ రివీల్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రంలో పూజా హెగ్డే నటిస్తున్నట్లు తెలిపారు. తాజాగా డైరెక్టర్- యాక్టర్ గౌతమ్ మీనన్‌తో పాటు నటి ప్రియమణి నటిస్తున్నట్లు వెల్లడిస్తూ పోస్టర్స్ రిలీజ్ చేశారు. ‘విజయ్ సర్‌తో నటించే అవకాశం లభించినందుకు సంతోషంగా, గర్వంగా ఉంది’ అని ప్రియమణి ట్వీట్ చేశారు.
Sorry, no posts matched your criteria.