India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఉక్రెయిన్ నుంచి తమ ప్రాంతంపై దాడులు చేస్తున్న వెస్ట్రన్ కంట్రీస్‌కు రష్యా ప్రెసిడెంట్ పుతిన్ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. తమపై న్యూక్లియర్ వెపన్స్ లేని దేశాల దాడులకు న్యూక్లియర్ పవర్ దేశాలు సాయం చేస్తే దానిని రష్యాపై జాయింట్ అటాక్‌గా పరిగణిస్తామన్నారు. ఎయిర్‌క్రాఫ్ట్, క్రూయిజ్ మిస్సైళ్లు, డ్రోన్లు, హైపర్ సోనిక్, ఇతర ఫ్లయింగ్ ఆబ్జెక్ట్స్‌తో దాడులు చేస్తారని తెలిసినా న్యూక్లియర్ వెపన్స్ వాడతామన్నారు.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన ‘దేవర’ సినిమా భారీ విజయాన్ని పొందాలని మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఆకాంక్షించారు. ‘నా ప్రియమైన తారక్ అన్నకు బెస్ట్ విషెస్. నా సోదరుడు అనిరుధ్ అందించిన మ్యూజిక్ అద్భుతంగా ఉంది. రత్నవేలు చిత్రీకరించిన బెస్ట్ విజువల్స్‌కు అదిరిపోయే బీజీఎం లభించిందని అనుకుంటున్నా. తాను ఊహించుకున్న ప్రపంచాన్ని కొరటాల చాలా బాగా తెరకెక్కించారు. AMBలో FDFSలో కలుద్దాం’ అని ట్వీట్ చేశారు.
చాట్ జీపీటీ మాతృసంస్థ ఓపెన్ ఏఐ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్(CTO) మీరా మురాటి తన పదవికి రాజీనామా చేశారు. ఆరున్నరేళ్లుగా పనిచేస్తున్న కంపెనీని వీడటం కఠినమైనదని ఆమె అన్నారు. జీవితాన్ని అన్వేషించుకోవడానికి ఈ నిర్ణయం తీసుకోక తప్పలేదని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఓపెన్ ఏఐ CEO సామ్ ఆల్ట్‌మన్‌కు ఆమె కృతజ్ఞతలు తెలిపారు.
మితిమీరిన రాజకీయ జోక్యంతో ఢిల్లీ రంజీ జట్టును కాస్త జంబో టీమ్‌గా మార్చేశారు. ఈ రంజీ సీజన్ కోసం ఏకంగా 84 మందితో ప్రాబబుల్స్‌ను డీడీసీఏ ఎంపిక చేసింది. సాధారణంగా రంజీ ప్రాబబుల్స్ 26 నుంచి 33 మంది ఆటగాళ్లకు మించదు. దీనికి మూడు రెట్లు ఎక్కువగా సెలక్ట్ చేయడం గమనార్హం. రంజీలు ఆడటం మానేసిన కోహ్లీ, పంత్‌తోపాటు ఎంపీ పప్పు యాదవ్ కుమారుడు సార్ధక్ రంజన్‌ను కూడా ప్రాబబుల్స్‌లో పెట్టేశారు.
డిస్‌క్వాలిఫై అయి దేశానికి ఒలింపిక్ మెడల్ పోగొట్టిన వినేశ్ ఫొగట్ సారీ చెప్పకుండా దానినో కుట్రగా చిత్రించారని మాజీ రెజ్లర్ యోగేశ్వర్ ఆరోపించారు. ‘రాజకీయాల్లో చేరడం వాళ్లిష్టం. బబితా, నేనూ BJPలో ఉన్నాం. వినేశ్ కాంగ్రెస్‌లో చేరారు. కానీ దేశానికి నిజం తెలియాలి. ఏడాదిగా జరిగిన ఘటనలు, ఒలింపిక్ డిస్‌క్వాలిఫికేషన్, పార్లమెంటు కొత్త భవనం వద్ద ఆందోళనతో భారత ఇమేజ్‌ను చెడుగా చిత్రించారు’ అని విమర్శించారు.
ఎన్టీఆర్ హీరోగా నటించిన ‘దేవర’ మూవీ హాలీవుడ్ సినిమాను మరిపిస్తుందని మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ అన్నారు. హైదరాబాద్‌లో ఫ్యాన్స్‌తో కలిసి ఈ మూవీ చూడాలని ఉందని ఓ ఇంటర్వ్యూలో ఆయన చెప్పారు. ‘ఇంత గొప్ప సినిమాను ఎలా రూపొందించారా అని ఆశ్చర్యమేస్తోంది. ఈ మూవీ చూసేటప్పుడు అవెంజర్స్, బ్యాట్‌మ్యాన్ సినిమాలు చూస్తున్న ఫీల్ వస్తుంది. ఇందులో యాక్షన్, సెంటిమెంట్, డ్రామా అన్నీ ఉన్నాయి’ అని వ్యాఖ్యానించారు.
తాను టీడీపీలో చేరేందుకు ప్రయత్నించినట్లు మంత్రి అచ్చెనాయుడు చేసిన వ్యాఖ్యలను విజయసాయి రెడ్డి ఖండించారు. ‘దేవుడు నిన్ను పుట్టించేటప్పుడు మెదడు, బుద్ధి, జ్ఞానం 0.1% మాత్రమే ఇచ్చాడాయె! దేహం పెరిగినట్టుగా మెదడు వృద్ధి చెందకపోవడంతో మీ చేష్టలు, మాటలు అన్నీ వింతగా ఉంటాయి. నా విధేయతపై జోకులు పేలుస్తున్నావు. నువ్వు ఎంత గట్టిగా అనుకున్నా నేను ఈ జన్మలో కులపార్టీ అయిన టీడీపీలో చేరను’ అని ట్వీట్ చేశారు.
ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం కింద ఏపీకి 2014-24 మధ్య కాలంలో రూ.35491.57 కోట్లు ఇచ్చినట్లు కేంద్ర ఆర్థిక శాఖ తెలిపింది. ఆర్టీఐ కార్యకర్త రవికుమార్ అడిగిన మేరకు కేంద్రం బదులిచ్చింది. పదేళ్లలో ఆర్థిక లోటు భర్తీ కింద రూ.16,078.76 కోట్లు, ఏడు వెనకబడిన జిల్లాల అభివృద్ధికి రూ.1,750 కోట్లు, రాజధాని నగరంలో మౌలిక వసతుల డెవలప్‌మెంట్‌కు రూ.2,500 కోట్లు, పోలవరం ప్రాజెక్టుకు రూ.15,147 కోట్లు ఇచ్చినట్లు పేర్కొంది.
పాకిస్థాన్‌కు IMF గుడ్‌న్యూస్ చెప్పింది. 5% వడ్డీకి $7bn బెయిల్‌ఔట్ ప్యాకేజీని ఆమోదించింది. అందులో $1.1bn ఈ వారంలోనే బదిలీ చేస్తుందని తెలిసింది. పాక్ చరిత్రలోనే అతిపెద్ద ప్యాకేజీ ఇదే కావడం గమనార్హం. ఇదే చివరిది అవ్వాలని కోరుకుంటున్నామని PMO తెలిపింది. భిక్షపాత్రతో నిలబడ్డ ఆ దేశానికి సాయం చేసేందుకు రాష్ట్రాలకు ఆర్థిక బాధ్యతలు ఇవ్వడం, వ్యవసాయ ఆదాయంపై పన్నులు వేయడం వంటి కండిషన్లను IMF పెట్టింది.
ఇజ్రాయెల్-హెజ్‌బొల్లా మధ్య తాత్కాలిక కాల్పుల విరమణకు అమెరికా ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఇటు నార్త్ ఇజ్రాయెల్, అటు సౌత్ లెబనాన్‌లో వేలాది మంది నిరాశ్రయులు కావడంతో యూఎస్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ విషయంపై న్యూయార్క్‌లో జరిగిన యూఎన్ఓ సర్వప్రతినిధి సమావేశాల్లో అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ ప్రపంచ దేశాధినేతలతో చర్చించారు. త్వరలోనే కాల్పులకు తెర పడనుందని తెలుస్తోంది.
Sorry, no posts matched your criteria.