India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఏపీలోని శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, పల్నాడు, ప్రకాశం, నంద్యాల జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, ఏలూరు, కృష్ణా, NTR, గుంటూరు, బాపట్ల, నెల్లూరు, కర్నూలు, YSR, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి, గోదావరి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు పడతాయని తెలిపింది.
AP: తిరుమల లడ్డూ వివాదంపై సిట్ దర్యాప్తు వేగవంతం చేసింది. నెయ్యి సరఫరా చేసిన కంపెనీ చరిత్రపై ఆరా తీస్తోంది. సంస్థ యజమాని నుంచి నెయ్యి ట్యాంకర్ డ్రైవర్ వరకూ అందరినీ ప్రశ్నించనుంది. అవసరమైతే TTD మాజీ పెద్దలకు నోటీసులిస్తామని, టెండర్లపై విచారణ చేస్తామని సిట్ చీఫ్ సర్వశ్రేష్ఠ త్రిపాఠి తెలిపారు. కల్తీ నెయ్యికి బాధ్యులైన అందరినీ విచారిస్తామన్నారు. ప్రస్తుతానికి కేసు దర్యాప్తు ప్రాథమిక దశలోనే ఉందన్నారు.
TG: టీచర్ పోస్టుల భర్తీ కోసం నిర్వహించిన DSC పరీక్ష ఫలితాలు నేడు విడుదల కానున్నాయి. సచివాలయంలో ఉదయం 11 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి ఫలితాలను విడుదల చేస్తారు. 11,062 పోస్టుల భర్తీకి జులై 18 నుంచి ఆగస్ట్ 5వ తేదీ వరకు డీఎస్సీ పరీక్షలు జరిగిన సంగతి తెలిసిందే.
ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో IMF నుంచి లోన్ పొందేందుకు పాకిస్థాన్ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. పాలనా పరమైన ఖర్చులను తగ్గించుకునేందుకు 1,50,000 ప్రభుత్వ ఉద్యోగాలు తొలగిస్తున్నట్లు ప్రకటించింది. అలాగే 6 మంత్రిత్వ శాఖలను రద్దు చేసి, మరో రెండు శాఖలను విలీనం చేయనుంది. దీంతో పాక్‌కు 7 బిలియన్ డాలర్లు లోన్ ఇచ్చేందుకు IMF సిద్ధమైంది. తొలి విడతగా 1బిలియన్ డాలర్లను రిలీజ్ చేసింది.
ఇప్పటికే నిత్యావసరాలు, ఆయిల్స్, పప్పుల ధరలు <<14214575>>పెరగడంతో<<>> ఉక్కిరిబిక్కిరవుతున్న సామాన్యులపై మరో పిడుగు పడింది. ప్రస్తుతం సోనామసూరి, HMT, బీపీటీ తదితర సన్నబియ్యం రకాల ధర కిలో రూ.60-70 ఉంది. బాస్మతీయేతర బియ్యం ఎగుమతులపై నిషేధాన్ని ఎత్తేయడంతో బియ్యం రేట్లు భారీగా పెరగనున్నాయి. పారా బాయిల్డ్, బ్రౌన్ రైస్‌పై ఎగుమతి సుంకాన్ని 20 నుంచి 10 శాతానికి తగ్గించడమూ ప్రభావం చూపనుంది.
అంతర్జాతీయ టీ20ల్లో సంచలనం నమోదైంది. టీ20 WC-2024 రన్నరప్ సౌతాఫ్రికాను ఐర్లాండ్ ఓడించింది. టీ20 చరిత్రలో SAపై ఆ జట్టుకు ఇదే తొలి విజయం. అబుదాబి వేదికగా జరిగిన రెండో టీ20లో తొలుత ఐర్లాండ్ 195/6 స్కోర్ చేయగా, SA 185/9కి పరిమితమైంది. IRE జట్టులో రాస్ అడైర్ సెంచరీతో చెలరేగాడు. దీంతో రెండు మ్యాచుల సిరీస్ 1-1తో సమమైంది.
AP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ OCT 1, 2 తేదీల్లో తిరుమలలో పర్యటించనున్నారు. రేపు గన్నవరం విమానాశ్రయం నుంచి రేణిగుంటకు వెళ్లి, అలిపిరి మెట్ల మార్గంలో కొండ ఎక్కుతారు. రాత్రి 9 గం.కు తిరుమల చేరుకుని అక్కడే బస చేస్తారు. బుధవారం ఉ.10 గం.కు శ్రీవారిని దర్శించుకుని, లడ్డూ ప్రసాద విక్రయ కేంద్రాన్ని పరిశీలిస్తారు. అనంతరం వెంగమాంబ అన్నదాన సత్రంలో భక్తులతో మాట్లాడుతారు. గురువారం సాయంత్రం తిరుపతికి వస్తారు.
AP: GPAతో జారీ చేసిన పదో తరగతి సర్టిఫికెట్ల విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 2012-2019 మధ్య GPA సర్టిఫికెట్లు తీసుకున్న విద్యార్థులు అడిగితే మార్కులు, శాతాలు ఇవ్వాలని అధికారులను ఆదేశించింది. విద్యార్థులు ఇందుకోసం SSC బోర్డు <
APలో పట్టణాలతో పాటు గ్రామాల్లోనూ అబ్బాయిల కన్నా అమ్మాయిల సంఖ్యే ఎక్కువగా ఉందని కేంద్రం తాజాగా వెల్లడించిన గణాంకాలు చెబుతున్నాయి. 2023 జులై నుంచి 2024 జూన్ వరకు కేంద్రం సర్వే నిర్వహించి ఈ గణాంకాలను ప్రకటించింది. దేశంలో 11రాష్ట్రాల్లో అబ్బాయిల కంటే అమ్మాయిల సంఖ్య ఎక్కువగా ఉంది. ఈ లిస్టులో కేరళ టాప్‌లో ఉండగా, AP ఐదో స్థానంలో ఉంది. రాష్ట్రంలో ప్రతి 1000 మంది అబ్బాయిలకు 1,032 మంది అమ్మాయిలున్నారు.
టీమ్‌ఇండియా పేసర్ జస్ప్రీత్ బుమ్రా IPL వేలంలోకి వస్తే టోర్నీ చరిత్రలోనే అత్యధిక ధర పలికిన ఆటగాడిగా నిలుస్తారని మాజీ క్రికెటర్ హర్భజన్ అన్నారు. దీనితో మీరు ఏకీభవిస్తారా? అని తన ఫాలోవర్లను ప్రశ్నించారు. ప్రస్తుతం ముంబై జట్టులో ఉన్న బుమ్రాకు రూ.12కోట్లు వస్తున్నాయి. వచ్చే సీజన్‌కు ఆయన ముంబైతోనే ఉంటారా? ఉంటే వచ్చే ప్రైస్ ఎంత? లేదా ఆక్షన్‌లోకి వస్తారా? అనేది రిటెన్షన్ ప్రక్రియ పూర్తయ్యాక తెలుస్తుంది.
Sorry, no posts matched your criteria.