India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
APలో విచిత్ర వాతావరణ పరిస్థితి నెలకొంది. ఓవైపు వర్షాలు కురుస్తుండగా మరోవైపు ఎండలు, ఉక్కపోతతో ప్రజలు అల్లాడిపోతున్నారు. నిన్న నెల్లూరులో 40.7 డిగ్రీలు, కావలిలో 39.8, అనంతపురంలో 38.9, తిరుపతిలో 37.6 అమరావతిలో 36.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కాగా ఇవాళ ప్రకాశం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, YSR, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని APSDMA వెల్లడించింది.
పశ్చిమాసియాలో యుద్ధ పరిస్థితుల కారణంగా అంతర్జాతీయంగా క్రూడాయిల్ రేట్లు పెరిగాయి. 71 డాలర్లుగా ఉన్న బ్యారెల్ ముడిచమురు ధర 2.7% పెరిగి 75 డాలర్లకు చేరింది. ప్రపంచంలో మూడో వంతు దేశాలకు ప్రస్తుతం ఇరాన్ నుంచే ఆయిల్ సప్లై అవుతోంది. ముడిచమురు ధరలకు అనుగుణంగానే మన దేశంలోని ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరల్లో మార్పులు చేస్తున్నాయి. ఫలితంగా పెట్రో ధరలు పెరిగే అవకాశం ఉందని నిపుణుల అంచనా.
తమిళనాడు కోయంబత్తూరులోని <<14238933>>ఈశా<<>> యోగా కేంద్రంలో జరుగుతున్న పోలీసు తనిఖీలపై నిర్వాహకులు స్పందించారు. ప్రజలకు యోగా, ఆధ్యాత్మికతను అందించేందుకు సద్గురు ఈశా ఫౌండేషన్‌ను ప్రారంభించారని పేర్కొన్నారు. వివాహం చేసుకోవాలని గానీ, సన్యాసం స్వీకరించాలని గానీ తామెవ్వరినీ అడగమని స్పష్టం చేశారు. కోర్టులో నిజమే గెలుస్తుందన్నారు. నిరాధార ఆరోపణలు చేస్తే చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
నేచురల్ స్టార్ నాని, డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కాంబోలో రాబోతున్న రెండో సినిమాను ఈనెల 12న దసరా సందర్భంగా లాంచ్ చేయనున్నట్లు సమాచారం. ఈ పీరియాడికల్ యాక్షన్ డ్రామా మూవీ సికింద్రాబాద్ బ్యాక్ డ్రాప్‌లో సాగే కథతో తెరకెక్కనున్నట్లు సినీ వర్గాలు పేర్కొన్నాయి. దీనికి అనిరుధ్ సంగీతం అందిస్తున్నట్లు సమాచారం. దీనిపై మూవీ టీమ్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. నాని, శ్రీకాంత్ కలిసి గతంలో ‘దసరా’ మూవీ చేశారు.
ఇజ్రాయెల్‌లోని టెల్ అవీవ్‌లో నిన్న జరిగిన టెర్రరిస్టుల కాల్పుల్లో 8 మంది మృతిచెందిన సంగతి తెలిసిందే. మృతుల్లో సెగెవ్ విగ్డర్ అనే 33ఏళ్ల మహిళ ఉన్నారు. ఆమె తన 9నెలల కొడుకును కాపాడుకునే క్రమంలో తూటాలకు బలయ్యారు. ఆమె కొడుకు ఆరి సురక్షితంగా ఉన్నాడని అధికారులు తెలిపారు. సెగెవ్ ఒక ఫిట్‌నెస్ స్టూడియో ఓనర్ అని, తన భర్త రిజర్వ్ సైనికుడిగా పనిచేస్తున్నారని స్థానిక మీడియా పేర్కొంది.
AP: విజయవాడ ఇంద్రకీలాద్రిపై నేటి నుంచి దసరా వేడుకలు ప్రారంభం కానున్నాయి. ఈ నెల 12 వరకు 9 రోజుల్లో దుర్గమ్మ 9 రూపాల్లో భక్తులకు దర్శనమివ్వనున్నారు. రోజూ ఉ.4 నుంచి రా.11 వరకు భక్తులను దర్శనానికి అనుమతిస్తారు. తొలిరోజైన నేడు మాత్రం ఉ.9 నుంచి దర్శనాలు ఆరంభమవుతాయి. భక్తుల కోసం 25 లక్షల లడ్డూలు సిద్ధం చేశారు. ఉచితంగా అన్నప్రసాదాలు పంపిణీ చేయనున్నారు. కృష్ణా ఘాట్ల వద్ద స్నానాల కోసం షవర్లు ఏర్పాటుచేశారు.
TG: కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు స్వీకరించాలన్న నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం మార్చుకుంది. ఈనెల 2 నుంచి దరఖాస్తులు స్వీకరించాల్సి ఉండగా, ఇందుకు సంబంధించిన ప్రక్రియను నిలిపివేసింది. ఫ్యామిలీ డిజిటల్ కార్డులు ఇవ్వనున్న నేపథ్యంలో ఇక రేషన్ కార్డులు అవసరం లేదని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. మరోవైపు అధికారులు నేటి నుంచి 5 రోజులపాటు ఫ్యామిలీ డిజిటల్ కార్డుల పైలట్ ప్రాజెక్టు చేపట్టనున్నారు.
ఐసీసీ మహిళల టీ20 వరల్డ్ కప్ యూఏఈ వేదికగా నేడు ప్రారంభం కానుంది. ఇవాళ రెండు మ్యాచులు జరగనున్నాయి. తొలి మ్యాచులో బంగ్లాదేశ్‌తో స్కాట్లాండ్, రెండో మ్యాచులో పాకిస్థాన్‌తో శ్రీలంక తలపడతాయి. రేపు సౌతాఫ్రికాVSవెస్టిండీస్, ఇండియాVSన్యూజిలాండ్ మ్యాచులు జరగనున్నాయి. ఈ మ్యాచులను స్టార్ స్పోర్ట్స్ టీవీ ఛానల్, డిస్నీ+హాట్ స్టార్ యాప్‌లో చూడవచ్చు.
మంత్రి సురేఖ తన <<14254371>>వ్యాఖ్యల్ని<<>> వెనక్కి తీసుకుని క్షమాపణలు చెప్పాలని సినీ హీరో సుశాంత్ డిమాండ్ చేశారు. ‘రాజకీయ ప్రత్యర్థికి వ్యతిరేకంగా మాట్లాడుతున్న సమయంలో ఒక మంత్రి నా కుటుంబంతో పాటు సమంతను కించపరిచే విధంగా మాట్లాడటం విని షాక్ అయ్యాను. ఎవరినీ బాధపెట్టి ఇలా రాజకీయాల్లోకి లాగకూడదు. ఇలాంటి బాధ్యతారాహిత్య ప్రవర్తనను అందరూ ఖండించాలి’ అని ట్వీట్ చేశారు.
AP: రాష్ట్రంలో నేటి నుంచి ఈనెల 21 వరకు టెట్ పరీక్షలు జరగనున్నాయి. రెండు సెషన్లలో (ఉ.9.30-మ.12, మ.2.30-సా.5) ఆన్‌లైన్ విధానంలో పరీక్షలు నిర్వహించనున్నారు. అభ్యర్థులు హాల్ టికెట్‌తో పాటు ఏదైనా గుర్తింపు కార్డు తప్పనిసరిగా తీసుకెళ్లాలి. హాల్ టికెట్‌లో తప్పులుంటే పరీక్షా కేంద్రంలోని అధికారులకు చూపించి సరిచేసుకోవచ్చు. ఈ పరీక్షలకు మొత్తం 4.27లక్షల మంది హాజరు కానున్నారు.
Sorry, no posts matched your criteria.