news

News February 27, 2025

EAPCET ప్రవేశాల్లో సవరణలు

image

తెలంగాణలో ఇంజినీరింగ్, వృత్తివిద్య కోర్సుల్లో ప్రవేశాలకు <>సవరణలు <<>>చేస్తూ ప్రభుత్వం జీవో ఇచ్చింది. 85% సీట్లు తెలంగాణ విద్యార్థులకు కేటాయించనుంది. 15% అన్‌రిజర్వ్‌డ్ కోటా సీట్లకు 4 రకాలుగా అర్హులను గుర్తించింది. తెలంగాణ స్థానికులు, TGలో పదేళ్లు చదివిన ఇతర రాష్ట్రాల వారు, కేంద్ర-రాష్ట్ర సంస్థల్లో పనిచేస్తున్న వారి పిల్లలు, కేంద్ర-రాష్ట్ర ఉద్యోగుల జీవిత భాగస్వాములు ఈ 15% సీట్లకూ అర్హులని పేర్కొంది.

News February 27, 2025

నీటిని జాగ్రత్తగా వాడుకోండి.. AP, TGలకు KRMB సూచన

image

తెలుగు రాష్ట్రాల ఈఎన్‌సీలతో కేఆర్ఎంబీ సమావేశం ముగిసింది. శ్రీశైలం, నాగార్జున సాగర్‌లో తక్కువ నీరు ఉన్నందున వృథా కాకుండా జాగ్రత్తగా వాడుకోవాలని సూచించింది. తాగు, సాగు నీటి అవసరాలను దృష్టిలో ఉంచుకోవాలంది. 15 రోజులకోసారి ఇరు రాష్ట్రాల అధికారులు పరిస్థితులను సమీక్షించుకోవాలని ఆదేశించింది. రెండు ప్రాజెక్టుల నుంచి తమకు 55TMCలు కావాలని ఏపీ, 63TMCలు ఇవ్వాలని తెలంగాణ కోరిన విషయం తెలిసిందే.

News February 27, 2025

$: సెంచరీ దిశగా..!

image

అమెరికా డాలర్‌తో పోలిస్తే భారత కరెన్సీ రూపాయి విలువ రికార్డు స్థాయిలో పతనమవుతోంది. పది సంవత్సరాల్లో రూపాయి విలువ ఎంతలా పడిపోయిందో ఓ నెటిజన్ వివరించారు. 2015లో ఒక్క డాలర్‌కు రూ.65.87 కాగా ఇది 2020లో రూ.73.78కి చేరింది. 2024లో రూ.84.79 ఉండగా ఈరోజు డాలర్ విలువ రూ.87.17గా ఉంది. రోజురోజుకీ పెరుగుతూ పోతుండటంతో ఇది త్వరలోనే రూ.100కు చేరే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు.

News February 27, 2025

SHOCK: ఇడ్లీ శాంపిల్స్‌లో క్యాన్సర్ కారకాలు

image

హెల్తీ బ్రేక్‌ఫాస్ట్ ఇడ్లీల్లో కార్సినోజెనిక్స్(క్యాన్సర్ కారకాలు) ఉండటం కర్ణాటకలో దుమారం రేపింది. దీంతో వాటి తయారీలో ప్లాస్టిక్ వాడకాన్ని ప్రభుత్వం నిషేధించింది. ఇడ్లీ ప్లేటులో పిండి వేశాక దానిపై క్లాత్ బదులు ప్లాస్టిక్ షీట్లు వేస్తున్నట్టు ఫిర్యాదులు రావడంతో 251 శాంపిల్స్‌ను పరీక్షించారు. 52 హోటళ్లు ప్లాస్టిక్ వాడినట్టు తేలింది. దీంతో AP, TGలోనూ తనిఖీ చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

News February 27, 2025

బీఆర్ఎస్ వల్లే SLBC ప్రమాదం: ఉత్తమ్ కుమార్ రెడ్డి

image

బీఆర్ఎస్ సరైన సమాయానికి SLBC టన్నెల్ పూర్తి చేస్తే ఈ ప్రమాదం జరిగేది కాదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. శ్రీశైలం, కాళేశ్వరం ప్రాజెక్టుల్లో ప్రమాదాలు జరిగి పలువురు మృతి చెందితే స్పందించని నేతలు.. నేడు పొలిటికల్ డ్రామాలాడుతున్నారని విమర్శించారు. టన్నెల్ విషయాలపై పూర్తిగా అవగాహన 10కి పైగా ఏజెన్సీలు కలిసి ఈ రెస్క్యూ చేపడుతున్నాయని, రెండు, మూడు రోజుల్లో ఆపరేషన్ పూర్తవుతుందని మంత్రి తెలిపారు.

News February 27, 2025

విశాఖలో కెరీర్ ఫెయిర్.. 10000+ ఉద్యోగాలు

image

AP: విశాఖ గీతం యూనివర్సిటీలో మార్చి 5, 6 తేదీల్లో కెరీర్ ఫెయిర్ జరగనుంది. ఏపీ ఉన్నత విద్యామండలి, నైపుణ్యాభివృద్ధి సంస్థతో కలిసి నాస్కామ్ దీనిని నిర్వహిస్తోంది. 49 ఐటీ సంబంధిత కంపెనీల్లో 10,000+ ఉద్యోగ అవకాశాలను కల్పిస్తామని మంత్రి లోకేశ్ వెల్లడించారు. 2024, 2025 పాస్‌అవుట్ అయిన వారు అర్హులు. మార్చి 3లోగా మీ జీమెయిల్ ఐడీ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ కోసం ఇక్కడ <>క్లిక్ <<>>చేయండి.

News February 27, 2025

కేంద్ర పన్నుల్లో రాష్ట్రాల వాటా తగ్గించనున్న మోదీ సర్కార్?

image

కేంద్ర పన్ను ఆదాయంలో రాష్ట్రాల వాటాను తగ్గించాలని మోదీ సర్కారు యోచిస్తున్నట్టు తెలిసింది. వాటా పంపకాలపై సలహాలిచ్చే ఫైనాన్స్ కమిషన్‌కు ఇప్పటికే విషయం చెప్పినట్టు సమాచారం. ప్రస్తుతం 41గా ఉన్న వాటాను కనీసం 40%కి తగ్గించాలని సూచించినట్టు తెలిసింది. అరవింద్ పణగడియా నాయకత్వంలోని కమిషన్ FY2026-27 రికమెండేషన్స్ రిపోర్టును OCT 31లోపు కేంద్రానికి ఇస్తుంది. ఒక శాతం తగ్గినా కేంద్రానికి రూ.35K CR మిగులుతాయి.

News February 27, 2025

PAKISTAN: ఆదాయం 6.. ఖర్చు 60..!

image

ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహణకు పాకిస్థాన్ భారీగా ఖర్చు చేసింది. దాదాపు రూ.591 కోట్లు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు ఒక్క మ్యాచూ గెలవకుండానే లీగ్ దశలోనే ఆ జట్టు ఇంటిబాట పట్టింది. గ్రూప్ స్టేజీలో ఓడిన జట్లకు ఐసీసీ రూ.2.3 కోట్లు మాత్రమే ఇవ్వనుంది. ఇది చూసిన నెటిజన్లు పీసీబీపై ట్రోల్స్ చేస్తున్నారు. ఆదాయం 6.. ఖర్చు 60 అంటూ ఎగతాళి చేస్తున్నారు. ఇకనైనా పీసీబీ తీరు మారాలని కామెంట్లు చేస్తున్నారు.

News February 27, 2025

పోలీసుల విచారణకు సహకరించని పోసాని?

image

AP: సినీనటుడు పోసాని కృష్ణమురళి విచారణకు సహకరించడం లేదని పోలీసులు చెప్పినట్లు తెలుస్తోంది. అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్, సీఐ వెంకటేశ్వర్లు 4 గంటలుగా విచారిస్తున్నా ఆయన నోరు మెదపడం లేదని సమాచారం. ఏ ప్రశ్న అడిగినా మౌనంగా కూర్చుంటున్నారని, ఆయన నోరు విప్పితేనే విచారణ కొనసాగుతుందని వారు చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. ప్రతి ప్రశ్నకు సమాధానం దాటవేస్తున్నట్లు తెలుస్తోంది.

News February 27, 2025

ఎల్లుండి ఓటీటీలోకి ‘సంక్రాంతికి వస్తున్నాం’

image

అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో తెరకెక్కిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీ ఎల్లుండి(మార్చి 1) ఓటీటీలోకి రానుంది. సా.6గంటల నుంచి అటు జీతెలుగులో ప్రసారం కానుండగా ఇటు జీ5 యాప్‌లోనూ స్ట్రీమింగ్ కానుంది. జీ5 తాజాగా తన యాప్‌లో విడుదల చేసిన ప్రోమోలో ఈ విషయాన్ని తెలియజేసింది. వెంకటేశ్, ఐశ్వర్యా రాజేశ్, మీనాక్షి చౌదరి కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రం రూ.300 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించిన విషయం తెలిసిందే.