India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
TG: ‘హైడ్రా’ పేరుతో ప్రభుత్వం అమాయక ప్రజల ఇళ్లు కూలుస్తోందని మాజీ మంత్రి కేటీఆర్ ధ్వజమెత్తారు. ‘ఎవరి కమీషన్ల కోసం మూసీ సుందరీకరణ అంటున్నారు. పేదల ఇళ్లు కూలుస్తుంటే మేం చూస్తూ ఊరుకోం. బాధితులకు బీఆర్ఎస్ అండగా ఉంటుంది. నాతో సహా మా నేతలంతా బుల్డోజర్లకు అడ్డుగా నిలబడతాం. కూల్చాల్సి వస్తే మొదట హైడ్రా కమిషన్ కార్యాలయం, బుద్ధభవన్‌ను కూల్చాలి’ అని కేటీఆర్ మండిపడ్డారు.
బంగ్లాదేశ్‌తో జరుగుతోన్న రెండో టెస్టు మ్యాచులో టీమ్ఇండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా 3 వికెట్లు పడగొట్టి చరిత్ర సృష్టించారు. ఈ ఏడాది అంతర్జాతీయ క్రికెట్లో 50 వికెట్లు తీసిన తొలి బౌలర్‌గా బుమ్రా నిలిచారు. దీంతో పాటు జేమ్స్ అండర్సన్‌ను అధిగమించి ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్(WTC)లో అత్యధిక వికెట్లు తీసిన ఏడవ బౌలర్‌గా బుమ్రా రికార్డులకెక్కారు.
TG: అత్యాచారం కేసులో కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌కు ఊరట దక్కలేదు. ఆయన దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై విచారణను రంగారెడ్డి జిల్లా ఫాస్ట్ ట్రాక్ కోర్టు అక్టోబర్ 7వ తేదీకి వాయిదా వేసింది. ఇటీవల ఆయనను కస్టడీలోకి తీసుకున్న పోలీసులు పలు కీలక అంశాలు రాబట్టినట్లు సమాచారం.
తమిళ స్టార్ హీరో కార్తీ నటించిన ‘సత్యం సుందరం’ సినిమా థియేటర్లలో విజయవంతంగా కొనసాగుతోంది. అయితే, సినిమాలోని 18 నిమిషాలను ట్రిమ్ చేసినట్లు సినీవర్గాలు పేర్కొన్నాయి. కట్ చేసిన వెర్షన్ ఈరోజు నుంచి థియేటర్లలో ప్రదర్శించనున్నట్లు తెలిపాయి. కాగా, సెకండ్ ఆఫ్‌లో కార్తీ & అరవింద్‌స్వామి మధ్య జరిగే సుదీర్ఘ సంభాషణను ట్రిమ్ చేసి ఉండొచ్చని అభిప్రాయపడుతున్నాయి.
బంగ్లాదేశ్‌తో రెండో టెస్టులో భారత బౌలర్ అశ్విన్ చరిత్ర సృష్టించారు. వరుసగా 3 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్స్(WTC)లో 50+ వికెట్లు తీసిన తొలి బౌలర్‌గా నిలిచారు. ఇతను 2019-21లో 71, 2021-23లో 61, 2023-25లో 50* వికెట్లు తీశారు. నాథన్ లియాన్, పాట్ కమిన్స్, టిమ్ సౌథీ రెండు సీజన్లలో 50+ వికెట్లు పడగొట్టారు. కాగా ఓవరాల్‌గా WTCలో 187 వికెట్లతో లియాన్ టాప్‌లో ఉండగా, అశ్విన్(182) రెండో స్థానంలో ఉన్నారు.
లైంగిక వేధింపుల కేసులో మాలీవుడ్ నటుడు సిద్ధిక్‌కి సుప్రీంకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. అయితే పోలీసుల విచారణకు సహకరించాలని ఆదేశించింది. ఆయనపై వేధింపుల ఆరోపణలు రావడంతో కేరళ పోలీసులు విచారణ చేపట్టారు. ఈ నేపథ్యంలో సిద్ధిక్ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌ను కేరళ హైకోర్టు కొట్టేసింది. దీంతో సుప్రీంను ఆశ్రయించగా తాజాగా ఆయనకు ఉపశమనం కలిగింది.
AP: తిరుమల లడ్డూ వ్యవహారంపై సుప్రీంకోర్టులో విచారణ వచ్చే గురువారానికి వాయిదా పడింది. ఈ కేసులో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్‌తో దర్యాప్తు కొనసాగించాలా? లేదా? అని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు కోరింది. స్వతంత్ర దర్యాప్తు సంస్థతో విచారణపై అభిప్రాయం చెప్పాలని కేంద్రాన్ని అడిగింది.
AP: తిరుమలలో నెయ్యి కల్తీ వ్యవహారంలో విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలపై వైసీపీ స్పందించింది. నెయ్యి కల్తీ జరిగినట్లు ఆధారాలు లేవని, సెకండ్ ఒపీనియన్ ఎందుకు తీసుకోలేదంటూ ధర్మాసనం చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించింది. ‘సత్యమేవ జయతే’ అని ట్వీట్ చేసింది.
తిరుమల లడ్డూలలో జంతువుల కొవ్వుతో కూడిన నెయ్యి వాడారంటూ వ్యాఖ్యానించిన CM చంద్రబాబుపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘కోట్లాది భక్తుల మనోభావాలకు సంబంధించిన వ్యవహారంలో ఆధారాలు లేకుండా, రెండో అభిప్రాయం తీసుకోకుండా పబ్లిక్ మీటింగ్‌లో ఎలా మాట్లాడారు? లడ్డూలను టెస్టులకు పంపారా? ఆరోపణలపై దర్యాప్తునకు ఆదేశించినప్పుడు బహిరంగ ప్రకటన చేయాల్సిన అవసరం ఏముంది?’ అని ప్రభుత్వ లాయర్‌ను ప్రశ్నించింది.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ తెరకెక్కించిన ‘దేవర’ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. చాలా చోట్ల థియేటర్లు హౌస్‌ఫుల్‌తో నడుస్తున్నాయి. దీంతో బ్రేక్ ఈవెన్ మార్కును దాటేసినట్లు సినీవర్గాలు పేర్కొన్నాయి. మరికొన్ని ప్రాంతాల్లో ఈ మార్క్‌ను చేరుకున్నట్లు తెలిపాయి. మాస్ ఏరియాల్లో ముఖ్యంగా సి సెంటర్లలో దేవర రికార్డు స్థాయిలో కలెక్షన్లు నమోదు చేస్తోందని వెల్లడించాయి.
Sorry, no posts matched your criteria.