India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
దేశీయ స్టాక్ మార్కెట్లు తీవ్ర నష్టాల్లో నడుస్తున్నాయి. ఇటీవల సెన్సెక్స్, నిఫ్టీ జీవిత కాల గరిష్ఠాలకు చేరుకోవడంతో ఇన్వెస్టర్లు జాగ్రత్తపడుతున్నారు. దీంతో అధిక వెయిటేజీ స్టాక్‌లతోపాటు అన్ని కీలక రంగాల్లో అమ్మకాలు జోరందుకున్నాయి. ఓవర్ వాల్యూయేషన్ భయాలతో ఇన్వెస్టర్లు ప్రాఫిట్ బుకింగ్ చేసుకోవడం, FIIల మనీ ఫ్లో తగ్గడంతో Mon మిడ్ సెషన్ వరకే సెన్సెక్స్ 1,200 పాయింట్లు, నిఫ్టీ 350 పాయింట్లు నష్టపోయాయి.
AP: తిరుమల లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ‘లడ్డూలో కల్తీ జరిగిందని నిర్ధారించారా? లడ్డూలను టెస్టింగ్‌కు పంపారా? కల్తీ జరిగిందని గుర్తించిన తర్వాత ఆ నెయ్యిని లడ్డూ తయారీలో వినియోగించారా? అలా వినియోగించినట్లు ఆధారాలు లేవు. విచారణ జరగకుండానే లడ్డూ కల్తీ జరిగిందని ప్రకటన చేయడం భక్తుల మనోభావాలను దెబ్బతీస్తోంది’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది.
బంగ్లాదేశ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో భారత్ చరిత్ర సృష్టించింది. టెస్టు క్రికెట్‌లో అతి తక్కువ బంతుల్లో(18) 50 పరుగులు చేసిన జట్టుగా నిలిచింది. ఇంగ్లండ్ గతంలో 26 బంతుల్లో 50 రన్స్ పూర్తిచేసింది. రోహిత్ 11 బాల్స్‌లో 23 రన్స్ చేసి ఔటవగా, జైస్వాల్ 30(13 బంతుల్లో), గిల్(1) క్రీజులో ఉన్నారు.
AP: దసరా తర్వాత తాడిపత్రిలో అడుగుపెడతానని YCP మాజీ MLA కేతిరెడ్డి పెద్దారెడ్డి అన్నారు. ‘నా ఇంటికి నేను వెళ్లేందుకు జేసీ ప్రభాకర్ రెడ్డి పర్మిషన్ అవసరమని ఎస్పీ చెబితే అలాగే చేస్తా. ఓ మాజీ MLAని నియోజకవర్గంలో రానివ్వకపోవడం దుర్మార్గం’ అని ఫైర్ అయ్యారు. కాగా ఎన్నికల సందర్భంగా చెలరేగిన అల్లర్ల తర్వాత కేతిరెడ్డి తాడిపత్రి విడిచి వెళ్లారు. ఇటీవల మళ్లీ తిరిగి రాగా TDP, YCP వర్గాల మధ్య ఘర్షణలు చెలరేగాయి.
కాన్పూర్ వేదికగా భారత్‌తో జరుగుతున్న రెండో టెస్టు మొదటి ఇన్నింగ్సులో బంగ్లాదేశ్ 233 పరుగులకు ఆలౌటైంది. మోమినల్ హక్(107*) మినహా అందరు బ్యాటర్లు విఫలమయ్యారు. బుమ్రా 3 వికెట్లు, సిరాజ్, అశ్విన్, ఆకాశ్ దీప్ తలో రెండు వికెట్లు, జడేజా ఒక వికెట్ పడగొట్టారు. తొలి రోజు కొద్ది సేపు మ్యాచ్ జరగగా, రెండున్నర రోజులు వర్షార్పణమైన విషయం తెలిసిందే. మరో ఒకటిన్నర రోజు మాత్రమే ఆట మిగిలి ఉంది.
AP: తెలుగు వచ్చిన వాళ్ల ముందు ఇంగ్లిష్‌లో ఎందుకు మాట్లాడతారో అర్థం కాదని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య అన్నారు. ఇంగ్లిష్‌లో మాట్లాడే నాయకులు గొప్పవాళ్లు కాదని చెప్పారు. ఛత్రపతి, లక్ష్మీబాయి, కొమరం భీం లాంటి వాళ్లు మాతృభాష మాట్లాడే గొప్పవాళ్లు అయ్యారని తెలిపారు. ANUలో నిర్వహించిన తత్వవేత్త సచ్చిదానందమూర్తి శతజయంతి ఉత్సవాల్లో ఆయన ప్రసంగించారు. మాతృభాషను మర్చిపోయినవాడు మనిషి కాదని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
రోజుకు 1 టీస్పూన్ ఉప్పు మాత్రమే తీసుకోవాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించింది. అంతకంటే ఎక్కువ తింటే రక్తపోటును పెంచుతుందని హెచ్చరించింది. ఇది గుండె జబ్బులు & స్ట్రోక్‌కు ప్రమాద కారకమని పేర్కొంది. సిఫార్సు చేసిన పరిమితికి ఉప్పు వినియోగాన్ని తగ్గిస్తే సంవత్సరానికి 2.5 మిలియన్ల మరణాలను నివారించవచ్చని అంచనా వేసింది. కాగా, ఒక నెలపాటు ఉప్పు తినడం ఆపేస్తే బరువు తగ్గుతారని వైద్యులు చెబుతున్నారు.
ఓ కేసు విచారణ సందర్భంగా లాయర్ ‘యా.. యా’ అంటూ మాట్లాడటంపై CJI చంద్రచూడ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ‘ఇదేమీ కాఫీ షాప్ కాదు. ఈ యా యా ఏంటి? ఇలాంటి పదాలంటే నాకు చిరాకు. వీటిని ఇక్కడ అనుమతించను’ అని హెచ్చరించారు. 2018లో అప్పటి సీజేఐ జస్టిస్ రంజన్ గొగోయ్ పిటిషన్‌ను డిస్మిస్ చేయడాన్నిసవాల్ చేస్తూ ఈ కేసులో ఆయననే ప్రతివాదిగా చేర్చాలంటూ పిల్ దాఖలు చేశారు. గొగోయ్ పేరును తొలగించాలని CJI స్పష్టం చేశారు.
సౌత్ కొరియా కంపెనీ హ్యుందాయ్ మోటార్స్ అరుదైన ఘనత సాధించింది. ప్రపంచవ్యాప్తంగా 10 కోట్ల కార్లను తయారుచేసిన సంస్థగా నిలిచింది. ద.కొరియాలోని ఉల్సాన్ ప్లాంట్‌లో రికార్డు బ్రేకింగ్ కారును కస్టమర్‌కు అప్పగించింది. 1968లో కార్యకలాపాలను ప్రారంభించిన ఈ సంస్థ 57 ఏళ్లలో భారత్ సహా 10 దేశాల్లో 12 ప్లాంట్‌లను ఏర్పాటుచేసింది. సవాళ్లను ఎదుర్కొని నూతన ఆవిష్కరణలు చేయడంతోనే వృద్ధి సాధ్యమైందని CEO జేహూన్ తెలిపారు.
2023-24 అసెస్‌మెంట్ ఏడాదికి వివిధ ఆడిట్ నివేదికలను సమర్పించడానికి Sep 30తో (సోమవారం) ముగియనున్న గడువును ఆదాయపు పన్ను శాఖ అక్టోబర్ 7 వరకు పొడిగించింది. వ్యాపార సంస్థలు, ఆడిట్‌లు చేయించుకోవాల్సిన వ్యక్తులు పన్ను నిబంధనలకు అనుగుణంగా ఈ నివేదికలను సమర్పించాలి. అక్టోబర్ 31లోపు పన్ను చెల్లించాల్సిన వారందరికీ ఈ గడువు పొడిగింపు వర్తిస్తుంది. ఈ మేరకు Central Board of Direct Taxes ప్రకటించింది.
Sorry, no posts matched your criteria.