India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

తప్పు చేయకపోయినా చాలా మంది జైళ్లలో శిక్ష అనుభవిస్తుంటారు. అలాంటి ఓ వ్యక్తిని బయటకు తీసుకొచ్చేందుకు అతని పిల్లలు లాయర్లుగా మారారు. యూపీలోని కాన్పూర్‌లో జరిగిన ఓ వివాదంలో అనిల్ గౌర్‌పై తప్పుడు ఆరోపణల కారణంగా అతను 11 ఏళ్ల పాటు జైలు శిక్ష అనుభవించారు. అతడు నిర్దోషని నిరూపించేందుకు కొడుకు రిషభ్, కూతురు ఉపాసన లా చదివారు. తండ్రి కేసుపై ఇద్దరూ అవిశ్రాంతంగా పనిచేసి విజయం సాధించారు.

జమ్మూకశ్మీర్ రాజౌరీ జిల్లాలో ఉగ్రదాడి జరిగింది. నియంత్రణ రేఖ సమీపంలో టెర్రరిస్టులు ఆర్మీ వాహనంపై దాడిచేశారు. అడవిలో దాక్కున్న ముష్కరులు సుందర్‌బని సెక్టార్లోని ఫాల్ గ్రామంలో వెళ్తున్న వాహనంపై ఫైరింగ్ చేశారు. వెంటనే భారత జవాన్లు ప్రతిఘటనకు దిగారు. పారిపోయిన టెర్రరిస్టులను పట్టుకొనేందుకు ఆర్మీ సెర్చ్ ఆపరేషన్ ఆరంభించింది.

TG: CM రేవంత్ నడుపుతున్నది కాంగ్రెస్-BJP సంకీర్ణ సర్కార్ అని BRS ఆరోపించింది. ‘MLC ఎన్నికల ఓటింగ్‌కు ముందు రోజు BJP ప్రధానిని, కాంగ్రెస్ CM కలవడంలో మర్మం ఏంటి? మేము గెలిచినా ఓడినా మాకు ఏమి ఫరక్ పడదు అని CM అనడంలో మతలబు ఏంటి? ఆ ఇద్దరి కళ్లల్లో ఆనందం ఏమిటో? మోదీ అపాయింట్మెంట్ సులువుగా దొరకడం ఏమిటో రాహుల్ అపాయింట్మెంట్ దొరకకపోవడం ఏమిటో?’ అంటూ పీఎం, సీఎం భేటీకి సంబంధించిన ఫొటోను ట్వీట్ చేసింది.

ఛాంపియన్స్ ట్రోఫీలో ఇంగ్లండ్‌తో జరుగుతున్న మ్యాచులో అఫ్గానిస్థాన్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచులో గెలిచిన జట్టుకే సెమీస్ ఆశలు సజీవంగా ఉండనున్నాయి.
అఫ్గానిస్థాన్: గుర్బాజ్, ఇబ్రహీం, సాదిక్, రహ్మత్, హస్మత్, అజ్మత్, నబీ, గుల్బదిన్, రషీద్ ఖాన్, నూర్, ఫరూఖీ
ఇంగ్లండ్: డకెట్, సాల్ట్, స్మిత్, రూట్, బ్రూక్, బట్లర్, లివింగ్ స్టోన్, ఓవర్టన్, ఆర్చర్, రషీద్, వుడ్.

KMC ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంటు తీసుకున్న ఓ నిర్ణయం బెంగాల్లో తీవ్ర వివాదానికి దారితీసింది. విశ్వకర్మ పూజ సెలవు (SEP 17)ను రద్దు చేసి రంజాన్‌కు (APR 1) అదనంగా కేటాయించారు. దీనిపై దేశవ్యాప్తంగా విమర్శలు రావడంతో కోల్‌కతా మున్సిపల్ కమిషనర్ స్పందించారు. తమకు చెప్పకుండానే నిర్ణయం తీసుకున్నారని వివరించారు. KMCED మేనేజర్ సిద్ధార్థ శంకర్‌కు షోకాజ్ నోటీసు పంపారు. సెలవు నిర్ణయాన్ని రద్దు చేశారు.

తాను విడాకులు తీసుకుంటున్నట్లు వచ్చిన వార్తలు పూర్తిగా అబద్ధాలని నటుడు ఆది పినిశెట్టి అన్నారు. తాము సంతోషంగా జీవిస్తుంటే కొన్ని యూట్యూబ్ ఛానల్స్ తమ స్వార్థం కోసం విడాకులు తీసుకుంటున్నట్లు ప్రచారం చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. హీరోయిన్ నిక్కీ గల్రానీని 2022లో ఆది ప్రేమ వివాహం చేసుకున్నారు. ఆయన నటించిన ‘శబ్దం’ ఈ నెల 28న విడుదల కానుంది. ఈ సందర్భంగా మూవీ ప్రమోషన్లలో చిత్రబృందం పాల్గొంది.

కాంగో దేశాన్ని ఓ వింత వ్యాధి 5 వారాలుగా కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. జ్వరం, వాంతులు, అంతర్గత రక్తస్రావంతో ప్రజలు చచ్చిపోతున్నారు. ఈ లక్షణాలు ఎబోలా, డెంగ్యూ, మార్‌బర్గ్, యెల్లో ఫీవర్‌ను పోలివుండటంతో WHO సైతం ఆందోళన వ్యక్తం చేసింది. కొన్ని రోజుల క్రితం బొలొకొ గ్రామంలో గబ్బిలాలను తిన్న ముగ్గురు పిల్లలు 48 గంటల్లోపే చనిపోవడంతో ఔట్‌బ్రేక్ మొదలైంది. 419 మందికి సోకింది. 53 మందిని చంపేసింది.

టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. క్రికెట్ అంటే తనకు ప్రాణమని తాను బతికేదే ఆటకోసమని అన్నారు. ఛాంపియన్స్ ట్రోఫిలో ఇండియా సెమీస్ చేరటంపై రోహిత్ సంతోషం వ్యక్తం చేశారు. కోహ్లీ అంటే తనకెంతో ఇష్టమని.. ఇండియా విజయం కోసం అతను దేనికైనా సిద్ధంగా ఉంటాడని తెలిపారు. ప్రస్తుతం కప్పు గెలవటం పైనే తన పూర్తి ఫోకస్ ఉందని హిట్‌మ్యాన్ వివరించారు.

జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజన జరిగితే TNతో పాటు దక్షిణాది రాష్ట్రాలు నష్టపోతాయన్న ఆ రాష్ట్ర CM స్టాలిన్ వ్యాఖ్యలను KTR సమర్థించారు. దేశానికి అవసరమైనప్పుడు ఈ రాష్ట్రాలే కుటుంబ నియంత్రణను పక్కాగా అమలు చేశాయని చెప్పారు. దేశాభివృద్ధిలో వీటి కృషిని గుర్తించకపోతే ప్రజాస్వామ్య స్ఫూర్తి దెబ్బతింటుందన్నారు. దేశానికి ఆర్థిక తోడ్పాటు అందించే రాష్ట్రాల ఆధారంగా పునర్విభజన జరగాలని డిమాండ్ చేశారు.

వచ్చే ఎన్నికల్లో తామే గెలుస్తామని సినీ నటుడు, టీవీకే చీఫ్ దళపతి విజయ్ ధీమా వ్యక్తం చేశారు. మహాబలిపురంలో టీవీకే పార్టీ మహానాడులో ఆయన మాట్లాడారు. 2026 ఎన్నికల్లో చరిత్ర తిరగరాస్తామని చెప్పారు. పెత్తందార్లు, భూస్వాములు రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికల్లో గెలిచి సామాన్యులకు రాజ్యాధికారం కల్పిస్తామన్నారు. త్వరలోనే పార్టీలోకి కీలక నేతల చేరికలు ఉంటాయని తెలిపారు.
Sorry, no posts matched your criteria.